కందులు - 7 లక్షల టన్నుల కొనుగోలు లక్ష్యం




17-01-2022

కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ అయిన నాఫెడ్చే కర్ణాటకలో కందుల కొనుగోలు ప్రక్రియ ప్రారంభించింది. ప్రస్తుత మార్కెటింగ్ సీజన్ 2021-22 కోసం నాఫెడ్ 7 ల.ట. కందులు కొనుగోలు లక్ష్యం నిర్ధారించింది. ఫలితంగా గత వారం కందులు మరియు పప్పు ధర రూ. 50-100 ప్రతి క్వింటాలుకు వృద్ధి చెందింది. మయన్మార్ లో 2022 కందుల ఉత్పత్తి 2.50 ల.ట. దిగుబడి అయ్యే అవకాశం ఉన్నందున స్వేచ్ఛా వ్యాపార ఒప్పందం కింద దిగుమతి గడువు మార్చి నుండి జూన్ వరకు పొడిగించినందున కందుల ధరల పెరుగుదలకు కళ్లెం పడగలదు.


అంతర్జాతీయ విపణిలో మయన్మార్ లెమన్ కందులు 15 డాలర్లు తగ్గి 785 డాలర్లు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించినందున ముంబైలో లెమన్ కందులు గత వారం మాదిరిగానే రూ. 6100, 88. 5300-5350, మొజాంబిక్ గజరి రూ.5250-5300, మాలవి కందులు రూ. 4700-4800, సూడాన్ సరుకు రూ.6250-6300, మట్వారా రూ. 5200-5300, దిల్లీలో లెమన్ కందులు రూ.6400-6425 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


కర్ణాటక ప్రాంతం కందులు ఇండరో డెలివరి రూ. 100 పెరిగి రూ. 6600-6700, మహారాష్ట్ర సరుకు రూ.6500, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతం కందులు కట్ని డెలివరి రూ. 6800-6900, పప్పు మేలిమి రకం రూ. 9100-9200 మరియు ఛత్తీస్గఢ్ ని రాయ్పూర్లో రూ. 6600, మహారాష్ట్ర సరుకు రూ. 6800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 ఆంధ్రప్రదేశ్లోని వినుకొండలో కందులు రూ.6200, పప్పు రూ. 8200-8500, మాచర్లలో ఒంగోలు ప్రాంతం కందులు రూ. 6200, పొదిలి ప్రాంతం సరుకు రూ.6300, పప్పు రూ. 8400-8600 ధరతో వ్యాపా రమైంది. 

లాతూర్లో ప్రతి రోజు 3 వేల బస్తాల కందుల రాబడిపై 63-నంబర్ మరియు మారుతి కందులు రూ. 100 ఇనుమడించి రూ. 6500-6625, తెల్లకందులు రూ. 6000-6500, వాషింలో 1500 బస్తాల కొత్త కందులు రూ. 5900-6300, సోలాపూర్లో కొత్త కందులు రూ. 5500-6125, 5800-6400, పాత సరుకు రూ. 6000-6350, గులాబీ కందులు రూ. 6000-6300,

 వాషింలో 800 బస్తాలు రూ.6000-6450,

 అకోలాలో ఎర్ర కందులు పాత సరుకు రూ.6725, గవరానిలో రూ. 6700, పప్పు మేలిమి రకం రూ. 9100-9200, కొత్త సరుకు రూ. 9300-9400, నాణ్యమైన సరుకు రూ.9600-9700, సవానంబర్ రూ. 8500-8600, కొత్త సరుకు రూ. 8800-8900, లాతూర్లో కందులు లారీ బిల్టి రూ.6600-6650 ప్రతి క్వింటాలు నాణ్యతానుసారం వ్యాపా రమైంది.

 కర్ణాటకలోని గుల్బర్గాలో 5 వేల బస్తాలు సరుకు రాబడిపై రూ.5800 -6400, బిజాపూర్లో 4 వేల బస్తాలు రూ. 5600-6200, బీదర్లో 2000 -2200 బస్తాలు రూ.5200-6711, రాయిచూర్లో 2500-2700 బస్తాలు రూ. 5960-6400, యాద్గిర్లో రూ. 4289-6599 మరియు మధ్యప్రదేశ్ లోని జబల్పూర్లో 750 బస్తాలు రూ. 5500-6050 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు