వ్యవసాయ - మంత్రిత్వశాఖ వారి వివరాల ప్రకారం 31, డిసెంబర్ వరకు దేశంలో రబీ మినుము పంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 6.43 లక్షల హెక్టార్ల నుండి పెరిగి 5.66 లక్షల హెక్టార్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో మ్యాన్మార్ ఎఫ్ఎక్యూ మినుములు 20 డాలర్లు పెరిగి 795 డాలర్లు మరియు ఎస్ క్యూ 880 డాలర్లు ప్రతిటన్ను ప్రతిపాదించడంతో ముంబాయిలో ఎఫ్ఎక్యూ కొత్త రూ. 6500, పాత రూ. - 6400, చెన్నైలో ఎస్యూ రూ.6750-6800, ఎఫ్ఎక్యూ రూ. 6250, ఢిల్లీలో ఎస్యూ రూ. 7100, ఎఫ్ఎక్యూ రూ. 6550 మరియు కోలకత్తాలో ఎఫ్ఎక్యూ రూ. 6450 ధరతో వ్యాపారమయింది. దక్షిణ భారత పప్పు మిల్లర్లు కొత్త సరుకు కొనుగోలు చేస్తున్నందున దిగుమతి అయిన ఎఫ్ఎక్యూ సరుకుకు డిమాండ్ తగ్గడంతో ధర రూ. 75–100 ప్రతిక్వింటాలుకు తగ్గింది. గతవారం ఆంధ్ర ప్రాంతపు కొత్త పియు-31 రకం మినుములు చెన్నై డెలివరీ రూ.6700, 402 రకం రూ. 7300, తమిళనాడులోని కోవిల్ పట్టి ప్రాంతపు కొత్త సరుకు రూ. 6650 ధరతో వ్యాపారమయింది.
విజయవాడలో కృష్ణా జిల్లా పాలిష్ మినుములు రూ. 7250, సాదా రూ. 6950, నంద్యాలలో పాలిష్ రూ. 6950, సాదా రూ. 6750, ప్రొద్దుటూరు లో పాలిష్ రూ. 6950, సాదా రూ. 6750, ప్రొద్దుటూరు, కడప ప్రాంతాలలో పాలిష్ రూ. 6800, సాదా రూ.6600, విజయవాడలో గుండు పాలిష్ రూ. 11800, మీడియం రూ. 9800, పప్పు రూ. 8200-9200 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది.మహారాష్ట్రలోని అహ్మద్ నగర్లో రూ. 4150-7150, లాతూరులో రూ. 6000-7200, సోలాపూర్లో 3-4 లారీల రాబడిపై రూ. 5000-7300 లోకల్ లూజు మరియు అకోలాలో బిల్జీ రూ. 6500-6700, మోగర్ బోర్డు రకం రూ. 9900-10000, మీడియం రూ. 9500-9600, జల్గాంవ్లో మధ్య ప్రదేశ్ సరుకు రూ. 6000, మహారాష్ట్ర సరుకు రూ. 6200 ధరతో వ్యాపారమయింది. రాజస్తాన్లోని కేకీలో దినసరి 1200 1500 బస్తాల కొత్త మినుముల రాబడిపై రూ.700-800, సవాయ్మదా పూర్, కోటా, సుమేర్పూర్ ప్రాంతాలలో రూ. 5000-5800, ఉత్తరప్రదేశ్లోని లలితప్పూర్లో దినసరి 1200-1500 బస్తాల రాబడిపై రూ. 3800-6050, మహోబాలో రూ. 4200-5600, చందౌసీ, వజీర్ గంజ్ ప్రాంతాలలో రూ. 6400-6600 ధరతో వ్యాపారమయింది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు