గణనీయంగా వృద్దిచెందిన రబీ సేద్యం

 

17-01-2022

 రబీ సీజన్లో ఇప్పటి వరకు అన్ని పంటల సేద్యం గత సీజన్తో పోలిస్తే 8 ల.హె. వృద్ధి చెందింది. దేశంలో సానుకూల వాతావరణం నెలకొన్నందున ఉత్పత్తి మరోసారి గణనీయంగా ఇనుమడించే అంచనా వ్యక్తమవుతున్నది. హర్యాణా, రాజస్తాన్లో రబీ సేద్యం ప్రక్రియ ముగియగా మిగిలిన రాష్ట్రాలలో మరో రెండు వారాలలో చరమాంకంలో పడనున్నదని వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు.


దేశంలో రబీ పంటల సేద్యం జనవరి 14 వరకు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 340.48 ల.హె. నుండి తగ్గి 336.48 ల.హె.కు పరిమితమైందని వ్యవసాయ శాఖ విడుదల చేసిన తమ వారాంతపు నివేదికలో పేర్కొన్నది. ఎందుకనగా, నైరుతి రుతుపవనాల ఆగమనం జాప్యమైనందున ఖరీఫ్ పంట నూర్పిళ్లు కొంత మేర ఆలస్యమయ్యాయి. తద్వారా ఉత్తరప్రదేశ్, హర్యాణా, మధ్య ప్రదేశ్లో రబీ గోధుమ సేద్యం కొంతమేర కుంటుపడింది. అయినప్పటికీ ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆధికారులు పేర్కొన్నారు. భారత ఆహార సంస్థ (ఎఫ్ఐ) వద్ద జనవరి 1 నాటికి బఫర్ ప్రమాణాలను అధిగమించి (214.10 ల.ట.) 320 ల.ట. సరుకు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఇదే విధంగా వరి సేద్యం 24.33 ల.హె. నుండి తగ్గి 19.82 ల.హె.కు పరిమితమైంది.

 ముతక ధాన్యాలు మరియు పౌష్ఠిక ధాన్యాల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 48.91 ల.హె. నుండి తగ్గి 47.82 ల.హె.కు పరిమితం కాగా, 

నూనెగింజల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 82.34 ల.హె. నుండి వృద్ధి చెంది 127 ల.హె.కు విస్తరించింది. ఇందులో ఆవాల సేద్యం 73 ల.హె. నుండి ఇనుమడించి 90.45 ల.హె.కు చేరింది. నూనెగింజల సేద్యం ఇనుమడించినందున వంటనూనెల దేశీయ వినియోగాన్ని భర్తీ చేసేందుకు దోహదపడగలదని అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా, దిగుమతులకు కళ్లెం వేయడానికి దోహదం కాగలదు. ప్రస్తుతం దేశంలోని వంటనూనెల వినియోగం కోసం 60 సరుకు దిగుమతి చేసుకోవలసి వస్తోంది. గడిచిన కొంత కాలం నుండి ప్రపంచ వ్యాప్తంగా వంటనూనెల ధరలు బలపడినందున దేశీయ మార్కెట్లలో ధరలు బలోపేతం చెందాయి. 

దేశంలో ఇప్పటి వరకు అపరాల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1.60 కోట్ల హెక్టార్లకు విస్తరించింది. ఇందులో శనగ సేద్యం 1.12 కోట్ల హెక్టార్లకు విస్తరించి 2021 సేద్యానికి ధీటుగా నిలిచింది. కరోనా మహమ్మారి మూడోదశ విజృంభణ ప్రభావం ఎంతమాత్రం పొడసూపలేదని వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి మొత్తం పంట పరిస్థితి సంతృప్తికరంగా ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. కేవలం కొన్ని రాష్ట్రాలలో మాత్రమే కొంతమేర నష్టం వాటిల్లింది. రబీ సేద్యం ప్రముఖంగా చేపట్టే రాష్ట్రాలలో ఇటీవల సంతృప్తికరమైన వర్షాలు కురిశాయి. దీని వలన పంటలకు ప్రయోజనం చేకూరగలదు. 

గడిచిన కొన్ని రోజుల క్రితం భారీ వర్షాలు కురిసినందున మధ్య ప్రదేశ్లో 48,871 హెక్టార్లు, రాజస్తాన్లో 69,375 హెక్టార్లు, ఉత్తరప్రదేశ్లో 1,11,700 హెక్టార్లు, హర్యాణాలో 97,676 హెక్టార్లు, మహారాష్ట్రలో 5276 హెక్టార్లు విస్తీర్ణంలో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు నవీకరించిన గణాంకాలు తెలుపుతున్నాయి. పంజాబ్లో పంటల వాటిల్లిన నష్టాన్ని అంచనా వేయవలసి ఉంది. అత్యధిక రాష్ట్రాలు అపరాల నిర్ధారిత జనవరి చివరినాటికి భర్తీచేసే అవకాశం ఉంది. ఆగ్నేయ భారత్లో వరి నాట్లు ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తయ్యే అవకాశం కనిపిస్తున్నది. గోధుమ సేద్యం దాదాపు చరమాంకంలో పడినట్లేనని చెప్పవచ్చు. రబీ పంటల సేద్యం జనవరి చివరి నాటికి ముగియగలదని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు. మరో నెల రోజుల తర్వాత గ్రీష్మకాలం పంటల నివేదిక అందుబాటులో ఉండగలదు.


దేశంలోని 137 ప్రముఖ జలాశయాలలో జనవరి 13 వరకు అందుబాటులో ఉన్న నీటి నిల్వలు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 101 శాతం మరియు గడిచిన పదేళ్లతో పోలిస్తే 122 శాతం నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర జల సంఘం పేర్కొన్నది. జనవరి 1-14 వరకు దేశంలో 29.4 ఎంఎంతో సాధారణ వర్షపాతంతో పోలిస్తే నాలుగు రెట్లు నమోదైందని భారత వాతావరణ శాఖ పేర్కొన్నది. ఇదిలా ఉండగా, కనీస మద్దతు ధర కింద కర్ణాటకలో నాఫెడ్ కందుల కొనుగోలు ప్రక్రియ చేపట్టింది. 2021-22 కోసం 7 ల.ట. కందులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నాఫెడ్కు లక్ష్యం నిర్ధారించింది. శనగ కొనుగోలు ప్రక్రియ నాఫెడ్ మార్చిలో ప్రారంభించనున్నది. 


శనగ సేద్యం : 

ప్రస్తుత రబీ సీజన్లో జనవరి 12 వరకు దేశంలో శనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 107.78 ల.హె. నుండి పెరిగి 111.61 ల.హె.కు విస్తరించింది. ఇందులో మధ్యప్రదేశ్లో 24.84 ల.హె. నుండి స్వల్పంగా పెరిగి 24.94 ల.హె., ఉత్తరప్రదేశ్లో 5.85 ల.హె. నుండి 5.94 ల.హె., మహారాష్ట్రలో 23.31 ల.హె. నుండి 25.25 ల.హె., ఆంధ్రప్రదేశ్లో 3.58 ల.హె. నుండి 3.74 ల.హె., గుజరాత్లో 8.40 ల.హె. నుండి 10.54 ల.హె.కు విస్తరించగా, రాజస్తాన్లో 20.63 ల.హె. నుండి తగ్గి 20.42 ల.హె., కర్ణాటకలో 11.75 ల.హె. నుండి 11.30 ల.హె., ఛత్తీస్గఢ్ 3.87 ల.హె. నుండి 3.53 ల.హె.కు పరిమితమైంది.


సిరిశనగ : 

ప్రస్తుత రబీ సీజన్లో జనవరి 12 వరకు దేశంలో సిరిశనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 16.72 ల.హె. నుండి పెరిగి 17.32 ల.హె.కు విస్తరించింది. ఇందులో మధ్యప్రదేశ్లో 5.41 ల.హె. నుండి 6.19 ల.హె., ఉత్తర ప్రదేశ్లో 6 ల.హె. నుండి 6.15 ల.హె.కు విస్తరించగా, బీహార్లో 2.19 ల.హె. నుండి తగ్గి 2.16 ల.హె., పశ్చిమ బెంగాల్లో 1.48 ల.హె. నుండి 1.32 ల.హె.కు పరిమితమైంది.

బఠాణీలు : 

ప్రస్తుత రబీ సీజన్లో జనవరి 12 వరకు దేశంలో బఠాణీల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 7.45 ల.హె. నుండి తగ్గి 6.90 ల.హె.కు విస్తరించగా, ఆంధ్రప్రదేశ్ 2.86 ల.హె. నుండి వృద్ధి చెంది 2.95 ల.హె.కు విస్తరించగా, తమిళనాడులో 2.61 ల.హె. నుండి తగ్గి 2.29 ల.హె., ఒడిశ్శాలో 1.65 ల.హె. నుండి 1.18 ల.హె.కు పరిమితమైంది. 

పెసలు : 

ప్రస్తుత రబీ సీజన్లో జనవరి 12 వరకు దేశంలో పెసల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 5.26 ల.హె. నుండి తగ్గి 3.23 ల.హె.కు విస్తరించగా ఇందులో తమిళనాడులో 34 వేల హెక్టార్ల నుండి 32 వేల హెక్టార్లు, ఒడిశ్శాలో 4.90 ల.హె. నుండి 2.13 ల.హె., ఆంధ్రప్రదేశ్లో 60 వేల హెక్టార్ల నుండి 57 వేల హెక్టార్లకు పరిమితమైంది.

Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు