మధ్యప్రదేశ్ లో కొత్త ధనియాల - ధరల పెరుగుదలకు అవకాశం

 

24-01-2022

ప్రస్తుతం దేశంలోని దనియాల ఉత్పాదక కేంద్రాలలో పంట కోతల ప్రక్రియ ప్రారంభమైంది. మరో 15-20 రోజులలో రాబడులు జోరందుకోగలవు. అయితే ఉత్పత్తి తగ్గినందున కొత్త సరుకు రాబడులతో పాటు ధరలు ఇనుమడించగలవు. తద్వారా సీజన్లో ధరలు తగ్గే అవకాశం ఉంది. ఎందుకనగా, ధరల ఉధృతి కొనసాగుతున్న తరుణంలో తమిళనాడు వ్యాపారులు తమ అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తుంటారు. నిజమైన వ్యాపారులు ధరలు పెరిగిన తరుణంలో సరుకు నిల్వ చేసేందుకు ఆసక్తి చూపరు. అయితే, భారీగా తగ్గిన తరుణంలో విక్రయించేందుకు విముఖత వ్యక్తం చేస్తుంటారు. 








మధ్య ప్రదేశ్లోని జావ్రాలో బుధవారం 10 బస్తాల కొత్త ధనియాల రాబడిపై 10 శాతం నిమ్ము సరుకు రూ. 8811 మరియు 

గుజరాత్ లోని రాజ్కోట్లో శనివారం 7-8 వేల బస్తాల రాబడిపై 20-25 శాతం నిమ్ము సరుకు బాదామీ రూ. 5750, నాణ్యమైన సరుకు రూ. 7500, గునా మార్కెట్లో గత వారం 10-12 వేల బస్తాలు రూ. 8000 -8600, ఈగల్ రూ. 8700- 8800, నాణ్యమైన సరుకు రూ. 8800- 9100, స్కూటర్ రకం రూ. 9400-9500, కుంభరాజ్లో 2500-3000 బస్తాలు బాదామీ రూ.8400-8600, ఈగల్ రూ. 8800-9000, నీమచ్లో 8-10 వేల బస్తాలు బాదామీ రూ.8400 -8500, ఈగల్ రూ. 8800-9000, స్కూటర్ రకం రూ.9400-9600 ధరతో వ్యాపారమైంది. 

ఎన్సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం జనవరి వాయిదా రూ. 9510 తో ప్రారంభమై శుక్రవారం వరకు రూ. 10 తగ్గి రూ. 9500 వద్ద స్థిరపడింది. అయితే, ఏప్రిల్ వాయిదా సోమవారం రూ. 10,190 తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం వరకు రూ.52 తగ్గి రూ.10,138 వద్ద ముగిసింది. 

రాజస్తాన్లోని రామంజ్మండిలో గత వారం 24-25 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ. 8400-8500, ఈగల్ రూ. 9000-9100, స్కూటర్ రకం రూ. 9300-9400, పప్పు బాదామీ రూ. 8800, ఈగల్ రూ. 9200 ప్రతి క్వింటాలు లోకల్ లూజ్ మరియు 40 లారీ బిల్టి బాదమీ రూ. 3900-4000, ఈగల్ రూ. 4100-4200, కోటాలో 4-5 వేల బాదామీ రూ.8500-8600, ఈగల్ రూ.8700-8900, బారన్లో 7-8 వేల బస్తాలు బాదామీ రూ. 8600-8700, రూ. 8800-9000, భవానీమండి, చట్టా, ఇటావా ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి 4-5 వేల బస్తాల సరుకు రాబడిపై బాదామీ రూ.8500-8700, ఈగల్ రూ. 8000-9000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని ఊంఝా మార్కెట్లో ప్రతి రోజు 2500-3000 బస్తాల రాబడిపై ఈగల్ నాణ్యమైన సరుకు రూ. 9000-9100, మీడియం రూ. 8700-8800, సన్న సరుకు రూ. 10,000–10,500, 

రాజ్కోట్లో గత వారం 1500 బస్తాలు బాదామీ రూ.8000 8250, ఈగలూ. 8700 -8925, స్కూటర్ రకంరూ. 9000-9150, బేతప్పూర్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 100 1500 బస్తాలు బాదామీ రూ. 8500 -8700, ఈగల్ రూ.8800 -9000, నాణ్యమైన సరుకు రూ. 9200 -9500, జునాగఢ్ ఈగల్ క్లీన్ సరుకు రూ. 9400, స్కూటర్ రకం రూ. 9800 -9900 ధరతో వ్యాపారమైంది.


ఒంగోలులో బాదామీ ధనియాలు ప్రతి 40 కిలోలు రూ. 4350, ఈగల్ రూ. 4400, స్కూటర్ రకం రూ. 4475 మరియు శీతల గిడ్డంగులలో నిల్వ అయిన సరుకు రూ. 4250 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog