ధనియాలకు కొనసాగుతున్న ధరల ఒరవడి



17-01-2022

ఎన్న్సీడిఇఎక్స్ వద్ద గత సోమవారం జనవరి వాయిదా రూ. 9500 తో ప్రారంభమై శుక్రవారం వరకు హెచ్చు తగ్గుల తర్వాత రూ. 9500 వద్ద స్థిరపడింది. అయితే, ఏప్రిల్ వాయిదా సోమవారం రూ. 10,150 తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం వరకు రూ. 18 తగ్గి రూ.10,132 వద్ద ముగిసింది. 


రాజస్తాన్లోని రామ్ంజ్ మండిలో గత వారం 15-16 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ. 8700–8800, ఈగల్ రూ. 9100-9200, స్కూటర్ రకం రూ. 9300-9500, పప్పు బాదామీ రూ. 9200, ఈగల్ రూ. 9800 ప్రతి క్వింటాలు లోకల్ లూజ్ మరియు 40 లారీ బిల్టి బాదమీ రూ. 3900, ఈగల్ రూ. 4200, కోటాలో 3-4 వేల బస్తాలు, 

బారన్లో 4–5 వేల బస్తాలు, భవానీమండి, చడ్డా, ఇటావా ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి 3-4 వేల బస్తాల సరుకు రాబడిపై బాదామీ నాణ్యమైన సరుకు రూ. 8700-8800, మీడియం రూ. 8400-8500, ఈగల్ నాణ్యమైన సరుకు రూ. 9000–9100, మీడియం రూ. 8900-9000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 మధ్య ప్రదేశ్లోని గునా మార్కెట్లో గత వారం 6-7 వేల బస్తాలు, కుంభరాజ్ 2 వేల బస్తాలు, నీమచ్లో 6-7 వేల బస్తాలు బాదామీ నాణ్యమైన సరుకు రూ. 8600-9000, మీడియం రూ. 8000-8500, ఈగల్ నాణ్యమైన సరుకు రూ. 9200-9500, మీడియం సరుకు రూ.8500-8700, స్కూటర్ రకం రూ. 9500-9700 ధరతో వ్యాపారమైంది. 

గుజరాత్లోని గోండల్ మార్కెట్లో 3–4 వేల బస్తాల సరుకు రాబడిపై ఈగల్ రూ. 8500-8700, సన్న రకం రూ. 9200-9500, రాజ్కోట్లో 1500 బస్తాలు బాదామీ రూ. 8125-8750, ఈగల్ రూ. 890-9125, స్కూటర్ రకం రూ. 9175-9325 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు