పెసర ధరల వివరాలు

 

24-01-2022

ప్రస్తుత రబీ సీజన్ లో జనవరి 19 వరకు దేశవ్యాప్తంగా పెసల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 5.90 ల.హె. నుండి తగ్గి 4.67 ల.హె.కు పరిమితమైంది. అయితే యాసంగి పంట విస్తీర్ణం పెరిగే అవకాశం ఉండడంతో సరఫరా నిరవధికంగా కొనసాగగలదు. ఎందుకనగా ప్రస్తుత ఖరీఫ్లో ఉత్పత్తి తగ్గడంతో పెసలు నిల్వ చేసే వ్యాపారులు, రైతులు ధరలు పెరగకపోవడంతో తమ సరుకును నెమ్మదిగా విక్రయిస్తున్నారు. ఇతర అపరాల ధరలు నిలకడగా ఉన్నందున పెసర ధరలలో ఎక్కువగా తగ్గుదలకు అవకాశం లేదు. 


ఆంధ్ర ప్రాంతపు సన్న రకం చమ్కీరంగు సరుకు చెన్నై డెలివరి రూ. 7000, మహారాష్ట్ర మొగులె సరుకు రూ. 7000, చమ్కీరూ. 7300 ధరతో వ్యాపారమైంది.


అంతర్జాతీయ విపణిలో పేడేశ్వర్ పెసలు 900 డాలర్లు, పొకాకో 980 డాలర్లు, అన్నేశ్వర్ 800 డాలర్లు ప్రతి టన్ను స్థాయిలో నిలకడగా ఉండడంతో 

రాజస్తాన్లోని కేక్, మెడతా, సుమేరప్పూర్, శ్రీగంగానగర్ ప్రాంతాలలో కలిసి 7-8 వేల బస్తాల సరుకు రాబడిపై రూ.5300-6800,

 జైపూర్ 600-6850, పప్పు రూ. 7500-7600, మిటుకులు రూ.6300-7400 ధరతో వ్యాపారమెంది. 

మధ్యప్రదేశ్లోని పిపరియా, హర్దా, జబల్ పూర్ ప్రాంతాలలో ప్రతి రోజు 2-3 వేల బస్తాల సరుకు రాబడిపై రూ. 5400-6850, 

ఇండోర్ రూ. 7000-7300 ప్రతి క్వింటాలు నాణ్యతానుసారం వ్యా పారమైంది. 

ఆంధ్రప్రదేశ్లోని పొన్నూరులో చమ్కీపెసలు రూ. 7100, సాదా రకం రూ. 6950, 

తెలంగాణలోని ఖమ్మంలో పెసలు రూ. 6900, పప్పు సార్టెక్స్ రూ. 8900, నాన్-సార్టెక్స్ రూ. 8700 మరియు

 కర్ణాటకలోని గుల్బర్గా, సేడెం, గదగ్, యాద్గిర్ లో పెసలు రూ. 6000-7100 మరియు 

మహారాష్ట్రలోని సోలాపూర్ రూ. 6300-7100, బారీలో కొత్త పెసలు రూ. 4500-6500,

 జల్గాంవ్లో మధ్య ప్రదేశ్ సరుకు రూ. 6200, మహారాష్ట్ర ప్రాంతపు నాణ్యమైన సరుకు రూ. 6400-6500, మీడియం రూ. 6300, 

అకోలాలో మొగర్ రకం పెసలు.. రూ. 8900-9100 మరియు ఉత్తరపదేశ్లోని లలిత్పూర్లో కొత్త పెసలు రూ. 4550-5960 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.



Comments

Popular posts from this blog