పసుపు ధరలు

 


24-01-2022

దేశంలోని పసుపు ఉత్పాదక రాష్ట్రాలలో వచ్చే నెల నుండి కొత్త పసుపు రాబడులు ప్రారంభమై ప్రస్తుత ధరలను దృష్టిలో పెట్టుకొని కొత్త సరుకు శరవేగంతో దూసుకుపోగలవు. మసాలా యూనిట్లు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోళ్లు చేపట్టే అవకాశం ఉంది. ఎందుకనగా, ప్రస్తుత సీజన్లో ఉత్పత్తి 15–20 శాతం తగ్గగలదని దిగ్గజ మసాలా యూనిట్లు నిర్ధారించు కోవడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే, పాత సరుకు నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నందున ప్రస్తుత ధరలను దృష్టిలో పెట్టుకొని 2022-23 కోసం పసుపు సేద్యం రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది. 



ఇలాంటి పరిస్థితులలో కేవలం మార్చి-జూలై వినియోగం అనుసరించి కొనుగోలు చేసే అవకాశం ఉంది. అధిక ధరలతో కొనుగోలు చేసేందుకు స్టాకిస్టులు ఆసక్తి చూపే అవకాశంలేదు. ఎందుకనగా, మితిమీరిన పెట్టుబడి వ్యయం, వడ్డీ, గిడ్డంగి అద్దె మరియు ఇతరత్రా ఖర్చులు తలకు మించిన భారంగా పరిణమించ గలవు. మహారాష్ట్రలోని కొన్ని ఉత్పాదక ప్రాంతాలలో పసుపు వెలికితీత ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. తెలంగాణ, తమిళనాడులోని ఉత్పాదక కేంద్రాల వద్ద వచ్చే నెల నుండి కొత్త పసుపు రాబడులు పోటెత్తగలవని తెలుస్తోంది.


స్టాకిస్టులు తమ నిల్వ సరుకు ఆఘమేఘాల మీద విక్రయించడం ప్రారంభించారు. మార్కెట్లు మరియు నేరుగా గిడ్డంగుల నుండి సుమారు 1. లక్ష బస్తాల సరుకు వెలువడుతున్నది. తద్వారా గత వారం ధర ప్రతి క్వింటాలుకు రూ.150-200. పతనమైనందున వాయిదా మార్కెట్లో నరుకు కొనుగోలుకు విముఖత వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తున్నది. సీజన్లో ధరలు నెమ్మదించినప్పుడే కొనుగోలు చేసినట్లయితే స్టాకిస్టులకు ప్రయోజనం చేకూరగలదు. ఎందుకనగా, పాత సరుకు నాణ్యత క్షీణిస్తుండడమే ఇందుకు కారణం.

 ఎన్సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం ఏప్రిల్ వాయిదా రూ. 10,332 తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం వరకు రూ. 26 క్షీణించి రూ. 10,358, మే వాయిదా రూ. 14 నష్టంతో రూ. 10,346 వద్ద ముగిసింది.

 తెలంగాణలోని నిజామాబాద్ లో గత వారం 1600-1700 బస్తాల కొత్త సరుకు రాబడిపై ప్రతిభ రకం కొమ్ములు, దుంపలు రూ. 6200-7200 మరియు 3500-4000 బస్తాల పాత సరుకు రాబడిపై అన్-పాలిష్ కొమ్ములు రూ. 8400-9100, దుంపలు రూ. 8000-8400, పాలిష్ కొమ్ములు రూ. 9700-9800, దుంపలు రూ. 8800-9000, నిల అయిన సరుకు కొమ్ములు, దుంపలు రూ. 6500–7300 మరియు

 ఆంధ్రప్రదేశ్ లోని దుగ్గిరాలలో 1800-2000 బస్తాలు కొమ్ములు, దుంపలు రూ. 7200-7300, పుచ్చు సరుకు రూ. 5600-5750 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 మహారాష్ట్రలోని హింగోలిలో గత సోమ, బుధ, శుక్రవారాలలో కలిసి 7-8 వేల బస్తాల రాబడిపై కొమ్ములు రూ. 8300-9000, దుంపలు రూ. 8000-8200, 

నాందేడ్లో 8-10 వేల బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు నాణ్యమై నసరుకు రూ. 9300-9500, మీడియం రూ.7800-8000, దుంపలు రూ. 7800-8500, 

బస్మత్ నగర్ లో 15-16 వేల బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు నాణ్యమైన సరుకు రూ. 9500-10,000, మీడియం రూ. 7500-8000, దుంపలు నాణ్యమైన సరుకు రూ. 8800-9000, మీడియం రూ. 7500-8500, 

సాంగ్లీలో 5-6 వేల బస్తాల సరుకు అమ్మకంపై రాజాపురి నాణ్యమైన సరుకు రూ. 10,000- 10,500, మీడియం రూ. 8500-8700, దేశీ కడప రూ. 8500-8600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

తమిళనాడులోని ఈరోడ్లో గత మంగళ, గురువారాలలో కలిసి 12 13 వేల బస్తాల రాబడిపై కొమ్ములు నాణ్యమైన సరుకు రూ. 8500-9000, మీడియం రూ. 4500-5000, దుంపలు నాణ్యమైన సరుకు రూ. 7000-7500, మీడియం రూ. 5500-6000, పెరుందరైలో 2000–2200 బస్తాలు కొమ్ములు రూ. 6456-8731, దుంపలు రూ. 5869-7969 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.



Comments

Popular posts from this blog