తగ్గిన బెల్లం ధరలు

  


17-01-2022

ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లోని శీతల గిడ్డంగులలో జనవరి 10 నాటికి బెల్లం నిల్వలు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 5,30,237 బస్తాల నుండి 1,73,788 బస్తాలు తగ్గి 3,56,449 బస్తాలకు పరిమితమయ్యాయి. ఇందులో చాకూబెల్లం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 3,23,170 బస్తాల నుండి తగ్గి 2,42,220 బస్తాలు, పాపిడి 44,256 నుండి 34,862, రస్కట్ 27,747 నుండి 10,373, కురుపా 7211 బస్తాల నుండి 4453, రాబటిన్ 1,09,888 నుండి 44,670 బస్తాలకు పరిమితం కాగా, చదరాలు 18,165 బస్తాల నుండి పెరిగి 19,871 బస్తాల నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ముజఫర్ నగర్ మరియు హాపూర్లో వాతావరణం సానుకూలించనందున బెల్లం తయారీకి అవరోధం ఏర్పడింది. తద్వారా గత వారం మార్కెట్లో రాబడులు లేవు. మధ్యప్రదేశ్లోని కరేలిలో గత సోమవారం నుండి శుక్రవారం వరకు 50-60 వాహనాల సరుకు రాబడిపై గులాబీ రకం రూ. 2600-2700, నర్సింగ్ూర్లో గురువారం 20-25 వాహనాలు రూ. 2575-2625 మరియు మహారాష్ట్రలోని సాంగ్లీలో గత వారం 18-20 వేల దిమ్మల కొత్త బెల్లం రాబడి కాగా, సురభి రకం రూ. 3350-3500, గుజరాత్ రకం రూ. 3400-3550, ముంబై రకం రూ. 3400-3600, సోలాపూర్లో 15 వేల దిమ్మలు నాణ్యమైన సరుకు రూ. 3000-3150, మీడియం రూ.2900-2950, ఎరుపు-నలుపు మిక్స్ రూ. 2600-2650, లాతూరులో 17-18 వేల దిమ్మలు నాణ్యమైన సరుకు రూ. 2800-2850, ఎరుపు- నలుపు మిక్స్ రకం రూ.2600-2625 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 


కర్నాటకలోని మాండ్యాలో గత వారం 60-65 వాహనాల సరుకు రాబడిపై ఎరుపు రకం రూ. 2800, సింగల్ ఫిల్టర్ రూ. 2900, డబుల్ ఫిల్టర్ రూ. 3000, చదరాలు రూ. 3150-3200, మహాలింగపూర్లో 6-7 వాహనాలు సురభి రకం రూ.3400, మీడియం రూ. 3300-3350, గుజరాత్ రకం రూ. 3250-3300, చదరాలు రూ. 3500, అరకిలో ముక్కలు రూ.3550-3600, 250 గ్రాముల ముక్కలు రూ.3650, శిమోగాలో 10-15 వాహనాలు దేశీ బెల్లం రూ. 3450–3500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో గత వారం 55-60 వేల దిమ్మల కొత్త బెల్లం గులాబీ రకం రూ. 3400–3500, మీడియం రూ. 3150-3250, మీడియం రూ.2950-3000, నలుపు రూ. 2600-2650 మరియు చిత్తూరులో 25-30 వాహనాల ఎసి సరుకు రాబడిపై సురభి రకం రూ. 3900, సూపర్-ఫైన్ రూ. 4200, సాట్నా రకం రూ. 3500, నలుపు రూ. 3000 ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని సేలం మార్కెట్లో గత వారం 2-3 వేల బస్తాల బెల్లం రాబడిపై తెలుపు 30 కిలోలు రకం రూ. 1320-1330, సురభి రకం సరుకు రూ. 1290-1310, ఎరుపు రకం రూ. 1270-1290 ధరతో వ్యాపారమైంది. సంక్రాంతి పండుగ సందర్భంగా పిలకలపాలయం, చిత్తోడ్, కౌందప్పాడి మార్కెట్లు మూసివున్నాయి.

Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు