బెల్లం కొనుగోళ్లు పెంచిన స్టాకిస్టులు

 

24-01-2022

ఉత్తరప్రదేశ్ శీతల గిడ్డంగులలో ఇప్పటి వరకు బెల్లం నిల్వలు గత ఏడాదితో పోలిస్తే తగ్గినట్లు అందిన సమాచారంతో స్టాకిస్టుల కొనుగోళు జోరందుకున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల స్టాకిస్టులు కూడా సరుకు నిల్వ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎందుకనగా, సరుకుపై తక్కువ పెట్టుబడి మరియు ధర రూ. 500-600 పెరిగినట్లయితే 10 శాతం లాభం చేకూరడం తథ్యమని భావించడమే ఇందుకు ప్రధాన కారణం.



 ఉత్తర ప్రదేశ్లో ప్రతికూల వాతావరణం, కూలీల కొరత వలన బెల్లం తయారీ ప్రక్రియ కుంటుపడినందున గత వారం ధర రూ. 100-125 ప్రతి క్వింటాలుకు వృద్ధి చెందింది. అయితే, ఇతర రాష్ట్రాల ఉత్పాదక కేంద్రాల వద్ద రాబడులు ఒత్తిడికి గురైనందున ధర ప్రతి క్వింటాలుకు రూ. 100-150 పతనమైంది. 

ఉత్తర ప్రదేశ్లోని ముజఫర్ నగర్ లోని శీతల గిడ్డంగులలో జనవరి 17 నాటికి బెల్లం నిల్వలు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 5,62,894 బస్తాల నుండి 1,95,506 బస్తాలు తగ్గి 3,67,388 బస్తాలకు పరిమితమయ్యాయి. ఇందులో చాకూబెల్లం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 3,42,649 బస్తాల నుండి తగ్గి 2,46,120 బస్తాలు, పాపిడి 44,632 నుండి 34,862, రస్కట్ 29,057 నుండి 11,168, కురుపా 7336 బస్తాల నుండి 4453, రాబటిన్ 1,17,789 నుండి 50,914 బస్తాలు, చదరాలు 21,431 బస్తాల నుండి 19,871 బస్తాల సరుకు నిల్వ ఉన్నాయి. 

ముజఫర్ నగర్లో ప్రతి రోజు 2500-3000 బస్తాల రాబడిపై ప్రతి 40 కిలోలు చాకూ బెల్లం రూ. 1150-1350, కురుపా రూ. 1200-1230, లడ్డు రూ. 1351-1415, పౌడర్ బెల్లం రూ. 1275-1290 మరియు హాపూర్లో 2-3 వాహనాలు రూ. 1125-1150 ధరతో వ్యాపారమైంది. 

మధ్యప్రదేశ్లోని కరేలిలో గత సోమవారం నుండి శుక్రవారం వరకు 40-45 వాహనాల సరుకు రాబడిపై రూ. 2600-2900, నర్సింగ్పూర్లో గురువారం 20-25 వాహనాల రాబడిపై ఎరుపు-సురభి మిక్స్ రూ. 2550-2600 మరియు 

మహారాష్ట్రలోని సాంగ్లీలో గత వారం 16-17 వేల దిమ్మల కొత్త బెల్లం రాబడి కాగా, సురభి రకం రూ. 3300-3400, గుజరాత్ రకం రూ. 3200-3400, ముంబై రకం రూ. 3300-3500, 

సోలాపూర్లో 15-16 వేల దిమ్మలు సురభి రకం రూ. 2950-3000, మీడియం రూ. 2800-2850, ఎరుపు-నలుపు మిక్స్ రూ. 2600–2650, లాతూరులో 18-20 వేల దిమ్మలు సురభి రకం రూ.2900-2950,ఎరుపు- నలుపు మిక్స్ రూ.2600-2650 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 కర్నాటకలోని మాండ్యాలో గత వారం 75-80 వాహనాల సరుకు రాబడిపై ఎరుపు రకం రూ. 2800-2850, సింగల్ ఫిల్టర్ రూ. 2900 -2950, డబుల్ ఫిల్టర్ రూ. 3000 3050 చదరాలు రూ.3150-3200, 

మహాలింగపూర్ లో 8-10 వాహనాలు సురభి తెలుపు మిక్స్ రూ. 3400-3425, ఎరుపు మిక్స్ రూ.3250-3300, చదరాలు రూ. 3450, అరకిలో ముక్కలు రూ. 3500, శిమోగాలో 18-20 వాహనాలు దేశీ బెల్లం రూ. 3450-3500 ధరతో వ్యాపారమైంది. 

అనకాపల్లిలో గత వారం 40-45 వేల దిమ్మల కొత్త బెల్లం గులాబీ రకం నాణ్యమైన సరుకు రూ. 3100-3150, మీడియం రూ. 2750- 2800, Sev o. 2650 2700 మరియు 

చిత్తూరులో 30-35 వాహనాల ఎసి సరుకు రాబడిపై సురభి రకం రూ. 3900, సూపర్-ఫైన్ రూ. 4200, సాట్నా రకం రూ.3500, నలుపు రూ. 3100 ధరతో వ్యాపారమైంది. తమిళనాడు లోని సేలం మార్కెట్లో గత వారం 5 వేల బస్తాల బెల్లం రాబడిపై ధర రూ. 30-40 తగ్గి n తెలుపు 30 కిలోలు రకం రూ. 1300-1320, సురభి రకం సరుకు రూ. 1270-1290, ఎరుపు రకం రూ. 1230-1250, పిలకలపాలయం, చిత్తోడ్, కౌందప్పాడి. ప్రాంతాలలో 7-8 వేల బస్తాలు తెల్లబెల్లం రూ. 1170- 1190, సురభి రకం రూ. 1140-160, ఎరుపు రకం రూ. 1120-1140 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog