పామాయిల్ ధరలు తగ్గే అవకాశం లేనట్లే

 

02-01-2022

2018 మరియు 2019 లో రైతులు ఎరుమల వినియోగాన్ని తగ్గించినందున దిగుబడుల కొరతను ఎదుర్కోవలసి వస్తోందని మలేషియా పామాయిల్ ఉత్పాదక దేశాల సమాఖ్య (సిపిఒపిసి) పేర్కొన్నది. చాలా కాలం నుండి కూలీల కొరత కూడా ఎదుర్కోవడంతో పాటు తగ్గిన పామాయిల్ ఉత్పత్తి మరో సంవత్సరం కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని సిపిఒపిసి తెలిపింది. తద్వారా 2022 లో ధరలు ఇనుమడిస్తూనే ఉండగలవని తెలుస్తోంది.



ప్రపంచ పామాయిల్ సరఫరాలో ఇండోనేషియా, మలేషియా ఇరుదేశాల భాగస్వామ్యం 85 శాతం ఉండగా, గడిచిన ఆరు నెలల నుండి నైట్రోజన్ మరియు ఫాస్పేట్ ధరలు 50-80 శాతం వృద్ధి చెందినందున చిన్నతరహా రైతులకు దీని వినియోగం మోయలేని భారమైంది. కావున 2022 లో కూడా ఈ రెండు దేశాలలో పామాయిల్ ఉత్పత్తి క్షీణించగలదని భావిస్తున్నారు. ప్రస్తుతం సరఫరా కుంటుపడినందున ధరలు పెరగడంతో పాటు 2021 ముడిపామాయిల్ వాయిదా ధర 31 లో శాతం వృద్ధి చెంది 5220 రింగిట్ (1252.25 డాలర్) ప్రతి టన్నుకు ఎగబాకింది. రాబోయే నెలలలో కుడా సరఫరా ఇనుమడించే అవకాశం చైనా ఆర్థిక పరిస్థితి 2021-22 లో మెరుగుపడినందున పామాయిల్ దిగుమతులు ముందు సంవత్సరంతో పోలిస్తే 68 ల.ట. నుండి వృ చెంది 72 ల.ట. చేరవచ్చని సిపిఒపిసి పేర్కొన్నది. భారతదేశం 2020-21 లో 85 ల.ట. సరుకు దిగుమతి చేసుకోగా ఈసారి పెరిగి 86 ల.ట., ఐరోపా సమాఖ్య 62 ల.ట. నుండి పెరిగి 69 ల.ట.కు చేరవచ్చని సిపిఒపిసి భావిస్తున్నప్పటికీ చివరగా ఒమిక్రాన్ ప్రభావం పై ఆధారపడి ఉండగలదని కూడా పేర్కొంటున్నది.

Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు