క్షీణించిన కొబ్బరి కొనుగోళ్లు

 

09-01-2022

దక్షిణాది రాష్ట్రాలలో ఈ ఏడాది గణనీయమైన కొబ్బరికాయల ఉత్పత్తితో పాటు కొత్త సీజన్ మిగులు నిల్వలతో ప్రారంభమైంది. కరోనా మహమ్మారి మూడోదశ విజృంభణతో వివాహాల సీజన్ కోసం డిమాండ్ తగ్గినందున ధరలు కుంగుబాట పడుతున్నాయి. ఇటీవల కేరళ, తమిళనాడులో కురిసిన వర్షాల వలన కొబ్బరి పంటకు ప్రయోజనం చేకూరినందున కొబ్బరి కాయల పరిమాణం వృద్ధి చెందగలదని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు పెంచినందున ఈ ఏడాది ధరలు ఆశించినంతగా పెరిగే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. కరోనా కారణంగా దేవాలయాలలో కొబ్బరి కాయల వినియోగం తగ్గే అవకాశం ఉంది. 


ఆంధ్రప్రదేశ్లోని అంబాజిపేట లో ప్రతి రోజు 80-100 టన్నుల కొబ్బరి రాబడిపై ఎక్స్పోర్ట్ రకం రూ. 9000 –9300, మీడియం రూ. 8200 -8300, యావరేజ్ రూ. 7200-7600 మరియు పాలకొల్లు లో 25-30 వాహనాల కొబ్బరి కాయలు రాబడి కాగా, నాణ్యమైన పునాస రకం రూ.9500, మీడియం రూ. 7500, యావరేజ్ రూ.5500, నాణ్యమైన కొబ్బరి కాయలు రూ. 8000, మీడియం రూ.6500, యావరేజ్ రూ. 5000 (1000 కాయలు) ధరతో వ్యాపారమై ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది.

 కర్ణాటకలోని టిప్టూర్లో వారాంతపు సంతలో 2 వేల బస్తాల సరుకు రాబడిపై బంతి కొబ్బరి రూ. 17,250-18,000, కిరాణా రకం మీడియం సరుకు రూ. 18,000, కిరాణా రకం రూ. 12,500-13,000, మీడియం రూ. 11,000-11,500, మిల్లింగ్ కొబ్బరి రూ. 10,000 ధరతో వ్యాపారమై మహారాష్ట్ర, పంజాబ్, కోసం రవాణా అవుతున్నది. 

అరిసేకేరి, సి.ఆర్. పట్నం మంగళూరు, తుంకూరు ప్రాంతాలలో గత వారం 3 వేల బస్తాల కొబ్బరి రాబడిపై నాణ్యమైన 17,200-17,500, మీడియం రూ. 15,000-16,000, మిల్లింగ్ సరుకు రూ. 8500-11,000 ధరతో వ్యాపార మైంది. 

తమిళనాడులోని కాంగేయంలో సాదా రూ. 9000, మిల్లింగ్ స్పెషల్ రూ. 9150, మెరికో రూ. 9200-9300 ప్రతి క్వింటాలు మరియు కొబ్బరి నూనె ప్రతి 15 కిలోల డబ్బా రూ. 2020-2070, 

వెల్లకోవిల్, అన్నామలై, అవిలుందురై ప్రాంతాల మార్కెట్లలో 2 వేల బస్తాల సరుకు రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 8270-9500, మీడియం రూ. 7500-8000 మరియు 

కొచ్చి, త్రిచూర్ లో కొబ్బరి నూనె రూ. 15,200-15,300, పెరుందురైలో వేల బస్తాల కొబ్బరి రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 9300 -9800, కోజికోడ్ రాజాపురి కొబ్బరి రూ. 19,500, రాసి రూ. 9500, మిల్లింగ్ కొబ్బరి రూ. 10,000, బంతి కొబ్బరి రూ. 16,000, దిల్ పసంద్ రూ. 10,000 ప్రతి క్వింటాలు మరియు కొబ్బరి కాయలు (1000) రూ. 31,000, వడకారలో రాజాపురి కొబ్బరి రూ. 17,900, ఎండు సరుకు రూ. 12,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు