ఎన్సీడిఇఎక్స్ వద్ద గత సోమవారం జనవరి వాయిదా రూ. 10,460 తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం వరకు రూ. 196 క్షీణించి రూ. 10,264 మరియు మే వాయిదా రూ. 194 నష్టంతో రూ. 10,290 వద్ద ముగిసింది.
తమిళనాడులోని ఈరోడ్లో గత మంగళ, గురువారాలలో కలిసి 30-35 వేల బసాలు, రాసిపురంలో 2 వేల బస్తాల రాబడిపై కొమ్ములు నాణ్యమైన సరుకు రూ. 8000-8300, మీడియం రూ. 5000-5500, దుంపలు నాణ్యమైన సరుకు రూ. 7000- 7300, మీడియం రూ. 5500-6000, పుచ్చు సరుకు రూ. 4500-5000,
పెరుందరైలో 5 వేల బస్తాలు కొమ్ములు రూ.6889-9039, దుంపలు రూ. 5267-8193,
గోబిచెట్టిపాలయంలో కొమ్ములు రూ. 6004-8889, దుంపలు రూ. 5099-8089 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపార మైంది. తెలంగాణలోని
నిజామాబాద్లో గత వారం 600-700 బస్తాల కొత్త సరుకు రాబడిపై ప్రతిభ రకం కొమ్ములు, దుంపలు రూ. 6200-7200, మీడియం రూ. 6300-6400 మరియు 5000 – 5500 బస్తాల పాత సరుకు రాబడిపై అన్-పాలిష్ కొమ్ములు రూ. 8500 - 9000, దుంపలు రూ. 7400 7800, పాలిష్ కొమ్ములు రూ. 9300 -9400, దుంపలు రూ. 8600-8700, పరంగల్ నిల్వ అయిన సరుకు కొమ్ములు, దుంపలు రూ. 6800 -7200 మరియు ఆంధ్రప్రదేశ్లోని
దుగ్గిరాలలో 2 వేల బస్తాలు కొమ్ములు, దుంపలు రూ.7100-7150-7200, సేలం రకం రూ. 7400-7500, పుచ్చు సరుకు రూ. 5600-5800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
మహారాష్ట్రలోని హింగోలిలో గత సోమ, బుధ, శుక్రవారాలలో కలిసి 5-6 వేల బస్తాల రాబడిపై కొమ్ములు రూ. 8400-9200, దుంపలు రూ. 7800-8500,
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు