ఈ ఏడాది దేశంలో కందిపంట విస్తీర్ణం పెరిగినప్పటికీ, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వలన దిగుబడి తగ్గడం మరియు గత ఏడాది పోలిస్తే నాణ్యత లోపించినందున మిల్లుల కోసం నాణ్యమైన సరుకులకు డిమాండ్ నెలకొన్నది. భారత్ ద్వారా దిగుమతులు పెరిగే అవకాశం ఉండడంతో అంతర్జాతీయ మార్కెట్లో మయన్మర్ లెమన్ మరియు లింక్లీ కందుల ధర 40 డాలర్లు పెరిగి 825 డాలర్లు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించడంతో ధరలు బలోపేతం చెందాయి. స్టాకిస్టులు కూడా అప్రమత్తమవుతున్నారు. అంతేకాకుండా రాబోవు నెల నుండి వినియోగదారుల కోసం పప్పుకు మంచి డిమాండ్ నెలకొనే అవకాశం ఉన్నందున ధరలకు బలం చేకూరింది.
ముంబాయిలో కొత్త లెమన్ రూ. 50 పెరిగి రూ. 6150-6175, అరుషా రూ. 5400-5450, మొజాంబిక్ గజరీ రూ.5300-5350, మాలవి రూ. 4800-400, సూడాన్ రూ. 6400-6450, మట్వారా రూ.5250-5350 మరియు ఢిల్లీలో లెమన్ రూ. 6450 ధరతో వ్యాపారమయింది. మహారాష్ట్ర ప్రాంతపు కందులు చెన్నై డెలివరీ రూ. 7000-7100, గుజరాత్ బిడిఎన్ 2 రకం రూ. 7200 ధరతో వ్యాపారమయింది. లభించిన సమాచారం ప్రకారం గత రోజులలో తమిళనాడు ప్రభుత్వం కందిపప్పు కొనుగోలుకోసం జారీ చేసిన టెండరులో అరుణాచల్ ఇంపెక్స్ ప్రై. లి. వారు 20000 టన్నుల కందిపప్పు సరఫరా కోసం కనిష్టంగా రూ. 88692 ప్రతి టన్ను ధర ప్రతిపాదించగా, మూర్తిట్రేడర్స్ 8000 టన్నుల కందిపప్పు సరఫరా కోసం గరిష్టంగా రూ. 95400 ప్రతిటన్ను ధర ప్రతిపాదించబడింది.
కర్నాటక ప్రాంతపు కందులు ఇండోర్ డెలివరీ రూ. 6600-6700, మహారాష్ట్ర రూ. 6500-6550, మహారాష్ట్ర మరియు కర్నాటక లోని కట్నీ డెలివరీ రూ. 6900-7000 మరియు ఫట్కాపప్పు రూ. 200 పెరిగి రూ. 9300-9400 మరియు ఛత్తీస్ఘడ్ లోని రాయిపూర్లో రూ. 6800 మరియు మహారాష్ట్ర ప్రాంతం సరుకు రూ. 7000 ధరతో వ్యాపారమయింది.
కల్బుర్గిలో దినసరి 8-10 వేల బస్తాల రాబడిపై రూ. 6500-6600, ఫట్కా రూ. 9100-9600, బీజాపూర్లో 2500-3000 బస్తాల రాబడిపై రూ. 5600-6350, ముద్దెబిహాల్లో 3-4 వేల బస్తాలు, సిందగిలో 800-1000 బస్తాలు, హుమ్నాబాద్లో 700-800 బస్తాలు, సేడెంలో 800-1000 బస్తాలు, యాద్గిర్ 2500-3000 బస్తాలు, ఇతర అన్ని ఉత్పాదక కేంద్రాలలో కలిసి 4-5 వేల బస్తాల రాబడిపై రూ. 5200-6700, మధ్య ప్రదేశ్లోని జబల్పూర్ 500-550 బస్తాల రాబడిపై రూ. 5500-6050 ధరతో వ్యాపారమయింది
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు