జూన్ వరకు కందులు దిగుమతికి అవకాశం - ధరలు స్థిరం


 02-01-2022

వ్యాపారస్తుల కథనం ప్రకారం దేశంలో కందుల ఉత్పత్తి ప్రభుత్వ వర్గాల అంచనా ప్రకారం 44లక్షల టన్నులతో పోలిస్తే 20 శాతం తగ్గి 32-33 లక్షల టన్నులు ఉండే అవకాశం కలదు. ఇందుకు ముఖ్య కారణమేమనగా, భారీ వర్షాలు మరియు చీడపీడల కారణంగా ఈ ఏడాది సరుకు నాణ్యత మరియు దిగుబడి తగ్గుచున్నది. అయితే, కేంద్ర ప్రభుత్వం ధరలను అదుపులో ఉంచడం కోసం 21, డిసెంబర్ న స్వేఛ్చాదిగుమతుల వ్యవధిని జూన్, 2022 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించడంతో ధరలు కొంతమేర తగ్గాయి. ఎందుకనగా, ఏప్రిల్ నుండి నవంబర్, 2021 లో ఆఫ్రికా దేశాలు మరియు మాన్మార్ నుండి సుమారు 4 లక్షల టన్నులకు పైగా కందులు దిగుమతి అయ్యాయి మరియు కొత్త సీజన్ లో 3-4 లక్షల టన్నుల దిగుమతుల వలన కూడా 2022 లో సరుకు కొరత ఉండగలదు. కావున జూన్ తరువాతనే ధరలు ఎక్కువగా పెరిగే పరిస్థితి ఉంది.


అంతర్జాతీయ మార్కెట్లో మయన్మార్ లెమన్ మరియు లింక్లీ కందుల ధర 25 డాలర్లు పెరిగి 725 డాలర్లు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించినప్పటికీ, ముంబాయిలో కొత్త లెమన్ ధర తగ్గి రూ. 5750, t . 5100-5150, మొజాంబిక్ గజరీ రూ.5150-5200, మాలవి రూ.4600-4650, సూడాన్ కందులు రూ.5950-6000, మట్వారా రూ. 5000-5050 ధరతో వ్యాపారం కావడంతో మహారాష్ట్రలోని లాతూరు, సోలాపూర్, అక్కల్ కోట్, దూధ్నీ, ఔరంగాబాద్, జాల్నా ప్రాంతాల సరుకు చెన్నై డెలివరీ రూ. 6500-6700, గుజరాత్ బిడిఎన్ 2 రకం రూ.6850 ధరతో వ్యాపారమయింది.


కర్నాటక ప్రాంతపు కందులు ఇండోర్ డెలివరీ రూ. 6200-6300, మహారాష్ట్ర ప్రాంతపు తెలుపు రూ.6050-6100, మహారాష్ట్ర మరియు కర్నాటకలోని కట్నీ డెలివరీ రూ.6500-6600, కట్నీ, బిలాస్పూర్, భాటాపారా లలో ఫట్కాపప్పు రూ. 8700-8800 ధరతో వ్యాపారమయింది. రాబోవు 10, జనవరి నుండి అన్ని మార్కెట్లలో నిరవధికంగా సరుకు రాబడులు ఉండగలము. ఎందుకనగా, కర్నాటకలోని కల్బుర్గి ప్రాంతంలో ఆమావాస్య తరువాత పెద్ద రైతుల పంట కోతలు ఉండగలవు. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో కోతలు కొనసాగుతున్నాయి. అయితే, చలి అధికంగా ఉండడం వలన పంట ఎండడంలో ఆలస్యమౌతున్నది.


లాతూరులో దినసరి 2000-2500 బస్తాలు, అహ్మద్ నగర్ 1000-1200 బస్తాల కందుల రాబడిపై 63 నెం. మరియు మారుతి రూ. 6000 -6300, తెలుపు రూ. 5500-6100, ఎరుపు మిక్స్ రూ. 5900, నలుపు రూ. 5800, బార్టీలో 1500-2000 బస్తాల రాబడిపై రూ. 5500-6050, సోలాపూర్లో 60-65 లారీల రాబడిపై రూ.5500-6000 ధరతో వ్యాపారము యింది. జాల్నాలో 2000-2500బస్తాల రాబడిపై తెలుపు రూ.5500-6350, ఎరుపు రూ. 5200-6100, అకోలాలో గులాబీ రూ. 6450, గావరానీ రూ.6350, ఫట్కాపప్పు మీడియం రూ. 8500-8700, నాణ్యమైన రూ.8800-8900, సవానెంబర్ పప్పు రూ. 8300 -8450 ధరతో వ్యాపారము యింది. తాండూరులో కొత్త కందులు రూ. 5039-6209, ఖమ్మంలో రూ. 5500, పప్పు సార్టెక్స్ రూ. 8550, నాన్ 8100, నారాయణపేటలో దినసరి 300-400 బస్తాల రాబడిపై ఎరుపు రకం రూ. 4000-6775, తెలుపు రూ.5500-6769, జడ్చర్లలో 250-300 బస్తాల రాబడిపై రూ. 3829 -5897 ధరతో వ్యాపారమయింది.


కర్నాటకలోని కల్బుర్గిలో దినసరి 3-4 వేల బస్తాలు, బిజాపూర్లో 3000-3500, ముద్దె బిహాల్ లో 3-4 వేలు, సిందగిలో 1000-1200, యాద్గిర్ 1000 -1500, గుర్మిట్కాల్లో 1500-2000 , సురుపూర్లో 800-1000 బస్తాల రాబడిపై రూ.5500-5850 లోకల్ లూజు ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది. మధ్యప్రదేశ్లోని పిపరియాలో దినసరి 150-200, కరేలీలో 40-50 బస్తాల కొత్త కందుల రాబడిపై రూ. 5000-5300 ధరతో వ్యాపారమయింది.




Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు