మయన్మార్లో పెరిగిన మినుముల సేద్యం

 

17-01-2022

ప్రస్తుత రబీ సీజన్లో జనవరి 12 వరకు దేశంలో మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 7.45 ల.హె. నుండి తగ్గి 6.90 ల.హె. కు 2.29 పరిమితమైంది. రాష్ట్రాల వారీగా తమిళనాడులో 2.61 ల.హె. నుండి తగ్గి 2. ల.హె., ఒడిశ్శాలో 1.65 ల.హె. నుండి 1.18 ల.హె.కు పరిమితం కాగా, ఆంధ్రప్రదేశ్లో 2.86 ల.హె. నుండి పెరిగి 2.95 ల.హె.కు విస్తరించింది.


ఈ ఏడాది మయన్మార్లో మినుముల సేద్యం భారీగా విస్తరించినందున ఉత్పత్తి ముందు సంవత్సరంతో పోలిస్తే 8 శాతం వృద్ధి చెంది 6.75 ల.ట. సరుకు దిగుబడి కాగలదని భావిస్తున్నారు. తద్వారా దిగుమతి కోటాను పెంచవలసిందిగా భారత ప్రభుత్వంపై మయన్మార్ ఒత్తిడి తెస్తున్నది. అంతేకాకుండా ఉత్పాదక కేంద్రాల వద్ద పండుగ సందర్భంగా మినుముల ధరలకు స్థిరత్వం నెలకొన్నది. అంతర్జాతీయ విపణిలో మయన్మార్ మినుములు 10 డాలర్లు తగ్గి ఎఫ్ఎక్యూ 795 డాలర్, ఎస్యూ 880 డాలర్ ప్రతి టన్ను ప్రతిపాదించినరదున ముంబైలో ఎఫ్ఎక్యూ కొత్త సరుకు రూ. 50 పెరిగి రూ. 6550, పాత సరుకు రూ. 6450, చెన్నైలో ఎఫ్ఎక్యూ రూ. 6250, ఎస్క్యూ రూ. 6750, దిల్లీలో ఎస్క్యూ రూ. 7125, ఎఫ్ఎక్యూ రూ. 6625, కోల్ కతాలో రూ. 6500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఎఫ్ఎక్యూ రూ.6350, విజయవాడలో పాలిష్ మినుములు రూ. 7000, అన్-పాలిష్ రూ.6800, మహారాష్ట్రలోని లాతూర్లో రూ. 6000-7200, సోలాపూర్లో 3-4 వాహనాలు సరుకు రాబడిపై రూ. 5000-7300, అకోలాలో బిల్టి రూ. 6500-6800, మోగర్ మినుములు రూ. 9900-10,000, మీడియం రూ.9500-9600, మధ్య ప్రదేశ్లోని హర్దా, జబల్పూర్, టికమ్ఢ్ ప్రాంతాలలో 4-5 వేల బస్తాలు రూ. 3000-5800, ఇండోర్లో రూ. 6300-6500 మరియు రాజస్తాన్లోని కేక్, కోటా, సుమేర్పూర్ ప్రాంతాలలో 5-6 వేల బస్తాలు రూ. 5000-6700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు