రాగులు

 

09-01-2022

కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో వరి మరియు రాగులు ప్రధానంగా సాగు చేస్తుంటారు. హనూర్ మరియు చామరాజనగర్ తాలూకాలలో రాగులు భారీగా ఉత్పత్తి అవుతుంటాయి. రాగుల పంట నూర్పిడి ప్రక్రియ ఇటీవలనే ముగిసింది. నిల్వ సౌకర్యం అందుబాటులో ఉన్న రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయించేందుకు సరుకు నిల్వ చేశారు. ప్రభుత్వం రూ. 3370 కనీస మద్దతు నిర్ధారించగా, మార్కెట్లో వ్యాపారులు రూ. 2700–2800 ప్రతి క్వింటాలుకు ప్రతిపాదిస్తున్నారు. ప్రభుత్వం త్వరలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నది. ఆర్థికంగా వెనుకబడిన చిన్న తరహా రైతులు తమ సరుకును చౌక ధరతో మార్కెట్లలో విక్రయిస్తున్నారు.


గత వారం మహబూబ్నగర్ 2-3 వాహనాల రాగుల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 2500-3200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై విజయవాడ కోసం రవాణా అవుతున్నది మరియు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, చీపురుపల్లి ప్రాంతాలలో నిల్వ అయిన సరుకు తణుకు, తాడేపల్లిగూడెం డెలివరి రూ. 3000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఈ ఏడాది రాగుల ఉత్పత్తి తగ్గనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. దేశంలో ఏయేటి కాయేడు వినియోగం పెరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుత ధరతో కొనుగోలు చేసి నిల్వ చేయడం వ్యాపారులకు శ్రేయస్కరం.

Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు