వచ్చే వారం నుండి కొత్త మిర్చి రాబడులు పోటెత్తే అవకాశం
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
-
02-01-2022
దేశంలోని అన్ని మార్కెట్లలో కలిసి గత వారం 7 లక్షల బస్తాలకు పైగా కొత్త మిర్చి రాబడి అయింది. నాణ్యమైన సరుకు రకాల కొనుగోళ్లు జోరందుకున్నందున ధరలపై ఎలాంటి దుష్ప్రభావం పొడసూపలేదు. వచ్చే వారం రాబడులు మరింత పోటెత్తగలవని తెలుస్తోంది. మిరప పొడి కోసం దేశీయంగా భారీ డిమాండ్ ఉన్నందున గ్రైండింగ్ యూనిట్ల కొనుగోళ్లు జోరందుకున్నాయి. లాభసాటి ధరలు లభ్యమవుతున్నందున రైతులు పంట కోతలు శరవేగంతో చేపడుతున్నారని తెలుస్తోంది.గత వారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని మార్కెట్లలో కలిసి దాదాపు 2 లక్షల బస్తాలు, మధ్య ప్రదేశ్లో 2 లక్షల బస్తాలు, కర్ణాటకలో 3 లక్షల బస్తాలకు పైగా కొత్త మిర్చి రాబడి అయింది. గుంటూరు శీతల గిడ్డంగుల నుండి మరో 3 లక్షల బస్తాలు, ఖమ్మం, వరంగల్లో 50 వేల బస్తాలు, కర్ణాటకలో 20 వేల బస్తాల సరుకు రాబడులను పరిశీలిస్తే స్టాకిస్టులు మరియు రైతులు పోటీపడి సరుకు విక్రయిస్తున్నట్లు అవగతమవుతుంది.
గుంటూరు మార్కెట్లో గత వారం శీతల గిడ్డంగుల నుండి 3 లక్షల బస్తాల సరుకు రాబడి కాగా, 1.25 లక్ష బస్తాల సరుకు విక్రయించబడింది. తేజ డీలక్స్ రూ. 500 పతనం కాగా, 334, సూపర్-10, బంగారం రూ. 800, నెంబర్-5, 577 రూ. 500 వృద్ధి చెందగా మిగిలిన అన్ని రకాల ధరలు చెక్కుచెదరలేదు. గుంటూరు యార్డులో ఎ కర్నూలు, ఎమ్మిగనూరు, ప్రకాశం, భద్రాచలం 1.65 లక్షల బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా 1 లక్ష బస్తాల సరుకు అమ్మకంలో డీలక్స్ రకాలు డిమాండ్ చవిచూశాయి. 70 శాతం నిమ్ము సరుకు మరియు 30 శాతం నాణ్యమైన సరుకు రాబడి కాగా డీలక్స్ రకాలు, తేజ, సిడ్ రకాల తాలు కాయలు ధర రూ. 500 వృద్ధి చెందాయి. ప్రస్తుతం తేజ రకాల రాబడులు భారీగా కొనసాగుతున్నాయి. వచ్చే వారం మరింత పెరగగలవని భావిస్తున్నారు. గుంటూరు శీతల గిడ్డంగులలో నిల్వ అయిన
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు