మినుములు ధరలు పెరిగే అవకాశం లేనట్లే

 

24-01-2022

ప్రస్తుత రబీ సీజన్లో జనవరి 19 వరకు దేశంలో మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 7.80 ల.హె. నుండి తగ్గి 7.22 ల.హె.కు పరిమితమైంది. అయితే వ్యాపారస్తుల అంచనా ప్రకారం ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మరియు ధరలను పరిగణలోకి తీసుకుంటే యాసంగి సీజన్ కోసం మధ్య ప్రదేశ్, బిహార్లలో విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా దిగుమతులు కొనసాగే అవకాశం కలదు. మే నెల వరకు ఆంధ్ర, తమిళనాడులలో కొత్త సరుకు రాబడులు కొనసాగగలవు. కావున ధరలు బలపడే అంచనా లేదు. 






తెలంగాణలోని అన్ని మార్కెట్లలో కలిసి దినసరి 4-5 వేల బస్తాల కొత్త మినుముల రాబడి కాగా, నాగర్కర్నూల్లో దినసరి 800-1000 బస్తాల రాబడిపై రూ.6960-7220 లోకల్లూజ్ ధరతో P వ్యాపారమెంది. ఆంధ్రలోని కృష్ణా జిల్లా 402 రకం మినుములు చెన్నె డెలివరి రూ. 7100, పియు-37 రకం రూ. 6600-6700, తమిళనాడులోని తిరునల్వేలి, సంకరన్ కోవిల్ ప్రాంతాల కొత్త మినుములు టూటికోరిన్ డెలివరి రూ. 7150 ధరతో వ్యాపారమెంది. అంతర్జాతీయ విపణిలో మయన్మార్ మినుములు 15 డాలర్లు పెరిగి ఎఫ్ఎక్యూ 810 డాలర్, ఎస్యూ 895 డాలర్ ప్రతి టన్ను ప్రతిపాదించినప్పటికీ, ముంబైలో ఎఫ్ఎక్యూ కొత్త సరుకు రూ. 50 తగ్గి రూ. 6500, పాత సరుకు రూ. 6400, చెన్నైలో ఎఫ్ఎక్యూ రూ. 6225, ఎస్యూ రూ.6700, దిల్లీలో ఎస్క్యూ రూ.7050, ఎఫ్ఎక్యూ రూ. 6550, కోల్కతాలో రూ.6350-6400 ధరతో వ్యాపారమైంది.


ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఎఫ్ఎక్యూ రూ. 6325, విజయవాడలో పాలిష్ మినుములు రూ. 7000, సాదా రూ. 6800, గుండూ పాలిష్ నాణ్యమైన సరుకు రూ. 11,700, మీడియం రూ. 9700, పప్పు రూ. 8200-9200 మరియు మహారాష్ట్రలోని లాతూర్లో ఖరీఫ్ సీజన్ సరుకు రూ. 6000-7000, సోలాపూర్లో 3-4 వాహనాల సరుకు రాబడిపై రూ. 5000 - 7300, జల్గాంవ్లో మధ్య ప్రదేశ్ సరుకు రూ. 6400, మహారాష్ట్ర సరుకు రూ. 6800, అకోలాలో బిల్టి రూ. 6500-6800, మోగర్ మినుములు బోల్డ్ రకం రూ. 9900-10,000, మీడియం రూ. 9500-9600, మధ్య ప్రదేశ్లోని హర్దా, జబల్పూర్ ప్రాంతాలలో 6-7 వేల బస్తాల సరుకు రాబడిపై రూ. 4000-6150, ఇండోర్లో రూ.6300-6400 మరియు రాజస్తాన్లోని కేక్, కోటా, సుమేర్పూర్ ప్రాంతాలలో 7-8 వేల బస్తాల సరుకు రాబడిపై రూ. 6000-7000 ప్రతి క్వింటాలు ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు