ప్రస్తుతం నువ్వులకు కొరవడిన ఎగుమతి డిమాండ్ మరియు దేశంలో సంక్రాంతి పండుగ కొనుగోళ్లు ముగిసినందున ధర ప్రతి క్వింటాలు రూ. 500-600 పతనమైంది. రాజస్తాన్లోని బికనీర్, కోటా, నోఖా, పాలి, గంగానగర్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 10-12 వేల బస్తాల సరుకు రాబడిపై తెల్లనువ్వులు రూ. 9000-10,000, గజ్జర్ నువ్వులు రూ. 8700-9000, తమిళనాడు డెలివరి రూ. 7300, తెల్లనువ్వులు రూ.7500 ప్రతి క్వింటాలు ధరతో జనవరి 20 వరకు లోడింగ్ కండిషన్తో వ్యాపారమైంది. ఒడిశ్శాలోని మల్కన్ గిరి ప్రాంతంలో కొత్త నువ్వుల రాబడి సంక్రాంతి తర్వాత ప్రారంభమై రాబడులు మరింత పోటెత్తే అవకాశం ఉంది.
గత వారం మధ్య ప్రదేశ్లోని డబ్రా, ధతియా, గ్వాలియర్ మార్కెట్లలో హళ్లింగ్ సరుకు రూ. 10,100-10,200,
గుజరాత్లోని రాజ్కోట్, జునాగఢ్, అమ్రేలి మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి గత వారం 5-6 వేల బస్తాల రాబడిపై నాణ్యమైన తెల్ల నువ్వులు రూ. 10,800-11,100, మీడియం రూ. 10,400-10,800, యావరేజ్ రూ. 10,000-10,350 మరియు 2 వేల బస్తాల నల్లనువ్వుల ప్రీమియం బ్రాండ్రూ. 11,800-12,200, జడ్ బ్లాక్ రూ. 11,750–12,250, యావరేజ్ రూ. 9500-10,800, క్రషింగ్ రకంరూ. 7000-8500 ధరతో వ్యాపారమైంది.
కర్నాటకలోని ముదగల్, అరిసెకేరి, కల్బుర్గి, చిత్రదుర్గ్ ప్రాంతాలలో నాణ్యమైన కు రూ. 10,000-10,500, తమిళనాడు డెలివరి 75 కిలోల బస్తా రూ. 7500-8500,
ఆంధ్రప్రదేశ్లోని సత్తెనపల్లి, నరసరావుపేట, కడప, రాజంపేట ప్రాంతాలలో నాణ్యమైన సరుకు రూ. 9100-9200, హళ్లింగ్ సరుకు తమిళనాడు డెలివరి రూ. 9700-9800 ప్రతి క్వింటాలు మరియు మైసూరులో 75 కిలోల బస్తా రూ. 7500-8500 ధరతో వ్యాపారమె తమిళనాడు కోసం రవాణా అయింది. పశ్చిమ బెంగాల్లో మైక్రో-క్లీన్ రూ. 8800-9500 జిఎస్టితో, అన్-క్లీన్ రూ. 7000-700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తమిళనాడు కోసం రవాణా అవుతున్నది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు