ప్రస్తుత రబీ సీజన్లో జనవరి 14 వరకు దేశవ్యాప్తంగా శనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 107.78 ల.హె. నుండి 111.61 ల.హె.కు విస్తరించింది. రాష్ట్రాలవారీగా మధ్యప్రదేశ్లో 24.84 ల.హె. నుండి పెరిగి 24.94 ల.హె., ఉత్తరప్రదేశ్లో 5.85 ల.హె. నుండి 5.94 ల.హె., మహారాష్ట్రలో 23.31 ల.హె. నుండి 25.25, ఆంధ్రప్రదేశ్లో 3.58 ల.హె. నుండి 3.74 ల.హె., గుజరాత్లో 8.40 ల.హె. నుండి 10.54 ల.హె.కు విస్తరించగా, రాజస్తాన్లో 20.50 ల.హె. నుండి తగ్గి 20.42 ల.హె.కు, కర్ణాటకలో 11.75 ల.హె. నుండి 11.03 ల.హె., ఛత్తీస్గఢ్ 3.87 ల.హె. నుండి 3.53ల.హె.కు పరిమితమైంది.
గత వారం మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ఉత్పాదక కేంద్రాల వద్ద రాబడులు తగ్గినందున ధర ప్రతి క్వింటాలుకు 50-75 ఇనుమడించింది. ఈసారి సేద్యం భారీగా విస్తరించడమే కాకుండా వాతావరణం సానుకూలంగా పరిణమించినందున దిగుబడులు మరియు ఉత్పత్తి సంతృప్తికరంగా ఉండగలదని వ్యవసాయ | అధికారులు తమ ఆశాభావం వెలిబుచ్చారు. ఫిబ్రవరి నుండి దక్షిణాది రాష్ట్రాల నుండి కొత్త సరుకు రాబడులు ప్రారంభం కాగలవు. వ్యాపారులు సరుకు కొనుగోలుకు ఆసక్తి కనబరిచే అవకాశం కనిపించడంలేదు. కావున భవిష్యత్తులో ధరలు చెప్పుకోదగ్గ స్థాయికి పెరగవని స్పష్టతున్నది. అయితే, ఫిబ్రవరిలో కొంత కాలం పాటు వివాహాది శుభకార్యాలకు ఆస్కారం ఉన్నందున మరియు మార్చిలో నాఫెడ్చే కనీస మద్దతు ధరతో కొనుగోలు ప్రక్రియ ప్రారంభించ నున్నందున ధర రూ. 200-250 వృద్ధి చెందే అవకాశం ఉంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు