కర్ణాటకలో కొత్త చింతపండు రాబడులకు శ్రీకారం

 

09-01-2022

 సానుకూలంగా పరిణమించినందున ఈ నెలాఖరు నాటికి దక్షిణాది రాష్ట్రాలలో చింతపండు రాబడులు పోటెత్తే అవకాశం కనిపిస్తున్నదని వ్యాపారులు పేర్కొంటున్నారు. కొత్త సీజన్ భారీ మిగులు నిల్వలతో ప్రారంభమవుతున్నది. అమ్మకాలు సాధారణంగా కొనసాగినందున ధరలు ప్రభావితం చెందలేదు. ఈ ఏడాది దక్షిణాదిలోని కొన్ని ఉత్పాదక ప్రాంతాలలో అతివృష్టి వలన చింతకాయలకు కీటక సంక్రమణం కొనుగొనబడింది. తద్వారా ఉత్పత్తి ప్రభావితం కాగలదని వ్యాపారులు భావిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు చెట్లపైన ఉన్న కాయ అత్యంత సంతృప్తికరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని నెలలలో కొత్త సరుకు రాబడులు ప్రారంభమయ్యే అంచనా వ్యక్తమవుతున్నది. కొత్త సరుకు రాబడులు ప్రారంభమైన వెంటనే పాత సరుకుకు డిమాండ్ డీలా పడగలదు. అంతేకాకుండా, దేశవ్యాప్తంగా కరోనా ఒమిక్రాన్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నందున కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ ప్రకటించాయి. వివాహాది శుభ కార్యాలు పరిమితం కావడమే కాకుండా హోటళ్లు, రెస్టారెంట్లు వినియోగం కుంటుపడే అవకాశం కనిపిస్తున్నది. కావున మార్చి-ఏప్రిల్ వరకు సరఫరా కుంటుపడే అవకాశం ఉంది. కర్ణాటకలోని బెల్గాం, రాణిబెన్నూర్, హోస్పేట, తుంకూరు చింతచెట్ల నూర్పిడి ప్రక్రియ ప్రారంభమైంది. తుంకూరులో గత వారం 500 కిలోల కొత్త చింతపండు రాబడి కాగా రూ. 8000-13,000, హోస్పేటలో 150-200 కిలోలు రూ. 9000-10,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్లో కూడా 40-50 కిలోల కొత్త చింతపండు రాబడి అయింది. తుంకూరులో జనవరి 13 మరియు హిందూపూర్లో జనవరి 27న కొత్త చింతపండు ముహూర్త వ్యాపారం ఖరారయ్యే అవకాశం ఉంది. కావున ఫిబ్రవరిలో రాబడులు పోటెత్తగలవు. జగదల్పూర్లో కూడా ఇదే వ్యవధిలో ప్రారంభం కాగలవు. మైసూరు, తుంకూరు ప్రాంతాలలో కలిసి 5-6 వాహనాల ఎసి సరుకు అమ్మకంపై మహారాష్ట్ర ఫ్లవర్ నాణ్యమైన సరుకు రూ. 8900-10,000, స్థానికంగా రూ. 6500-8000, ల రూ. 18,800-20,000, మేలిమి రకం రూ. 13,500-15,000, మీడియం రూ. 10,500–12,000, ఫ్లవర్ మీడియం రూ. 4800-500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


ఆంధ్రప్రదేశ్లోని హిందూపుర్ మార్కెట్లో గత వారం 7-8 వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకం కాగా, మేలిమి రకం రూ. 13,800 -16,000, మీడియం రూ. 10,000 -12,000, యావరేజ్ సరుకు రూ. 8000-9000, ఫ్లవర్ నాణ్యమైన సరుకు రూ. 8500-9000, మీడియం రూ. 6500-7500, యావరేజ్ రూ.5000-5500, పలమనేరు, మదనపల్లిలో 20-25 వాహనాల సరుకు వ్యాపారం కాగా, మేలిమి రకం రూ.12,800 -14,000, చపాతీ రూ. M 10,200 - 10,500, ఫ్లవర్ రూ. 7800 8500, మీడియం రూ. 5800 -6500, గింజ సరుకు రూ. 3400 -3600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. విజయనగరం, పార్వతీపురం, రాయఢ ప్రాంతాలలో గత వారం 20-25 వాహనాల శీతలగిడ్డంగుల సరుకు అమ్మకం కాగా, సెమీ ఫ్లవర్ నాణ్యమైన సరుకు రూ. 8000-8100, మీడియం రూ. 6000-6200, యావరేజ్ రూ. - 5300-5500, గింజ సరుకు జగదల్పూర్ • డెలివరి రూ.3200-3300, స్థానికంగా - రూ. 3100 ధరతో వ్యాపారమైంది.


ఛత్తీస్గఢ్ లోని జగదల్ పూర్ లో 12-15 వాహనాలు మరియు మధ్యప్రదేశ్లోని ఇండోర్ 5-6 = వాహనాల ఎసి సరుకు అమ్మకంపై ఫ్లవర్ మీడియం రూ.6500-7500, గింజు • సరుకు రూ. 2500-2900, ఓం బ్రాండ్ రూ. 9000, తరానా, ఉన్హేల్లో 8-10 వాహనాల ఎసి సరుకు అమ్మకం కాగా, రంగువెలిసిన గింజ సరుకు రూ. 2400-2500, రంగు సరుకు రూ. 200-200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై గుజరాత్, తమిళనాడు కోసం రవాణా అవుతున్నది.


తమిళనాడులోని పాపర పట్టిలోని శీతలగిడ్డంగుల నుండి గత వారం 15-20 వాహనాల సరుకు అమ్మకంపై మహారాష్ట్ర చపాతీ రూ. 8500 -9000, స్థానికంగా రూ. 8000 - 8500, బెస్ట్ రూ. 8800-9000 రంగువెలిసిన సరుకు రూ. 850-8700, మహారాష్ట్ర నాణ్యమైన గింజ సరుకు రూ.3200-3500, స్థానికంగా రూ. 2800-3000, నలగ్గొట్టని చింతపండు రూ. 2200-2400 మరియు సేలంలో 10-15 వాహనాల సరుకు అమ్మకంపై మేలిమి రకం రూ. 11,100 -12,000, మహారాష్ట్ర చపాతీ రూ. 8800-9000, ఫ్లవర్ రూ. రంగు వెలిసిన గింజ సరకు రూ.2800-3200 మరియు కంబంలో 8-10 వాహనాలు, ధర్మపురిలో 5-6 వాహనాలు, దిండిగల్లో 6-7 వాహనాల సరుకు అమ్మకంపై ఫ్లవర్ రూ. 8500-9500, చపాతీ 9500-10,500, గింజ సరుకు రూ. 3600-3800 మరియు క్రిష్ణగిరిలో 10 వాహనాలు నాణ్యమైన గింజ సరకు రూ. 4500-5500, కర్ణాటక సరుకు రూ. 3000-3500, స్థానికంగా రూ. 2800-3000 ధరతో వ్యాపారమైంది.


చింతగింజలు

ఈ ఏడాది చింత చెట్ల నుండి కాయలను రాల్చే ప్రక్రియ జాప్యమవుతున్నందున చింతగింజల రాబడులు ఫిబ్రవరి చివరి నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని హిందుపూర్ మార్కెట్లో చింతగింజల ధర రూ.1550-1575, పప్పు సూరత్ డెలివరి రూ. 2950-3000, పౌడర్ రూ.3800, పుంగనూరులో చింతగింజలు 1500-1550,రూ. పప్పు పౌడర్ రూ. 2950-3000, 3800-3900, సాలూరులో చింతగింజలు రూ.1400, పుంగనూరు డెలివరి రూ. 1650, సిద్దిపేటలో చింతగింజలు రూ. 1500-1525, పప్పు రూ. 3000, పౌడర్ రూ.3800-3900 ప్రతి ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.



Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు