ప్రతి సంవత్సరం మాదిరిగా గత బుధవారం 30 బస్తాల కొత్త పసుపు రాబడిపై ప్రతిభా రకం 15 శాతం నిమ్ము రకం కొమ్ము మరియు గట్టా రూ.6500-7100 ప్రతి క్వింటాలు ధరతో ముహూర్త వ్యాపారమయింది.
వ్యాపారస్తుల కథనం ప్రకారం ఈ ఏడాది పంట దిగుబడి తగ్గుచున్నది. దీనితో ఉత్పత్తి 15-20 మేర తగ్గవచ్చు. అయితే, పాత సరుకు నిల్వలు కూడా ఉన్నాయి. కొందరు వ్యాపారులు పంట దిగుబడి భారీగా తగ్గగలదని అంచనా వేస్తున్నారు. కావున, సీజన్లో పాత సరుకు అమ్మకంతోపాటు కొత్త సరుకు కోసం రైతులకు మంచి ధరలు లభించవచ్చు. కాని అధిక ధరలతో నిల్వచేసే వ్యాపారులకు చివరికి నష్టం వాటిల్లవచ్చు. ఎందుకనగా, 2022లో ధరలు అధికంగా ఉండడం వలన విస్తీర్ణం పెరగడానికి దోహదం కాగలదు మరియు సీజన్ చివరలో స్టాకిస్టుల అమ్మకాలు అధికంగా ఉండగలవు. గతవారం వాయిదా మార్కెట్లో రూ. 600-650 పెరగడంతో ఈ ప్రభావం మార్కెట్ పై పడింది. దీనివలన ఉత్పాదక కేంద్రాలలో రాబడులు ఉన్నప్పటికీ ధరలు రూ.250-300 ప్రతిక్వింటాలుకు పెరిగాయి.
ఎన్సిడిఇఎక్స్లో సోమవారం పసుపు ఏప్రిల్ వాయిదా రూ. 8950 తో ప్రారంభమైన తరువాత శుక్రవారం వరకు రూ. 658 పెరిగి రూ. 9608 మరియు మే వాయిదా రూ. 478 పెరిగి రూ. 9580 తో ముగిసింది.
నిజామాబాద్లో గతవారం సోమవారం నుండి శుక్రవారం వరకు 5 వేల బస్తాల పాత సరుకు రాబడిపై అన్పాలిష్ కొమ్ము రూ. 7800-8400, గట్టా రూ.7200-7600, పాలిష్ కొమ్ము రూ. 8700-8800, గట్టా రూ. 8400-8500 మరియు
వరంగల్లో నిల్వ అయిన పాత కొమ్ము మరియు గట్టా రూ.6800-7100, దుగ్గిరాలలో 600-700 బస్తాల రాబడిపై కొమ్ము మరియు గట్టా రూ. 6750-6950, పుచ్చు రకం రూ.5500-5600 ధరతో వ్యాపారమయింది. అయితే, 140 లారీలు ప్రభుత్వ ఏజెన్సీలు కొమ్మురూ. 6950, గట్టా రూ. 6500 ప్రతిక్వింటాలు ధరతో విక్రయించాయి.
మహారాష్ట్రలోని హింగోలిలో గత సోమ, బుధ మరియు శుక్రవారాలలో కలిసి 2500-3000 బస్తాల రాబడిపై కొమ్ము రూ. 8000-8800, గట్టా రూ. 7400-7900,
నాందేడ్లో గతవారం 10-12 వేల బస్తాల అమ్మకంపై నాణ్యమైన కొమ్ము రూ. 9500-9700, మీడియం రూ. 8000-8200, గట్టా రూ. 7500-8000 మరియు
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు