గత వారం వర్షాలకు దెబ్బతిన్న మిర్చి పంట

 


17-01-2022

గత వారం వరుసగా మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మిర్చి పంటకు తీరని నష్టం వాటిల్లింది. గుంటూరు మార్కెట్లో గత వారం మూడు రోజుల లావాదేవీలలో శీతల గిడ్డంగుల నుండి 90 వేల బస్తాల కొత్త మిర్చి రాబడిపై 50 వేల బస్తాలవ సరుకు అమ్మకమైంది. అన్ని రకాల ధరలు స్థిరపడ్డాయి. గుంటూరు యార్డులో కర్నూలు, ఎమ్మిగనూరు, ప్రకాశం, భద్రాచలం 1.90 బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా 1.40 లక్ష బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో 60 శాతం నిమ్ము సరుకు మరియు 40 శాతం నాణ్యమైన రాబడి కాగా, డీలక్స్ రకాలు భారీ డిమాండ్ చవిచూశాయి. డీలక్స్ రకాలలో డిడి, 341, తేజ, సీడ్ రకం, తాలు కాయలు రూ. 200-300 వృద్ధి చెందాయి. గత వారం కురిసిన వర్షాల వలన మరో వారం రోజులపాటు నిమ్ము సరుకు రాబడికే అవకాశం ఉంది. 


గుంటూరు శీతల గిడ్డంగులలో నిల్వ అయిన తేజ నాణ్యమైన సరుకు రూ. 13,500-15,500, డీలక్స్ రూ. 15,600-15,800, మీడియం బెస్ట్ రూ. 12,000-13,400, మీడియం రూ. 11,000–11,900, బడిగ-355 రూ. 17,000-20,000, సింజెంట బడిగ రూ.13,000-16,000, 341 రూ. 13,000-16,500, నెంబర్-5 రూ. 13,500-17,000, సూపర్-10 మరియు 334 రూ. 13,500-16,500, డీలక్స్ రూ. 16,600-16,800, మీడియం బెస్ట్ రూ. 12,000-13,400, మీడియం రూ. 11,000-11,900, ఆర్మూర్ రకం రూ. 11,500-13,500, బంగారం రకం రూ. 12,000- 14,500, అన్ని సీడ్ రకాల మీడియం మరియు మీడియం బెస్ట్ రూ. 11,000-13,000, తాలు కాయలు తేజ రూ. 7000-7800, ఇతర రకాలు రూ. 4000-7000 ధరతో వ్యాపారమైంది.


గుంటూరులో తేజ కొత్త సరుకు రూ. 12,500-15,200, డీలక్స్ రూ. 15,300-15,500, మీడియం రూ. 10,000–12,400, 355-బడిగ రూ. 12,000-17,000, సింజెంట బడిగ రూ. 12,000-15,000, డిడి రూ. 13,000-16,800, డీలక్స్ రూ. 16,900-17,000, 2043 రూ. 14,000-19,000, బుల్లెట్ రకం రూ. 10,000-15,000, నెంబర్-5 రూ. 13,000-16,000, సూపర్-10, 334 రూ. 12,500-15,500, 273 రూ. 12,500-14,500, బంగారం రూ. 12,500-15,500, ఆర్మూరు రకం రూ. 10,000-12,500, మీడియం బెస్ట్ సీడ్ రకాలు రూ. 9,000-11,500, తాలు కాయలు తేజ రూ. 6500-8000, ఇతర రకాలు రూ. 3000-7000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 తెలంగాణలోని వరంగల్ 25-27 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై తేజ రూ. 12,500-15,250, 341 నాణ్యమైన సరుకు రూ. 13,000-18,000, తాలు కాయలు తేజు రూ.5000-7500, 341 రూ. 4000-7000, మరియు 4-5 వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు తేజు రూ.12,000-14,300, వండర్ హాట్ రూ. -15,000-18,500, టమాట రూ. 19,000-24,500, 

ఖమ్మంలో 7 వేల బస్తాల ఎసి సరుకు నాణ్యమైన తేజ రూ. 16,000, తాలు కాయలు రూ. 6800 మరియు 80 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై తేజ రూ. 15,400, మీడియం రూ. 14,500-15,000, తాలు కాయలు రూ. 7500 ధరతో వ్యాపారమైంది..


హైదరాబాద్ లో గత వారం 23-24 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై తేజ రూ. 10,000-15,000, బడిగ రూ. 15,000-20,000, 273 మీడియం బెస్ట్ రూ. 10,000–14,000, సూపర్-10 రూ. 10,000-15,000, 341, డిడి, సి-5 రూ. 10,000-15,000, నిమ్ము నరుకు రూ.8000-12,000, తాలు కాయలు తేజ రూ. 5000-7500, ఇతర రకాలు రూ. 1000-5000, శీతల గిడ్డంగులలో నిల్వ అయిన తేజ నాణ్యమైన సరుకు రూ.15,000-16,000, సూపర్-10 రూ. 14,000–16,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 మహారాష్ట్రలోని నాగపూర్లో గత సోమవారం 4-5 వేల బస్తాల సరుకు రాబడిపై తేజ నాణ్యమైన కు రూ. 15,500-15,800, మీడియం రూ. 11,000-12,500,తాలుకాయలు రూ. 7000-7500, 

నందుర్ బార్లో ప్రతి రోజు 3-4 వేల బస్తాలు విఎన్ఆర్ రూ. 3000-3400, 5531 రకం రూ.2800-3300 ధరతో వ్యాపారమైంది. 

మధ్య ప్రదేశ్లోని బేడియాలో గత బుధ, గురువారాలలో కలిపి 30-32 వేల బస్తాల సరుకు రాబడిపై మహి రూ. 9500-11,200, లాల్కట్ రూ. 8000 - 9000, మీడియం రూ. 6500-8200, తాలు కాయలు రూ. 5000-5500, మహి తొడిమ తీసిన పరుకు రూ. 11,500-13,300, లాల్కట్: రూ. 6000-6500, తాలు కాయలు రూ. 6000-6500 ధరతో వ్యాపారమైంది.

 కర్ణాటకలోని బ్యాడ్డీలో సోమ మరియు మంగళవారాలలో కలిసి 2,33 లక్షల బస్తాల కొత్త మిర్చి రాబడిపై డబ్బి డీలక్స్ రూ. 40,000-45,000, నాణ్యమైన వరుకు రూ.35,000-38,000, కెడిఎల్ డీలక్స్ రూ. 2700-3400, మీడియం బెస్ట్ రూ. 22,000-25,000, మీడియం రూ. 7000-9500, 2043 డీలక్స్ రూ. 21,000–25,000, మీడియం బెస్ట్ రూ. 16,000-20,000, 5531 నాణ్యమైన సరుకు రూ. 12,000-15,500, మీడియం రూ. 10,000-12,000, తాలు. కాయలు కెడిఎల్ రూ.1500-2500, సీడ్ రకం రూ. 4000-7000, ఛత్తీస్గఢ్ లోని జగదల్పూర్లో గత వారం 5-6 వేల బస్తాల కొత్త మిర్చి రాబడిపై తేజు రూ. 14,000–14,800, తాలు కాయలు రూ. 7000-8000 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు