నిలకడగా పత్తి ధరలు

 

09-01-2022

వరంగల్లో దినసరి 5-6 వేల బస్తాల రాబడిపై రూ. 8500-9705, ప్రతికండీ రూ. 72000-76000, గింజలు రూ. 3400-4000, పిండి రూ. 3000-3300, భైంసాలో 1000 బేళ్ల రాబడిపై రూ. 9100-9300, ప్రతికండీ రూ. 74500-75000, గింజలు రూ. 4000-4100, పిండి రూ. 3600-3650, ఆదిలాబాద్లో 29 మిమీ ప్రతికండీ రూ.72000-76000, గుంటూరులో 2500 బేళ్ల రాబడిపై రూ.8800-9400, ప్రతి కండీ 29 మి.మీ. రూ. 73000-75000, 30 మి.మీ. రూ. 75000-76000, గింజలు రూ. 3800-3950, మహారాష్ట్రలో 45-50 వేల బేళ్ల రాబడిపై రూ.8800-10200, ప్రతికండీ రూ.73200-77500, గింజలు రూ.3800-4200, పిండి రూ. 3500-3750, మధ్య ప్రదేశ్లో 12-14 వేల బేళ్ల రాబడిపై రూ. 7400-10000, ప్రతికండీ రూ. 72500-73500, గింజలు రూ.3500-4200, గుజరాత్లో 30-35 వేల బేళ్ల రాబడిపై రూ. 8000-10250, ప్రతికండీ రూ. 70500-73500, గింజలు రూ. 3750-4125, పంజాబ్, హర్యాణా, రాజస్తాన్ సహా ఉత్తరభారతంలో 3-4 వేల బేళ్ల రాబడిపై రూ.9200-9800, ప్రతికండీ రూ.72000-75000 ధరతో వ్యాపారమయింది.




పత్తి వ్యాపారం రద్దు చేయాలని కోరుతున్న వస్త్రపరిశ్రమ


2021-22 పత్తి మార్కెటింగ్ సంవత్సరంలో దేశంలో 360.13 బేళ్లు ఉత్పత్తి అంచనా వ్యక్తం కాగా ఇందులో 40 శాతం మేర సరుకు రాబడి అయిందని మిగిలిన సరుకు రైతుల వద్ద నిల్వ ఉన్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ధరలు మరింత ఉధృతమయ్యే అంచనాతో వీరు నిల్వ చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం వారం ప్రారంభంలో రాజ్కోట్ మార్కెట్లో ధర ప్రతి క్వింటాలు రూ. 10,010 కి ఎగబాకింది. పత్తి ధరలు నియంత్రించేందుకు సమగ్రమైన చర్యలు చేపట్టాలని ప్రముఖ టెక్స్టైల్ సంస్థ టిటి లిమిటెడ్ ఛైర్మన్ రికాబ్ సి. జైన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖలో కోరారు. ఎలాంటి నష్టాలు చవిచూడని బహుళజాతి సంస్థలు, స్టాకిస్టులు మరియు భారత బుకీలచే బెట్టింగ్లు కట్టి పత్తి ధరలను ఎగదోస్తున్నారని ఆయన ఆరోపించారు. గత ఏడాది అక్టోబర్ 5న జిన్నింగ్ పత్తి ప్రతి కండీ (356 కిలోలు) ధర రూ.55,000 ప్రతిపాదించగా ప్రస్తుతం రూ.72,000 ఎగదోయబడిందని కూడా ఆయన తన ఆరోపణలో పేర్కొన్నారు. దీనితో పెరుగుతున్న ధరల పరంపరకు వస్త్ర పరిశ్రమ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.


అంతేకాకుండా, పెరుగుతున్న ధరలను అదుపు చేసేందుకు ఎక్స్ఛంజి వద్ద వాయిదా వ్యాపారాన్ని తక్షణమే నిలిపివేయాలని వస్త్ర పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరింది. దీని వలన జిన్నర్స్పై మోయలేని భారం పడుతున్నది. ఎంసిఎక్స్, ఎన్సిడిఇఎక్స్ లాంటి ఇతర ఎక్స్ంజిల వద్ద కనీసం ఒక నెల రోజులైనా వాయిదా వ్యాపారంపై ప్రభుత్వం ఆంక్షలు విధించ వలసిన ఆవశ్యకత ఉందని వస్త్ర పరిశ్రమ అభిప్రాయపడుతున్నది. దీని వలన ధరలకు స్థిరత్వం చేకూరడమే కాకుండా దిగివచ్చే అవకాశం ఉంటుందని వీరు అభిప్రాయపడుతున్నారు. పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం విధిస్తున్న 11 శాతం దిగుమతి సుంకం ఎత్తివేయాలని తిరుపూర్ ఎగుమతి వ్యాపారుల సంఘం ప్రభుత్వాన్ని కోరుతున్నది. దీని వలన ధరలు తగ్గడానికి దోహదం కాగలదని అభిప్రాయపడుతున్నారు.





రాబోయే పత్తి


 దేశంలో పెరుగుతున్న పత్తి ధరలు మరియు పంజాబ్లో పత్తి పంటకు పింగ్ బోలా వార్మ్ కీటక సంక్రణంతో రైతులు తల్లడిల్లుతున్నారు. పరిస్థితిని అంచనావేస్తున్న పంజాబ్ వ్యవసాయ శాఖ 2022–23 వత్తి సేద్యం కోసం మూడు దశల సేద్యం నిర్వహణకు రూపకల్పన చేసింది.క్షేత్ర స్థాయి పత్తి పంట మరియు నూనె ఎక్స్ట్రాక్షన్ యూనిట్ల వద్ద నూతన నిర్వహణ వ్యూహాన్ని అమలు చేసేందుకు వ్యవసాయ అధికారుల బృందం గ్రామ, బ్లాకు మరియు జిల్లా స్థాయిలో రైతులను అప్రమత్తం చేయడం ప్రారంభించింది.

కేంద్ర పత్తి పరిశోధన సంస్థ (సిఐసిఆర్)కు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాతో రూపొందించిన ప్రణాళికలో ప్రస్తుత పత్తి పంటలో మిగిలిన భాగాన్ని పూర్తి స్థాయిలో పెకలించివేయాలని మరియు ఏప్రిల్ 15 నుండి వంట సేద్యం చేపట్టేందుకు దృష్టి సారిస్తున్నది. మార్చి వరకు పత్తి ఏరివేత ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గుర్వింద్ సింగ్ తెలిపారు. పత్తి పంట కోసం రాష్ట్ర స్థాయిలో నిఘా పెంచి రైతులతో కలిసి అధికారులు పింక్ బోల్వార్డ్ నియంత్రణపై నిర్వహణ చర్యలు చేపట్టేందుకు అవగాహన కార్యక్రమం చేపట్టబడుతుంది. ఇదే విధంగా 2015లో తెల్లదోమను నివారించబడింది. మరోసారి ఇదే విధానం అనుసరించి సఫలీకృతం కావచ్చని వ్యవసాయ డైరెక్టర్ పేర్కొన్నారు. దీని వలన ఆర్థిక నష్టాన్ని వాటిల్లినప్పటికీ సేద్యం పరిధి భారీగా విస్తరించగలదు. రాష్ట్ర ప్రభుత్వ సమన్వయ సహకారంతో ఏప్రిల్ 15 నుండి పత్తిసేద్యం ప్రారంభించి మే 15 వరకు పత్తి సేద్యం ప్రక్రియ సజావుగా పూర్తి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రస్తుతం పత్తి ధరల ఒరవడిని దృష్టిలో పెట్టుకని సేద్యం విస్తరించగలదని భావిస్తున్నారు. రాష్ట్రంలో 2021-22 పత్తి సేద్యం 3.25 ల.హె.కు విస్తరించింది. ఉత్పత్తి 50 లక్షల క్వింటాళ్ల సరుకు దిగుబడి అయినట్లు ప్రభుత్వ యంత్రాంగం భావిస్తుండగా, భటిండా, మానస లాంటి ప్రముఖ పత్తి ఉత్పాదక జిల్లాలలో పింగ్ బోల్వార్మ్ కీటక సంక్రమణం వలన పంటకు భారీ నష్టం వాటిల్లినట్లు రైతులు వాపోతున్నారు.


మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు దేశంలోని నైరుతి రాష్ట్రాల పత్తి విత్తుల కనెసైన్ మెంట్ నుండి భటిండాలో a చిమ్మ టపురుగు చేరినందున పరిసరాలను శానిటైజర్ పిచికారీ చేసేనిమిత్తం విత్తిన పంటను పెకలించివేయవలసి వచ్చింది. రాష్ట్రంలో జిన్నింగ్ మరియు నూనె ఎక్స్ట్రాక్షన్ యూనిట్ల ద్వారా పొలాలలో పొటాషియం ఎర్మాంగనేట్ కలిపిన నీళ్లు సజావుగా అందించగలిగారని సిర్కాలోని పత్తి పరిశోధన సంస్థ ప్రముఖులు ఎస్. కె. వర్మ పేర్కొన్నారు. ఈ చర్య వలన కీటక సంక్రమణాన్ని నియంత్రించేందుకు మార్గం సుగమమైంది.

Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు