బలపడుతున్న నువ్వుల ధరలు

 


17-01-2022

రాజస్తాన్లోని బికనీర్, కోటా, నోఖా, పాలి, గంగానగర్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 12-15 వేల బస్తాల సరుకు రాబడిపై తెల్లనువ్వులు రూ. 9500-10,000, గజ్జర్ నువ్వులు రూ. 8800-9100, తమిళనాడు డెలివరి రూ. 8750-8800, తెల్లనువ్వులు రూ. 7900-8000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గత వారం మధ్యప్రదేశ్లోని డబ్రా, ధతియా, గ్వాలియర్ మార్కెట్లలో హళ్లింగ్ సరుకు రూ. 10,700-10,800, ఆగ్రాలో హల్లింగ్ సరుకు రూ. 10,000-10,100, 99.1 సరుకు రూ. 11,200–11,400, 98.1 రకం సరుకు రూ. 10,900–11,000, సార్టెక్స్ రూ. 11,700-11,900, కాన్పూర్ హళ్లింగ్ సరుకు రూ. 10,800-10,900, 98.2 సరుకు రూ. 10,900-11,100 ప్రతి క్వింటాలు ధరతో నాణ్యతానుసారం వ్యాపారమైంది.


 గుజరాత్లోని రాజ్కోట్, జునాగఢ్, అమ్రేలి మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి గత వారం 3-4 వేల బస్తాల రాబడిపై నాణ్యమైన తెల్ల నువ్వులు రూ. 10,900-11,150, మీడియం రూ. 10,400-10,800, యావరేజ్ రూ. 10,050-10,400 మరియు 1000-1500 బస్తాలు జడ్ బ్లాక్ రూ. 11,500-12,625, యావరేజ్ రూ. 9600-11,250, క్రషింగ్ రకంరూ. 6800-8000 ప్రతిక్వింటాలు ధరతో వ్యాపారమైంది.కర్నాటకలోని ముదగల్, అరిసెకేరి, కల్బుర్గి, చిత్రదుర్గ్, మైసూరు ప్రాంతాలలో 75 కిలోల బస్తా నాణ్యమైన సరుకు తమిళనాడు డెలివరి రూ. 7500-8500 మరియు ఆంధ్రప్రదేశ్లోని సత్తెనపల్లి, నరసరావుపేట, కడప, రాజంపేట ప్రాంతాలలో నాణ్యమైన సరుకు రూ. 9500-9800, హళ్లింగ్ సరుకు తమిళనాడు డెలివరి రూ. 9800-9900 మరియు పశ్చిమ బెంగాల్లో మైక్రో-క్లీన్ రూ. 8850–9500 జిఎస్టితో, అన్-క్లీన్ రూ. 7400-7500 ధరతో వ్యాపారమై తమిళనాడులోని ఈరోడ్ కోసం రవాణా అవుతున్నది. ఒడిశ్శాలో చెదురుమదురు రాబడులు ప్రారంభం కాగా రూ. 8500-9500 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు