ప్రతికూల వాతావరణ పరిస్థితులలో చింతపండు రాబడులు ఆలస్యమయ్యే అవకాశం

 


02-01-2022

కర్నాటకలోని బెల్గాంవ్ మరియు తదితర ప్రాంతాలలో ఇంతవరకు వర్షాల నేపథ్యంలో సరుకు తయారీలో సమస్యల కారణంగా రాబడులు ఆలస్యమౌతున్నాయి. సంక్రాంతి తరువాత కొత్త సరుకు రాబడులు పెరిగే అవకాశం కలదు. అయితే, 2022 లో కూడా ధరలు పెరిగే అవకాశము కనిపించడంలేదు. ఎందుకనగా, కొత్త సరుకు రాబడులకు అవకాశమున్నందున, మార్కెట్లలో పాత సరుకు అమ్మకాలు తగ్గాయి. అయితే, కొత్త సరుకు రాబడులు మరింత ఆలస్య మయ్యే అవకాశం కలదు. ఎందుకనగా, చెట్లపై పంట ఎండడంలో ఆలస్యమౌతున్నది. 


కర్నాటకలోని బెల్గాంవ్, తుమ్కూరు, మైసురు మరియు పరిసర ప్రాంతాలలో కలిసి దాదాపు 8-10 లారీల అమ్మకంపై మహారాష్ట్ర నాణ్యమైన ఫ్లవర్ రూ. 9000 -10000, స్థానికంగా రూ. 6000 – 8000, సిల్వర్ రకం రూ. 18000-20000, కరిపులి బెస్ట్ రూ. 14000- 15000, మీడియం రూ. 10000- 12000, ఫ్లవర్ మీడియం రూ.4500-5500 ధరతో వ్యాపార మయింది. 

హిందూపూర్లో గతవారం 8-10 లారీల అమ్మకంపై నాణ్యమైన కరిపులి రూ. 13000 16000, మీడియం రూ. 11000 -13000, యావరేజ్ రూ. 9000 11000, నాణ్యమైన ఫ్లవర్ రూ. 8000-9000, మీడియం రూ. 7000-8000, యావరేజ్ రూ. 5500-6500 మరియు 

పుంగనూరు, పలమనేరు, మదనపల్లి లలో కేవలం 22-25 లారీల రాబడిపై కరిపులి రూ. 12000- 14000, చపాతీ రూ. 10000- 10500, ఫ్లవర్ రూ.7500 -8500, మీడియం రూ. 5500 -6500,గింజ సరుకు రూ. 3200-3600 ధరతో వ్యాపారమయింది. 

విజయనగరం, సాలూరు, పార్వతీపురం, రాయగడ ప్రాంతాల నుండి వారంలో 18-20 లారీల ఎసి సరుకు అమ్మకంపై నాణ్యమైన సెమి ఫ్లవర్ రూ.7800-8000, మీడియం రూ.6500-6700, యావరేజ్ రూ. 5200-5300, గింజ సరుకు లోకల్ రూ. 3000-3200, 

ఛత్తీస్ఘడ్ లోని జగదల్పూరు దాదాపు 20 లారీలు మరియు మధ్య ప్రదేశ్లోని ఇండోర్ లో 8-10 లారీల ఎసి సరుకు అమ్మకంపై మీడియం ఫ్లవర్ రూ. 6000-6500, గింజ సరుకు రూ. 2600-3000 మరియు ఓం బ్రాండ్ రూ. 9000, తరానా, ఉన్హేల్ లలో 8-10 లారీల ఎసి డిస్కలర్ గింజ సరుకు రూ. 2400-2500, రంగు సరుకు రూ. 2500-2900 ధరతో వ్యాపారమై తమిళనాడు కోసం రవాణా అవుతున్నది. 

తమిళనాడులోని పాపరంపట్టీలో గతవారం కోల్డుస్టోరేజీల నుండి 10-15 లారీల రాబడిపై మహారాష్ట్ర ఎసి చపాతీ రంగు సరుకు స్థానికంగా రూ.8300 -8900, మహారాష్ట్ర బెస్ట్ రూ.8800 -9000, లోకల్ డిస్కలర్ సరుకు రూ. 8500-8700, మహారాష్ట్ర నాణ్యమైన గింజ సరుకు రూ.3200-3500, స్థానికంగా రూ. 2800-3000, బోట్ రకం రూ. 2200-2400 మరియు 

సేలంలో వారంలో 10-15 లారీల అమ్మకంపై కరిపులి రూ. 11500 -12000, మహారాష్ట్ర చపాతీ రూ.8800 9200, ఫ్లవర్ రూ. 8000 -9000, గింజ సరుకు డిస్కలర్ రూ.2800-3200, కంభంలో 8-10 లారీలు, ధర్మపురిలో 5-6 లారీలు, 

దిండిగల్లో 6-7 లారీల అమ్మకంపై ఫ్లవర్ రూ.8500-9500, చపాతీ రూ. 9500-10500, గింజ సరుకు రూ. 3600-3800, కృష్ణగిరిలో 8–10 లారీల రాబడిపై నాణ్యమైన గింజ సరుకు రూ. 5000-5500, కర్నాటక సరుకు రూ. 3200-3500, స్థానికంగా రూ. 2800–3000 ధరతో వ్యాపారమయింది.

Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు