తగ్గిన రబీ పెసర సేద్యం



17-01-2022

 ప్రస్తుత రబీ సీజన్లో జనవరి వరకు దేశవ్యాప్తంగా పెసల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 5.26 ల.హె. నుండి తగ్గి 3.23 ల.హె.కు పరిమితమైంది. రాష్ట్రాల వారీగా తమిళనాడులో 34 వేల హెక్టార్ల నుండి తగ్గి 32 వేల హెక్టార్లు, ఒడిశ్శాలో 4.09 ల.హె. నుండి 2.13 ల.హె., ఆంధ్రప్రదేశ్లో 60 వేల హెక్టార్ల నుండి 57 వేల హెక్టార్లకు పరిమితమైంది. ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకు పెసల సేద్యం 40 శాతం కూడా విస్తరించలేదు. గడిచిన కొన్ని నెలలుగా ధరలు ఒడిదొడుకులకు గురవుతున్నందున సీజన్ మొత్తంలో సేద్యం తగ్గుదల నమోదయ్యే అవకాశం కనిపిస్తున్నది. 


అంతర్జాతీయ విపణిలో పేడేశ్వర్ పెసలు 900 డాలర్లు, పొకాకో 980 డాలర్లు, అన్నేశ్వర్ 800 డాలర్లు ప్రతిపాదించబడింది. 

రాజస్తాన్లోని కేక్, మెడతా, సుమేర్పూర్, మెడతా, కిషన్ఢ్ ప్రాంతాలలో కలిసి 5-6 వేల బస్తాల సరుకు రాబడిపై జెపూర్లో 5050-6850, పప్పు రూ. 7500-8500, మిటుకులు రూ.6400-7400, 

మధ్య ప్రదేశ్లోని పిపరియా, హర్దా, జబల్పూర్ ప్రాంతాలలో ప్రతి రోజు 3-4 వేల బస్తాల సరుకు రాబడిపై రూ. 4000-7250, ఇండోర్లో రూ. 6800-7300 ప్రతి క్వింటాలు నాణ్యతానుసారం వ్యాపారమైంది.

 ఆంధ్రప్రదేశ్లోని పొన్నూరులో అన్-పాలిష్ పెసలు రూ. 7000, పాలిష్ రూ. - 6800, 

తెలంగాణలోని ఖమ్మంలో పెసలు రూ. 6500, పప్పు సార్టెక్స్ రూ. 8900, నాన్-సార్టెక్స్ రూ. 8500 మరియు 

కర్ణాటకలోని గుల్బర్గా, సేడెం గదగ్, యాద్గిర్ పెసలు రూ. 4000-6300 మరియు మహారాష్ట్రలోని సోలాపూర్లో రూ. 6300-7100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు