రికార్డు స్ధాయిలో మిరప రాబడులు- ధరలు పటిష్ఠం

 

09-01-2022

వ్యాపారస్తుల కథనం ప్రకారం గతవారం దేశంలోని అన్ని ఉత్పా దక కేంద్రాలలో కలిసి దాదాపు 13.50 లక్షల బస్తాల మిరప రాబడి అయినప్పటికీ, ధరలు పటిష్టంగా ఉన్నాయి. ఇందుకు ముఖ్య కారణమేమనగా, విస్తీర్ణం రికార్డు స్థాయికి పెరిగినప్పటికీ, ఇంతవరకు వర్షాలు మరియు చీడపీడల కారణంగా దిగుబడి తగ్గిన నేపథ్యంలో రాబడి అవుతున్న మొత్తం సరుకు అమ్మకమవుతున్నది. గుంటూరులో కోల్డు స్టోరేజీలు మరియు రైతుల సరుకు కలిసి మొత్తం 5 లక్షల బస్తాలు, ఖమ్మంలో 80 వేల బస్తాలు, వరంగల్లో 55-60 వేలు, హైదరాబాద్లో 35-40 వేలు, మహారాష్ట్రలో 25-30 వేలు, మధ్యప్రదేశ్లో 1.50 లక్షల బస్తాలు, కర్నాట కలో సుమారు 4 లక్షల బస్తాలు, గుజరాత్, రాజస్తాన్, తెలంగాణా, ఆంధ్రలోని ఇతర మార్కెట్లలో కలిసి సుమారు 13 లక్షల బస్తాలకు పైగా సరుకు రాబడి అయింది. గుంటూరులో వారంలో కోల్డుస్టోరేజీల నుండి 2.50 లక్షల బస్తాల రాబడిపై 1.10 లక్షల బస్తాల సరుకు అమ్మకమయింది. ఎందుకనగా, కొత్త సరుకు రాబడి అధికంగా ఉన్న నేపథ్యంలో ఎసి డీలక్స్ రకాలకు డిమాండ్ తగ్గింది మరియు అన్ని రకాల ధరలు రూ. 500-600 మేర తగ్గాయి. గుంటూరులో కర్నూలు, ఎమ్మిగనూరు, ప్రకాశం మరియు భద్రాచలం ప్రాంతాల నుండి 2.70 లక్షల బస్తాల కొత్త మిరప రాబడిపై 1.70 లక్షల బస్తాల సరుకు అమ్మకంకాగా, ఇందులో 60 శాతం నిమ్ము మరియు 40 శాతం నాణ్య మైన సరుకుల రాబడిపై డీలక్స్ రకాలకు డిమాండ్ ఉన్నందున, అన్ని డీలక్స్ రకాల ధరలు రూ.300-500 క్వాలిటీ ప్రకారం పెరిగాయి. అయితే, తేజ తాలు రాబడులు అధికంగా ఉండడంతో వీటి ధరలు రూ.500 తగ్గాయి మరియు తేజ తాలు, సీడ్ తాలు రకాలు కోల్డుస్టోరేజీలలో నిల్వ అవుతున్నాయి. ధరలు ఆకర్షణీయంగా ఉండడంతో వచ్చే వారం రాబడులు పెరిగే అవకాశం కలదు.


గుంటూరు కోల్డుస్టోరేజీలలో నిల్వ అయిన నాణ్యమైన 
తేజ రూ.13000-15500, డీలక్స్ రూ. 15600-15800, ఎక్స్ ట్రార్డినరీ రూ. 15900–16000, మీడియం బెస్ట్ రూ. 12000-13400, మీడియం రూ. 11000-11900, 
బ్యాడ్గి-355 రకం రూ. 17000-20000, 
సింజెంటా బ్యాడ్గి రూ.13000-16500, 
341 రకం రూ. 13500-17000, 
నెం.5 రూ. 13500-17000, డీలక్స్ రూ. 17200-17500, 
273 రకం రూ. 13000-16000, 
334 మరియు సూపర్-10 రకాలు రూ.14000–16500, డీలక్స్ రూ. 16600-16800, మీడియం బెస్ట్ రూ. 12500-13900, మీడియం రూ. 11500-12400, 
4884 రకం రూ. 12000-13500, 
రోమి రూ.11500-13500, 
ఆర్మూరు. రూ. 12000 - 13500, 
577 రకం రూ. 13500-16000, 
బంగారం రూ. 13000-15000, మీడియం మరియు 
మీడియం బెస్ట్ సహా అన్ని సీడ్ రకాలు రూ. 11500-13000,
 తేజ తాలు రూ. 6500-7500, 
తాలు రూ. 4000-7000 ప్రతిక్వింటాలు ధరతో వ్యాపారమయింది. 
గుంటూరులో కొత్త 
తేజ రూ. 12500-15000, డీలక్స్ రూ. 15100-15200, మీడియం రూ. 10000–12400, 
355-బ్యాడ్గి రూ. 12500-17000, 
సింజెంటా బ్యాడ్గీ రూ. 12000-15000, 
డిడి రూ. 13000–16500, డీలక్స్ రూ. 16600-16800, 
341 రకం రూ. 12000–16000, డీలక్స్ రూ. 16200-16500,
 2043 రకం రూ. 15000-19500, 
డీలక్స్ రూ. 19600-20000, 
బులెట్ రకం రూ. 10000-14000,
 నెం.5 రూ. 13000-16000, డీలక్స్ రూ. 16200-16500,
 334, సూపర్ -10 రకాలు రూ. 1200-15500, 
273 రకం రూ. 12500–15000, 
బంగారం రకం రూ. 12500-15500, 
ఆర్మూరు రకం రూ. 10000-12500, మీడియం బెస్ట్ సీడ్ రకం రూ.9000-11500,
 తేజ తాలు రూ. 6000-7500, 
తాలు రూ. 3000-7000 ప్రతిక్వింటాలు ధరతో వ్యాపార మయింది.


వరంగల్లో గతవారం 25-27 వేల బస్తాల కొత్త మిరప రాబడిపై నాణ్యమైన తేజ రూ. 15200, మీడియం రూ. 12000-15000, నాణ్యమైన 341 రకం రూ. 17100, మీడియం రూ. 14000-16000, తేజ తాలు రూ. 6000-8500 మరియు 30-32 వేల బస్తాల ఎసి సరకు రాబడిపై నాణ్యమైన తేజ రూ.16000, మీడియం రూ. 13000-15000, నాణ్యమైన వండర్ట్ రూ. 18500, మీడియం రూ.16000-17500, 341 రకం రూ. 17500, దీపికా రూ. 16000, 1048 రకం రూ. 15200, నాణ్యమైన టమోటా రూ. 23000, మీడియం రూ. 17000-19000, నాణ్యమైన సింగిల్ పట్టీ రూ. 20000, మీడియం రూ. 15000-17000 ధరతో వ్యాపారమయింది.


ఖమ్మంలో గతవారం 12-13 వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై నాణ్యమైన తేజ రూ.16500, మీడియం రూ. 15000-16000, తాలు రూ.7000 మరియు 65-67 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై నాణ్యమైన తేజ రూ. 15500, మీడియం రూ. 14000-15000, తాలు రూ. 8000 ధరతో వ్యాపారమయింది.

హైదరాబాద్లో 30-32 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై తేజ రూ. 11000-15000, బ్యాడ్డీ రూ. 15000-22000, 273 రకం రూ. 12000-14000, సూపర్-10 రకం రూ. 13000-15000, 341 రకం రూ. 10000-14000, సి-5 రకం రూ. 13000-15000, డిడి రూ. 11000-14500, నిమ్ము రకం రూ. 8000-12000, తేజ తాలు రూ. 5000-8000, తాలు రూ. 1000-5000 మరియు కోల్డుస్టోరేజీలలో నిల్వ అయిన తేజ రూ. 14000-17000, మీడియం రూ. 12000-13000, నాణ్యమైన సూపర్ -10 రకం రూ.15000-16500, మీడియం రూ. 11000-14000, 273 రూ. 12000-15000 ధరతో వ్యాపారమయింది. 

మహారాష్ట్రలోని నాగూర్లో సోమవారం 5-6 లారీల రాబడిపై నాణ్యమైన తేజ రూ. 15500-16000, మీడియం రూ.11000-13000, తాలు రూ. 7000-8000 మరియు నందూర్ బార్ దినసరి 4-5 వేల క్వింటాళ్ల కొత్త నిమ్ము రకం సరుకు రాబడిపై విఎన్ఆర్ రూ. 3000-3500 మరియు 5531 రకం రూ. 2800-3400 ధరతో వ్యాపారమయింది.


మధ్య ప్రదేశ్లోని బేడియాలో ఆది, బుధ, గురువారం మూడు రోజులలో కలిసి 50-55 వేల బస్తాల రాబడిపై మహీ ఫూల్కట్ రూ. 11000–13000, మైక్రో ఫూల కట్ రకం రూ. 14000-15500, తొడిమతో రూ. 9500–11100, లాల్కట్ రూ. 8000-9000, ఫూల్కట్ తాలు రూ. 5800-6000, తొడిమతో తాలు రూ. 4000-4500 మరియు ధామనోద్లో శుక్రవారం రూ.50 వేల బస్తాల రాబ డిపై సరుకు ఎక్కువగా నిమ్ముతో ఉండడంతో 720 సానియా రకం రూ. 12500-13500, మీడియం రూ. 9500-11000, లావు తాలు రూ. 4000-4500, సన్నకం తాలు రూ. 5000-6000 లోక ల్ లూజు మరియు లారీ బిల్జీ 720 సానియా రూ. 15000, లావు తాలు రూ. 5500, సన్న రకం రూ. 7000 ధరతో వ్యాపారమయింది.


బ్యాడ్గీలో సోమ, గురువారాలలో కలిసి 3 లక్షల 4 వేల బస్తాల కొత్త మిరప రాబడిపై డబ్బీ డీలక్స్ రూ. 40000–42500, నాణ్యమైన డబ్బీ రకం రూ. 34000-37500, కెడిఎల్ డీలక్స్ రూ. 25000–29000, మీడియం బెస్ట్ రూ. 22000-24500, మీడియం రూ. 6000-9500, 2043 రకం రూ. 1000-20500, నాణ్యమైన 5531 రకం రూ. 12000-15500, మీడియం రూ. 9000–11000, కెడిఎల్ తాలు రూ. 1500-2500, సీడ్ లు రూ. 4000-6000 ధరతో వ్యాపా రమయింది, అయితే ఎసి సరుకు వ్యాపారం కాలేదు.


సింధనూరులో మంగళవారం 22-23 వేల బస్తాల కొత్త మిరప రాబడిపై బ్యాడ్జీ రూ. 20000–23000, సింజెంటా రూ. 15000-22000, 5531 రకం రూ. 13000-15000, తాలు రూ. 1000-7000 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది. హుబ్లీలో శనివారం 20 వేల బస్తాలు మరియు గదగ్లో 30 వేల బస్తాల సరుకు రాబడి అయినందున, రైతులు వేగంగా సరుకు విక్ర యిస్తున్నట్లు విషదమౌతున్నది. ఛత్తీస్గర్లోని జగదల్పూర్లో గతవారం 5-6 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ మరియు సన్ రకాలు రూ. 15000-16000, 4884 రకం రూ. 12000–13000 మరియు 2500-3000 బస్తాల కొత్తసరుకు రాబడిపై తేజ రూ. 14000–14800, తేజ తాలు రూ. 8000 ప్రతిక్వింటాలు ధరతో వ్యాపారమయింది.

Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు