మొక్కజొన్న ధరలు



17-01-2022

 తమిళనాడు దిండిగలో ప్రతి రోజు 10-15 వేల బస్తాల రాబడిపై స్థానికంగా రూ. 1700-1750, ఈరోడ్, నమక్కల్, ఉడుముల్పేట కోసం రూ. 1900-1950, కల్లకుర్చి, తిరుకోవిలూరు, చిన్నసేలం, ఉలుండరుపేట, శంకరాపురం ప్రాంతాలలో 10-15 వాహనాలు రూ. 1500-1750, నమక్కల్, ఈరోడ్ డెలివరి రూ. 1950-2000, రాజుపాలయం, శంకరన్ కోవిల్, పెరంబ్లూరు, ధారాపురం, పుదుకొట్టై, కోవిల్పట్టి ప్రాంతాలలో 25-30 వాహనాలు రూ. 1650-1750, ఈరోడ్, నమక్కల్ డెలివరి రూ. 1930-1950 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 


ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్, మడకశిర ప్రాంతాలలో 150-200 టన్నుల మొక్కజొన్న రాబడిపై నాసిరకం సరుకు రూ. 1550-1600 ప్రతిపాదించినప్పటికీ కొనుగోలుదారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన సరుకు బెంగుళూరు డెలివరి రూ. 1750-1800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమవుతున్నది. 

తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ ప్రాంతాలలో 2-3 వేల బస్తాలు రూ. 1650-1750 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

ఒడిశ్శాలోని మొక్కజొన్న ఉత్పాదక కేంద్రాలలో ప్రతి రోజు 20-30 వాహనాల మొక్కజొన్న రాబడిపై స్థానికంగా రూ. 1625-1675, విజయనగరం డెలివరి రూ. 1850 మరియు 

కర్ణాటకలోని చిత్రదుర్గ్ లో ప్రతి రోజు 25-30 వేల బస్తాలు రూ.1740-1850, బళ్లారి, చెల్లకేరి, బెల్గాం, దావణగెరె, శిమోగా మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో ప్రతి రోజు 20-25 వేల బస్తాలు రూ. 1600-1800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తమిళనాడు కోసం రవాణా అవుతున్నది. సంక్రాంతి పండుగ కోసం ఆంధ్రప్రదేశ్ పాటు మహారాష్ట్ర కోసం డిమాండ్ నెలకొన్నందున ధరలు ఇనుమడించాయి. 

బొబ్బర్లు : ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని పొదిలి, గురుమిట్కల్ ప్రాంతాలలో ప్రతి రోజు 200 300 బస్తాల బొబ్బర్ల రాబడిపై తెలుపు సరుకు రూ. 5700-5800, ఎరుపు రూ. 6400-6500, కడప జిల్లాలోని రాయచోటిలో ప్రతి రోజు 5-6 వాహనాల బొబ్బర్ల రాబడిపై నలుపు సరుకు రూ.6400-6600, తెలుపు రూ. 5400-5500, ఎరుపు సరుకు రూ. 5700-6000, కదిరిలో 100-150 బస్తాలు రూ. 5600-6100, కర్ణాటకలోని మైసూరు, హగరిబొమ్మనహళ్లి, బళ్లారి ప్రాంతాలలో ప్రతి రోజు 700-800 సరుకు రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 7600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.



Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు