మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర లలో నవంబర్ నుండి పోటెత్తనున్న కొత్త మిరప
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
-
18-10-2021
వ్యాపారస్తుల కథనం ప్రకారం నవంబర్ మొదటి మొదటివారం నుండి మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో రాబడులు పెరిగే అవకాశం కలదు. దీనితో ధరల పెరుగుదలకు అడ్డుకట్ట పడింది. ఎందుకనగా, అధిక నిల్వలు ఉన్నప్పటికీ స్టాకిస్టులు నెమ్మదిగా విక్రయిస్తున్నారు.
గుంటూరు మార్కెట్లో సోమ, మంగళ వారాలలో కోల్డుస్టోరేజీలనుండి 2.30 లక్షల బస్తాల మిరపరాబడిపై, ఇందులో గుంటూరు కోల్డు స్టోరేజీల నుండి 80 వేల బస్తాలు మరియు ఇతర ప్రాంతాల కోల్డుస్టోరేజీలనుండి 35 వేల బస్తాలు కలిసి 1.15 లక్షల బస్తాల సరుకు అమ్మకమయింది. ఇందులో తేజ డీలక్స్, 334 రకం, సూపర్-10 మరియు 341 డీలక్స్ రకాలకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ సరుకు కొరతవలన ధరలు రూ. 200 పెరిగాయి. అయితే, ఇతర రకాల ధరలు స్థిరంగా ఉన్నాయి. మరోవైపు మీడియం, మీడియం బెస్ట్ రకాల అమ్మకాలు తగ్గి క్వాలిటీ ప్రకారం వ్యాపారమయ్యాయి.
కర్నూలు ప్రాంతం నుండి 150 బస్తాల కొత్త సరుకు రాబడిపై సీడ్ రకం రూ. 6000-8000 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది.
కర్నాటకలోని బ్యాడ్గి లో సోమవారం 200 బస్తాల కొత్త సరుకు రాబడిపై 5531 రకం రూ. 10000, జిటి రూ. 8500-9500, తాలు రూ. 4000-5500, కోల్డుస్టోరేజీల నుండి 15 వేలబస్తాల రాబడిపై 5 వేల బస్తాలు అమ్మకంకాగా డీలక్స్ డబ్బీ రూ. 21000-22700, మీడియం రూ. 17000-19000, మీడియం రూ. 14000–16000, 2043 డీలక్స్ రూ. 14000-16000, మీడియం రూ. 11000-13000, 5531 రకం రూ. 9500-11500, డిడి రూ. 11000-13000, 334మరియు సూపర్ -10 రకాలు రూ.9000 1000, తాలు రూ.3500-5000 మరియు
సింధనూరులో మంగళవారం కోల్డు స్టోరేజీలనుండి 2 వేల బస్తాల రాబడిపై సింజెంటా బ్యాడ్డీ రూ. 10000-15000, 5531 రకం రూ. 10000-13000, జిటి రకం రూ. 8000 -10000, హైబ్రడ్ తాలు రూ. 3000-4000 ధరతో వ్యాపా రమయింది.
ఛత్తీస్గడ్ లోని జగదల్పూర్ గతవారం 4-5 వేలబస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ మరియు సన్ రకాలు రూ. 11000 -13700, 4884 8šo రూ. 10000-12000, తేజ తాలు రూ. 7000 -7500 ధరతో వ్యాపారమయింది.
మధ్య ప్రదేశ్లోని బేడియాలో ఆది, సోమ వారాలలో కలిసి 6-7 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై మహీ ఫూల్ కట్ రూ. 10000-12000, తొడిమతో రూ. 10000-11000, ఫూల్కట్ తాలు రూ. 5000, తొడిమతో తాలు రూ. 4000 -5000 ధరతో వ్యాపార మయింది మరియు
ఆదివారం 17, అక్టోబర్ బేడియాలో 18-20 వేల బస్తాల కొత్త మిరప రాబడి అయ్యే అంచనా కలదు. వచ్చే వారం నుండి ఖండ్వా, ధామునోద్, ఇండోర్ ప్రాంతాలలో కొత్త మిరప రాబడి ప్రారంభమయ్యే అవకాశం కలదు.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు