భారీగా పెరుగుతున్న మిర్చి రాబడులు - ధరలపై తీవ్ర ప్రభావం 22-01-2024


ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈసారి తేజ రకం మిర్చి సేద్యం భారీగా విస్తరించింది. వాతావరణం సానుకూలంగా ఉన్నందున పంట దిగుబడులు పెరిగి రాబడులు పోటెత్తుతుండగా కొనుగోళ్లు క్షీణించి ధరలు మందగమనంలో చలిస్తున్నాయి. గత వారం సంక్రాంతి పండుగ సందర్భంగా గుంటూరు మిర్చి యార్డు 2 రోజులు ఎలాంటి లావాదేవీలు చేపట్టలేదు.

గుంటూరు యార్డులో గత వారం గుంటూరు కర్నూలు ఎమ్మిగనూరు క్రిష్ణా ప్రకాశం జిల్లాల నుండి 2.90 లక్షల బస్తాల మిర్చి రాబడి కాగా 2.50 లక్షల బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో డీలక్స్ రకాల ధరలకు స్థిరత్వం నెలకొనగా తేజ ఆర్మూరు సీడ్ రకాలు మరియు వీటి తాలు కాయలు భారీగా విక్రయించబడ్డాయి. సోమవారం (జనవరి 22) 1.5 లక్షల బస్తాల సరుకుతో పాటు వారం పర్యంతం రాబడులు భారీగా ఉండగలవని తెలుస్తోంది. మసాలా తయారీదారులు తమ అవసరం మేరకే సరుకు కొనుగోలు చేస్తున్నారు.

సంక్రాంతి పండుగ తర్వాత కూలీలు పూర్తి స్థాయిలో విధులలో చేరనందున గుంటూరు శీతల గిడ్డంగుల నుండి కేవలం 20 వేల బస్తాల సరుకు రాబడి అయింది. ఇందులో 10 వేల బస్తాల సరుకు అమ్మకమైనట్లు తెలుస్తోంది. గుంటూరు శీతల గిడ్డంగులలో దాదాపు 24 లక్షల బస్తాల సరుకు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. మధ్య ప్రదేశ్ లో మిర్చి రాబడులు సన్నగిల్లాయి. గుజరాత్లో ధరల పెరుగుదలకు కళ్లెం పడింది. ఈసారి మార్చి చివరి వరకు సరుకు రాబడి కానున్నట్లు తెలుస్తోంది.

గుంటూరు మార్కెట్లో తేజ కొత్త సరుకు 17000 నుండి 20000

 ఎక్స్ట్రాడినరి 20500 అత్యధిక సరుకు 18000 నుండి 19500

బ్యాడిగి 355 రకం 15000 నుండి 17500

 డీలక్స్ 18000

 డిడి 13500 నుండి 15500

 డీలక్స్ 16000

 3 4 1 రకం 15000 నుండి 17500

 డీలక్స్ ఎక్స్ ట్రాడినరి 18000

 నంబర్ 5 రకం 14000 నుండి 18000

 డీలక్స్ 18500

 సింజెంట బాడిగ 12500 నుండి 14500

 డీలక్స్ 14700

 ఆర్మూరు 13000 నుండి 14500

 డీలక్స్ 1500

 స్పార్క్ మరియు షార్క్ రకం 14000 నుండి 17500

 స్వర్ణ బాడిగ 13500 నుండి 16000

 డీలక్స్ 16500 కుబేరా 2 73 రకం 12500 నుండి 14000

 డీలక్స్ 14500

 రోమి 14000 నుండి 16500

 డీలక్స్ 16800

 2 04 3 రకం 16000 నుండి 21000

 డీలక్స్ 21500

 క్లాసిక్ 13000 నుండి 15000

 డీలక్స్ 15500

 సీడ్ రకం మీడియం 10500 నుండి 13000

 తాలు కాయలు తేజ 12000 నుండి 13000

 డీలక్స్ 13500

 ఇతర రకాలు 6000 నుండి 9000 

డీలక్స్ 9500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

గుంటూరు శీతల గిడ్డంగులలో నిల్వ అయిన సరుకు తేజ 17000 నుండి 19000

 3 4 1 రకం 14000 నుండి 17000

డీలక్స్ 17500

 సూపర్ 10, 3 34 రకం 16000 నుండి 19000

మీడియం 14000 నుండి 15500

 సీడ్ రకాలు మీడియం 10000 నుండి 13000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 ఆదోని మార్కెట్లో 1500 బస్తాలు రాబడిపై బాడిగ 15000 నుండి 20000 

కడ్డీ 5 5 3 1 11000 నుండి 12600

 తేజ 14300 నుండి 15500

 లాలి రకం 11000 నుండి 12000

 తాలు కాయలు తేజ 11000 నుండి 16100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 ఖమ్మం మార్కెట్లో గత వారం 80 నుండి 85 వేల బస్తాల కొత్త మిర్చి రాబడిపై తేజ నాణ్యమైన సరుకు 20500

మీడియం 18000 నుండి 19000

 తాలు కాయలు 9500 నుండి 10500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 వరంగల్ మార్కెట్లో 60 నుండి 62 వేల బస్తాల కొత్త మిర్చి రాబడిపై తేజ నాణ్యమైన సరుకు 20100

 మీడియం 16000 నుండి 19500

 3 4 1 రకం నాణ్యమైన సరుకు 16000

 మీడియం 13000 నుండి 16000 

డిడి మీడియం బెస్ట్ 15000

 వండర్హాట్ 20000

 మీడియం 18000 నుండి 19000

 1 04 8 మీడియం 13300 

తాలు కాయలు 18000 ధరతో వ్యాపారమైంది. 

హైదరాబాద్ మార్కెట్లో కర్నూలు నుండి 20 నుండి 22 వేల బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా నిమ్ము సరుకు తేజ 16000 నుండి 21000

 సి5 12000 నుండి 16500

 ఆర్మూరు రకం 10000 నుండి 14500

 2 73 రకం 10000 నుండి 14500

 3 4 1 రకం 12000 నుండి 14500 

నాణ్యమైన సరుకు 16500

 డిడి 12500 నుండి 16000

 సింజెంట బాడిగ 11500 నుండి 15000

సంగం రకం నిమ్ము సరుకు 11500 నుండి 15000

 సూపర్ 10 రకం 12000 నుండి 17000

 2 04 3 13000 నుండి 22000

 తాలు కాయలు తేజ 10000 నుండి 12500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

కర్ణాటకలోని బ్యాడిగిలో సోమ మరియు గురువారాలలో కలిసి 1.60 లక్షల బస్తాల కొత్త మిర్చి రాబడిపై 

డబ్బి 38000 నుండి 51000 

2 04 3 16000 నుండి 22000

 కెడిఎల్ ల్ స్థానికంగా 34000 నుండి 44000

 బళ్లారిలో కెడిఎల్ 28000 నుండి 34000

 లాలి రకం 14000 నుండి 17000

 5 5 3 1 12000 నుండి 14200

 డిడి 13000 నుండి 16000 

2 04 3 కెడిఎల్ మీడియం 9000 నుండి 13000 

తాలు కాయలు 6500 నుండి 8500

 మరియు సింధనూర్లో 16 నుండి 17 వేల బస్తాల కొత్త మిర్చి రాబడిపై డబ్బి 30000 నుండి 55000 

సింజెంట బాడిగ 15000 నుండి 22000 

2043 20000 నుండి 26000 

తేజ 18000 నుండి 20000

5 5 3 1 12000 నుండి 16000

 తాలు కాయలు 6000 నుండి 10000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 మహారాష్ట్రలోని నందూర్ బార్లో 6 నుండి 7 వేల బస్తాలు 

మధ్యప్రదేశ్లోని బేడియాలో మంగళ గురువారాలలో కలిసి 8 నుండి 10 వేల బస్తాల మిర్చి రాబడిపై

 మహి 17000 

మీడియం 15000 నుండి 15500

 తొడిమ తీసిన సరుకు 21500 

మీడియం 18000 నుండి 19000

 తాలు కాయలు మహి 10000 నుండి 11000

 తొడిమ తీసిన సరుకు 13500 నుండి 14500

 ఫుల్కట్ 11500 నుండి 13500

 మీడియం లాల్కట్ 14500 నుండి 16000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

గుజరాత్లోని గోండల్ మార్కెట్లో సింజెంట బాడిగ నాణ్యమైన సరుకు 15000 నుండి 15500 

మీడియం 13000 నుండి 14000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.












.

Comments

Popular posts from this blog