పెరిగిన రబీ మినుముల సేద్యం

 



 దేశంలో రబీ సీజన్ మినుముల సేద్యం ప్రారంభమైంది. అక్టోబర్ 21 నాటికి సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 7 వేల హెక్టార్ల నుండి పెరిగి 13 వేల హెక్టార్లకు విస్తరించింది. సేద్యం మరింత విస్తరించగలదు. మినుములు మరియు కందుల ధరలపై ప్రభుత్వ దృష్టి సారించడం వలన ధరల పెరుగుదలకు కళ్లెం పడగలదని వ్యాపారులు భావిస్తున్నారు. అంతర్జాతీయ విపణిలో ఎసక్యూ 15 డాలర్ తగ్గి 960 డాలర్ మరియు ఎస్ఎ క్యూ 820 డాలర్ ప్రతి టన్ను ప్రతిపాదించబడినందున ముంబైలో ఎస్ఎ క్యూ రూ. 7150, చెన్నైలో రూ. 7000, ఎ క్యూ రూ. 8100, కోల్ కతాలో ఎస్ఎ క్యూ రూ. 7200-7350, దిల్లీలో ఎస్ క్యూ రూ. 8500, ఎస్ఎ క్యూ రూ. 7350 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 


మధ్య ప్రదేశ్ లో గ్రేడెడ్ క్లీన్ మినుములు చెన్నై డెలివరి రూ. 7400-7500, రాజస్తాన్ ప్రాంతం నాణ్యమైన సరుకు రూ. 8200-8600, గుజరాత్ లోని రాజ్ కోట్ ప్రాంతం టి-9 దేశీ మినుములు మిక్స్ రూ. 8400-8500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


రాజస్తాన్ లోని కేడిలో 5 వేల బస్తాలు, మెడతాలో 3-4 వేల బస్తాలు, కోటా, సుమేర్‌ పూర్‌లో 2 వేల బస్తాలు, కిషన్ గడ్లో 1000-1200 బస్తాలు, సవాయిమాధాపూర్ లో 800-1000 బస్తాల సరుకు రాబడిపై మీడియం రూ. 5500-6000, నాణ్యమైన సరుకు రూ. 7000-7600 మరియు ఆంధ్రప్రదేశ్ లోని క్రిష్ణా జిల్లా మినుములు స్థానిక మార్కెట్ లలో పాలిష్ సరుకు రూ. 8100, అన్-పాలిష్ రూ. 7800, నంద్యాల, ప్రొద్దుటూరు, కడపలో పాలిష్ సరుకు రూ. 7800 అన్-పాలిష్ రూ. 7600, విజయవాడలో గుండు మినుములు పాలిష్ సరుకు రూ. 12,800, పప్పు రూ. 10,500, మీడియం రూ. 8500-9500 ధరతో వ్యాపారమైంది.


 మధ్య ప్రదేశ్ లోని అశోక్ నగర్ లో 700-800 బస్తాల కొత్త సరుకు రాబడి పె రూ. 4200-6000, దమోహ, గంజ్బసోదా, జబల్ పూర్, బినా మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి 8-10 వేల బస్తాల మినుముల రాబడిపై నాసిరకం సరుకు రూ. 3800-4200, మీడియం రూ. 5800-6000, నాణ్యమైన సరుకు రూ. 7000-7800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 


ఉత్తరప్రదేశ్ లోని మహోబాలో 2-3 వేల బస్తాలు, లలిత పూర్ లో 5 వేల బస్తాలు, ఉ౦లో 800-1000 బస్తాలు, చందౌసి, బిల్సి ప్రాంతాలలో 700-800 బస్తాల సరుకు రాబడిపై మీడియం రూ. 4000-5500, నాణ్యమైన సరుకు రూ. 6000-7000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని సోలాపూర్, బార్టీ, దూద్ లో 5-6 వేల బస్తాలు, అహ్మద్ నగర్ లో 8001000 బస్తాలు, ఖామ్ గాంవ్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి 7-8 వేల బస్తాల మినుముల రాబడిపై మీడియం సరుకు రూ. 4000-4500, నాణ్యమైన సరుకు రూ. 6500-7500, కర్ణాటకలోని కల్బుర్గి, బీదర్, బాల్కీ, హుమ్నాబాద్ ప్రాంతాలలో కలిసి 6-7 వేల బస్తాలు రూ. 5600-7790 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog