ప్రస్తుత ఖరీఫ్ లో మినుముల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉన్నందున నాఫెడ్ చే దిగుమతి అయిన మినుములు కొనుగోలు చేయడం కోసం అంతర్జాతీయ టెండర్ జారీ చేయడానికి బదులుగా వేలాల మాధ్యమంగా 25-35 వేల టన్నుల సరుకు కొనుగోలు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ కు ఆదే శించింది. దీని తరువాత నాఫెడ్ వేలాలలో పాల్గొనేందుకు వ్యాపారులకు టెండర్ జారీ చేసింది. ఇందులో చెన్నై, విశాఖపట్టణం లేదా నవసేవ ఓడరేవులలో పేర్కొన బడిన వేర్ హౌజ్ గిడ్డంగుల నుండి ఎక్కడినుండెనా సరే సరుకు సరఫరా చేయా ల్సిందిగా కోరడం జరిగింది. నాఫెడ్ కొనుగోళ్లలో దినసరి కనీస బిడ్ 500 టన్నులు, గరిష్టంగా 2 వేల టన్నుల కొనుగోళ్లు ఉండగలవు.
లభించిన సమాచారం ప్రకారం ఈ ఏడాది మయన్మార్‌లో ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే పెరిగి 5 లక్షల టన్నులకు చేరింది. దీనితో అక్కడి నుండి దిగుమతులు పెరిగే అవకాశం ఉన్నందున మరియు దేశంలో గత ఖరీఫ్ సీజన్లో 18 లక్షల టన్నులు, రబీ సీజన్ లో 9.60 లక్షల టన్నులు కలిసి మొత్తం 27.60 ల.ట. సరుకు ఉత్పత్తి అయింది. అనగా ముందు సంవత్సరంలో ఉత్పత్తి అయిన 22.30 లక్షల టన్ను లతో పోలిస్తే పె ఉత్పత్తి అధికంగా ఉంది.
ప్రస్తుత ఖరీఫ్ లో విస్తీర్ణం తగ్గడం మరియు సరుకు కొనుగోలుకు నాఫెడ్ సిద్ధమైనప్పటికీ, ధరల పెరుగుదలకు అడ్డుకట్ట పడింది.
దేశవ్యాప్తంగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సెప్టెంబర్ 2 నాటికి మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిసేత 38.18 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 36.62 లక్షల హెక్టార్లకు పరిమితమైంది. అయితే మధ్య ప్రదేశ్ లో 15.38 ల.హె. నుండి పెరిగి 16.90 ల.హె.లకు చేరగా, మహారాష్ట్రలో 4.30 ల.హె. నుండి తగ్గి 3.56 ల.హె.లకు, రాజస్థాన్లో 3.17 ల.హె., ఉత్తరప్రదేశ్ లో 7.10 ల.హె., గుజరా త్ లో 1,54,469 హెక్టార్ల నుండి తగ్గి 95,772 హెక్టార్లకు చేరింది. తెలంగా ణలో 41,928 ఎకరాల నుండి తగ్గి 29,195 ఎకరాలకు చేరింది.
మహారాష్ట్రలోని దూద్ని, అకల్ కోట్ ప్రాంతాల 2 శాతం డ్యా మేజ్ మరియు 1 కిలో మట్టి కండీషన్ సరుకు చెన్నై డెలివరి రూ. 7850, త్రిచి, సేలం, విరుద్ నగర్, దిండిగల్ డెలివరి రూ. 7950 మరియు నంద్యాల ప్రాంతపు పియు-31 రకం కొత్త సరుకు చెన్నై డెలివరి రూ. 7800, కర్ణాటకలోని హుబ్లీ, ధారా వాడ్ ప్రాంతాల 17 శాతం నిమ్ము సరుకు రూ. 7750-7800 ధరతో వ్యాపారకొనుగోలు చేయాల్సిందిగా నాఫెడకు ఆదేశాలు మెంది. అంతర్జాతీయ విపణిలో సోమవారం ఎ క్యూ ప్రతి టన్ను 5 డాలర్లు తగ్గి 985 డాలర్ మరియు ఎస్ఎ క్యూ 850 డాలర్ ప్రతి టన్ను ప్రతిపాదించడంతో ముంబైలో ఎస్ఎ క్యూ రూ. 7050, చెన్నైలో రూ. 7025, ఎస్ క్యూ రూ. 7950, కోల్ కతాలో ఎస్ఎ క్యూ రూ. 7100-7200, దిల్లీలో ఎ క్యూ రూ. 8250, ఎస్ఎ క్యూ రూ. 7250 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
మధ్య ప్రదేశ్ లోని జబల్పూర్ లో ప్రతి రోజు 1800-2000 బస్తాల సరుకు రాబడిపై రూ. 4500-6800, నిమచ్, అశోక్ నగర్, బసౌదా మార్కెట్లలో రూ. 4000-6500, ఇండోర్ లో రూ. 6800-7200 మరియు మహారాష్ట్రలోని అకోలాలో రూ. 6300, అహ్మద్ నగర్ లో రూ. 4500-7300జల్గాం లో మధ్య ప్రదేశ్ సరుకు రూ. 6900, మహారాష్ట్ర సరుకు రూ. 7200-7450 ధరతో వ్యాపారమైంది.
ఆంధ్రప్రదేశ్ లోని క్రిష్ణా జిల్లా మినుములు స్థానిక మార్కెట్లలో పాలిష్ సరుకు రూ. 8100, అన్-పాలిష్ రూ. 7700, నంద్యాల, ప్రొద్దుటూరు, కడపలో పాలిష్ సరుకు రూ. 8000, అన్-పాలిష్ రూ. 7800, విజయవాడలో గుండు మినుములు పాలిష్ సరుకు రూ. 13,000, పప్పు రూ. 10,500, మీడియం రూ. 8700-9700, బెంగుళూరు కోసం మహారాష్ట్ర పప్పు నాణ్యమైన సరుకు రూ. 10,200, మీడియం రూ. 8600-8800 ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు