విస్తీర్ణం తగ్గడంతో బలోపేతం చెందిన మినుముల ధరలు

 

వ్యాపారస్తుల కథనం ప్రకారం మినుములు మద్దతు ధరలు పెరిగిన తరువాత ఆంధ్ర రెత్తుల అమ్మకాలు తగ్గడంతో మరియు మధ్య ప్రదేశ్, పంజాబ్ లో మద్దతు ధరతో కొనుగోలు చేయడం జరుగుతుందని హామీ ఇవ్వడంతో మార్కెట్లలో రాబడులు తగ్గాయి. తమిళనాడులో మిల్లుల డిమాండ్ రావడంతో మరియు దిగు మతి అయిన సరుకు ధరలు పెరగడంతో ధరలు బలోపేతం చెందాయి. వ్యవ సాయ మంత్రిత్వ శాఖ వారి వివరాల ప్రకారం జూన్ 24 వరకు విస్తీర్ణం గతే డాది ఇదే వ్యవధితో పోలిస్తే 1.94 ల.హె. నుండి తగ్గి 93 వేల హెక్టార్లకు చేరింది. ఇందులో మినుము పంట విత్తే సమయం దాటి పోతున్నది.తద్వారా మహారాష్ట్ర, మద్యప్రదేశ్ రెతులు ఆందోళన చెందుతున్నారు. మినుము స్థానంలో సోయాబీన్, పత్తి మొదలగు పంటల సాగు చేపట్టవలసిందిగా రెత్తులకు సలహా ఇవ్వడం జరుగుతోంది. 


అంతర్జాతీయ విపణిలో మినుములు ఎస్ క్యూ 10 డాలర్లు పెరిగి 1020 డాలర్లు, ఎఫ్ఎక్యూ 920 డాలర్లు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించడంతో, ముంబైలో ఎఫ్ఎక్యూ కొత్త సరుకు పెరిగి రూ. 7225-7250, చెన్నైలో ఎఫ్ఎక్యూ రూ. 7300, ఎస్యూ రూ. 7950, దిల్లీలో ఎస్ క్యూ రూ. 8150,ఎఫ్ఎక్యూ రూ.7450-7475, కోల్కతాలో ఎఫ్ఎక్యూ రూ. 7300-7350 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్య ప్రదేశ్లోని జబల్ పూర్ ప్రాంతపు కొత్త గ్రెవైటీ క్లీన్ మినుములు చెన్నె డెలివరి రూ. 200 పెరిగి రూ. 7950, ఆంధ్ర ప్రాంతపు పాలిష్ సరుకు రూ. 7600, సాదా రూ. 7350 మరియు జబల్ పూర్లో వారంలో 30-40 వేల బస్తాలు రాబ డిపె రూ. 5500-6800, దామోహ్, గంజ్ బసోదాలలో రూ.3600 -6600, ఇండోర్లో రూ. 7000 7300 ధరతో వ్యాపారమెంది.


తమిళనాడులోని విల్లుపురం, దిండివనం, తిరుకోవిలూరు ప్రాంతా లలో వారంలో 7-8 వేల బస్తాల రాబ డిపె రూ. 7450-7500, శంకరన్ కోవిల్, కోవిల్పట్టిలలో 300 బస్తాలరాబడిపై రూ. 7300-7350 ధరతో వ్యాపారమెంది. 

ఆంధ్రప్రదేశ్లోని క్రిష్ణా జిల్లా స్థానిక మార్కెట్లలో పాలిష్ మినుములు రూ.300 పెరిగి రూ. 7500, సాదా రూ. 7200, నంద్యాల, ప్రొద్దుటూరు, కడపలో పాలిష్ సరుకు రూ. 7200-7400, అన్-పాలిష్ రూ. 7100-7200, విజయవాడలో గుండు మినుములు నాణ్యమైన సరుకు రూ. 11,700, పప్పు రూ. 10,000, మీడియం రూ.8600-9600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని అకోలాలో రూ. 6000, మోగర్ రకం రూ. 9200-9300, బోల్డ్ రకం రూ. 9900-10,000, జల్గాంవ్ లో మధ్య ప్రదేశ్ సరుకు రూ. 6550, మహా రాష్ట్ర సరుకు రూ. 6950 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు