కొత్త మినుములకు నెలకొన్న గిరాకీ



 వ్యసాయ మంత్రిత్వ శాఖ వారి వివరాల ప్రకారం దేశంలో మే 5 వరకు యాసంగి మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోల్చితే 3.15 నుండి పెరిగి 3.19 విస్తరించింది.అంతర్జాతీయ మార్కెట్లో ఎస్క్యూ మినుములు 15 డాలర్లు తగ్గి 1045 డాలర్లు, ఎఫ్ఎక్యూ 945 డాలర్లు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించినప్ప టికీ, గిరాకీ ఉన్నందున ముంబెలో ఎఫ్ఎక్యూ రూ. 75 పెరిగి రూ. 7800, చెన్నెలో FQ రూ. 8400, ఎఫ్ఎక్యూ రూ. 7650 మరియు కోల్కత్తాలో రూ. 8000–8100, దిల్లీలో ఎస్యూ రూ. 8750, ఎఫ్ఎక్యూ రూ. 7875 ధరతో వ్యాపారమైంది. 


ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్జ్ ప్రాంతంలో ఎర్ర మినుము పంట కోతలు కొనసాగుతున్నందున మే 15 తరువాత రాబడులు పెరిగే అవకాశం కలదు. దేశంలో వేసవి మినుముల రాబడులతో పాటు గుండు రకం సరుకు తయారీ మిల్లుల డిమాండ్తో గుజరాత్లోని సౌరాష్ట్ర జిల్లాలోని వేరా వల్ ప్రాంతపు కొత్త పెసలు రూ. 8300-8400, రాజ్కోట్లో రూ. 8000-8500 ధరతో వ్యాపారమైంది.

తమిళనాడులోని చిదంబరం, విల్లుపురం, దిండివనం, తట్టన్చావడి, విక్రంవాడి, ఉలుండరుపేట, కోవిల్పట్టి, శంకరన్కోవిల్ ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 1000-1200 బస్తాల మినుముల రాబడిపై రూ. 7600-7850 లోకల్ లూజ్, చెన్నై డెలివరి రూ. 8000, క్రిష్ణా జిల్లా పాలిష్ మినుములు రూ. 8150, 2-2 కండీషన్ సరుకు రూ. 8000-8050, ఆంధ్ర, తెలంగాణ సరుకు విరుధ్ నగర్ డెలివరి రూ. 7850 క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

రాజస్థాన్లోని కేక్, మెడతా, కోటా ప్రాంతాలలో మినుములు రూ. 6500-8000, మధ్య ప్రదేశ్లోని జబల్పూర్, అశోక్ నగర్, బినా ప్రాంతాలలో రూ. 6500-7500, ఇండోర్లో రూ. 7300-7800 ధరతో వ్యాపారమెంది.

నిరవధికంగా కురుస్తున్న వర్షాల వలన అనేక ప్రాంతాలలో వేసవి కాలం మినుము పంటకు నష్టం వాటిల్లే అంచనాతో గత వారం ధరలు బలోపేతం చెందా యి. ఆంధ్రప్రదేశ్లోని క్రిష్ణా జిల్లాలో పాలిష్ సరుకు రూ. 7800, సాదా రూ. 7500, నంద్యాలలో పాలిష్ మినుములు రూ. 7700, అన్-పాలిష్ రూ. 7500, ప్రొద్దుటూరు, కడపలో పాలిష్ మినుములు రూ. 7600, అన్-పాలిష్ రూ. 7400, విజయవాడలో గుండు మినుములు రూ. 12,700, పప్పు మీడియం రూ.9000-10,000, నాణ్యమైన సరుకు రూ. 10,400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog