గత వారం దక్షిణ భారత పప్పు మిల్లర్ల ద్వారా కొనుగోలు పెరగడంతో దిగుమతి అయిన సరుకు రూ. 150-200 పెరగడంతో దేశీ సరుకు రూ. 50-75 పెరిగింది. మహారాష్ట్రలో సాంగ్లీ లో గతవారం 2లారీల సరుకు రాబడిపై చెన్నై డెలివరీ రూ. 7400-7450, తమిళనాడులోని విల్లుపురం, మయవరం, పన్ ట్టి, చిదంబరం, తంజావురు తదితర మార్కెట్లలలో కలిసి దినసరి 2-3 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై విల్లుపురం ప్రాతం సరుకు చెన్నై డెలివరీ రూ.7000 - 7050, తంజావూరు సరుకు రూ. 6950, రాయలసీమ సరుకు రూ.6800-6900, క్రిష్ణ జిల్లా కొత్త పాలీష్ రూ. 7050-7100 ధరతో వ్యాపారమైంది.
ముంబైలో ఎఫ్ఎక్యూ కొత్త సరుకు రూ. 275 పెరిగి రూ. 6900-6950, పాత సరుకు రూ. 6850, చెన్నైలో ఎఫ్ఎక్యూ రూ. 6800, ఎస్క్యూ రూ.7600, దిల్లీలో ఎస్క్యూ రూ.7850-7900, మరియు ఎఫ్ఎక్యూ రూ. 7100-7150, కొల్కత్తాలో ఎఫ్ఎక్యూ రూ. 7100 ధరతో ప్రతి క్వింటాలు వ్యాపారమైంది.
ఆంధ్రప్రదేశ్లోని క్రిష్ణా జిల్లా స్థానిక మార్కెట్లలో పాలిష్ మినుములు రూ. 100 పెరిగి రూ. 6900, అన్-పాలిష్ రూ. 6600, నంద్యాలలో పాలిష్ సరుకు రూ. 6600, ప్రొద్దుటూరు, కడపలో పాలిష్ సరుకు రూ. 6500, అన్-పాలిష్ రూ. 6300, విజయవాడలో గుండు మినుములు నాణ్యమైన సరుకు రూ. 11,600, మీడియం రూ. 9800, పప్పు రూ. 8000-9000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపార మైంది.మహారాష్ట్రలో అకోలా లో మోగర్ రకం రూ. 9500-9800, నాణ్యమైన సరుకు రూ. 9900-10,200, జల్గావ్ లో మధ్య ప్రదేశ్ సరుకు రూ.6500, మహారాష్ట్ర సరుకు రూ.6700 ధరతో వ్యాపారమెంది.
మధ్య ప్రదేశ్ ని, టికంఘడ్లో 1000 బస్తాల రాబడిపై రూ. 5200-5900, జబల్పూర్ లో రూ. 4500-6250, ఇండోర్ లో రూ. 6500 -6600, రాజస్థాన్లోని కేక్ లో 800-1000 బస్తాలు రాబడిపై రూ. 5800 6600, సవాయ్ మాధోపూర్ లో 200-300 బస్తాల రాబడిపై రూ. 5500 5900, ఉత్తరప్రదేశ్లోని జాన్సీ, లాలిత్పూర్, బిల్సి, బహజోయి ప్రాంతాలలో దినసరి 3–4 వేల బస్తాల రాబడిపై డామేజ్ సరుకు రూ. 5500-6200, నాణ్యమైన సరుకు రూ. 6500-6750, మరియు లారీబిల్టి రూ. 6800 ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు