మినుములు స్థిరం

 



 రబీ సీజన్ కోసం మినుమ సేద్యం సమయానికి ముందే ప్రారంభమైంది. గుంతకల్ ప్రాంతంలో మరో నెలలో కొత్త సరుకు రాబడి ప్రారంభమయ్యే అవకాశం కలదు. అయితే ప్రస్తుత వర్షాల వలన పంటకు నష్టం చేకూరే పరిస్థితి ఉంది. మహబూబ్ నగర్ ప్రాంతంలో పంటకు అనుకూల వర్షాలు ఉన్నప్పటికీ, రాబోవు రోజులలో వర్షాలు అధికంగా ఉంటే నష్టం చే కూర గలదు. ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల గైవిటీ క్లీన్ సరుకు ఆంధ్ర కోసం రవాణా అవుతోంది.


 కాగా, తమిళనాడు మిల్లర్లు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నందున ధరల పెరుగుదలకు అడ్డుకట్ట పడింది. అయితే ఆంధ్రలో బ్రాండెడ్ గుండు సరుకు తయారీ మిల్లులు రాజస్థాన్ లోని కేడి ప్రాంతం నుండి నాణ్యమైన సరుకు కొనుగోలు చేస్తున్నాయి.


అంతర్జాతీయ విపణిలో ఎ క్యూ 10 డాలర్ పెరిగి 975 డాలర్ మరియుఎస్ఎ క్యూ 835 డాలర్ ప్రతి టన్ను  ప్రతిపాదించడంతో ముంబైలో ఎస్ఎ క్యూ రూ. 100 పెరిగి రూ. 7250, చెన్నైలో రూ. 7000, ఎస్యూ రూ. 8075, కోల్ కతాలో ఎస్ఎ క్యూ రూ. 7250-7300, దిల్లీలో ఎస్ క్యూ రూ. 8425-8450, ఎ క్యూ రూ. 7325-7350 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


రాజస్తాన్ లోని కేడిలో 7-8 వేల బస్తాలు, కోటాలో రూ. 3 వేల బస్తాలు,మెడ తాలో 2-3 వేల బస్తాలు, సవాయిమాధాపూర్ లో 1000 -1500 బస్తాలు, సుమేర్ పూర్ లో 4-5 వేల బస్తాలు, కిషన్ గఢ్ లో 1500-2000 బస్తాల సరుకు రాబడి పై మీడియం రూ. 3500 -6650, నాణ్య మైన సరుకు రూ. 7000-7200, జైపూర్ లో రూ. 5600 -7800, బోల్డు సరుకు రూ.5850-6000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


ఆంధ్ర ప్రదేశ్ లోని క్రిష్ణా జిల్లా మినుములు స్థానిక మార్కెట్ లలో పాలిష్ సరుకు రూ. 8100, అన్-పాలిష్ రూ. 7800, నంద్యాల, ప్రొద్దుటూరు, కడపలో పాలిష్ సరుకు రూ. 7800, అన్ - పాలిష్ రూ. 7600, విజయవాడలో గుండు మినుములు పాలిష్ సరుకు రూ. 12,800, పప్పు రూ. 10,500, మీడియం రూ. 8500-9500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

మధ్య ప్రదేశ్ లోని అశోక్ నగర్ లో 1500 బస్తాల కొత్త సరుకు రాబడిపై రూ. 4500-5500, దమోహలో, బసోదా, జబల్ పూర్, బినాలో మార్కెట్లలో కలిసి సూమారు 10-12 వేల బస్తాల సరుకు రాబడిపె నాసి రకం రూ. 3500-4000, మీడియం రూ.5500-6000, నాణ్యమైన సరుకు రూ. 6800-7400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 


ఉత్తరప్రదేశ్లోని మహోబాలో 2-3 వేల బస్తాలు, లలిత్పూర్లో 7-8 వేల బస్తాలు, ఉరైలో 1000-1200 బస్తాలు, చందౌసి, బిలాసి, బహజోయి ప్రాంతాలలో 1000-1200 బస్తాల సరుకు రాబడిపై మీడియం రూ. 45005000, నాణ్యమైన సరుకు రూ. 6500 -6900 ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని బార్షీ, సోలాపూర్, దూదినిలలో 7-8 వేల బస్తాలు, అహ్మద్ నగర్ లో 800-1000 బస్తాలు, ఖామ్ంవ్లో 4-5 వేల

బస్తాలు మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి 8–10 వేల బస్తాల మినుముల రాబడిపై మీడియం సరుకు రూ. 4000-4500, నాణ్యమైన సరుకు రూ. 6500-7500, కర్ణాటకలోని కల్బుర్గి, బీదర్, బాల్కీ, హుమ్నాబాద్ ప్రాంతాలలో కలిసి 7-8 వేల బస్తాల రాబడి కాగా, రూ. 5000 - 7300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog