మినుములపై కొనుగోలుదారుల శీతకన్ను

 


పెరుగుతున్న పప్పు ధాన్యాల ధరల నియంత్రించేందుకు ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యలు, కొత్త మినుముల రాబడులకు ఆసన్నమైన తరుణం మరియు స్టాకిస్టుల ఆసక్తి సన్నగిల్లినందున గత వారం మినుముల ధర ప్రతి క్వింటాలుకు రూ. 150-200 పతనమైంది.


వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి వివరాల ప్రకారం ఆగస్టు 19 నాటికి దేశంలో మినుముల సేద్యం గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 37.10 ల.హె. నుండి తగ్గి 35.21 ల.హె.కు పరిమితమైందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది. ఇందులో ఆగస్టు 15 నాటికి గుజరాత్ మినుముల సేద్యం1,53,920 హెక్టార్ల నుండి తగ్గి 92,313 హెక్టార్లకు పరిమితమైంది. 2021-22 (జూలై-జూన్) సీజన్లో దేశంలో మినుముల ఉత్పత్తి 28.40 ల.ట. ఉండగలదని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తమ నాల్గవ ముందస్తు అంచనాలో పేర్కొన్నది. అయితే, ప్రతికూల వాతాపరణ పరిస్థితులను పరిగణనలోనికి తీసుకున్నట్లయితే ఉత్పత్తి తగ్గగలదని భావిస్తున్నారు. అయితే రబీ, యాసంగి సేద్యం రైతులు విస్తృతపరిచినందున దేశీయ సరఫరా భర్తీ చేయవచ్చని భావిస్తున్నారు. అంతర్జాతీయ విపణిలో సోమవారం ఎస్ క్యూ ప్రతి టన్ను 1005 డాలర్ పలికిన ధర శనివారం నాటికి 10 డాలర్ పెరిగి 1015 డాలర్ మరియు ఎఫ్ఎక్యూ865 డాలర్ నుండి 875 డాలర్కు ఎగబాకినందున ముంబైలో ఎఫ్ఎక్యూ రూ.7200, చెన్నైలో రూ.7150-7175, ఎస్యూ రూ.8150, కోల్కతాలో ఎఫ్ఎక్యూ రూ. 7300-7400, దిల్లీలో ఎస్క్యూ రూ.8475-8500,ఎఫ్ఎ క్యూ రూ.7100-7425 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మినుములు చెన్నై డెలివరి రూ. 8100 ధరతో వ్యాపారమైంది. మధ్య ప్రదేశ్లోని జబల్పూర్లో ప్రతి రోజు 700-800 బస్తాల, సరుకు రాబడిపై రూ. 5000-7200, నిమచ్, అశోక్ నగర్, బసౌదా మార్కెట్లలో, రూ. 3500-6500, ఇండోర్లో 6800-7300 మరియు మహారాష్ట్రలోని అకోలాలో రూ. 6300, అహ్మద్ నగర్ లో రూ.4500-7500, జల్గాంవ్లో మధ్యప్రదేశ్ సరుకు రూ. 700-500, ఆంధ్రప్రదేశ్లోని క్రిష్ణా జిల్లా మినుములు స్థానిక మార్కెట్లలో పాలిష్ సరుకు రూ. 200 తగ్గి రూ. 8200, అన్-పాలిష్ రూ. 7800, నంద్యాల, ప్రొద్దుటూరు, కడపలో పాలిష్ సరుకు రూ. 8100, అన్-పాలిష్ రూ. 7900, విజయవాడలో గుండు మినుములు పాలిష్ సరుకు రూ. 13,300, పప్పు రూ. 10,600, మీడియం రూ. 9000-10,000, బెంగుళూరు కోసం మహారాష్ట్ర పప్పు నాణ్యమైన సరుకు రూ. 10,400-10,800, మీడియం రూ. 8800-9000 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog