హెచ్చుముఖంలో మినుముల ధరలు

 



 వ్యవసాయ మంత్రిత్వశాఖవారి నివేదిక ప్రకారం ప్రస్తుత ఖరీప్లో దేశంలో 29, జూలై వరకు మినుము విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 27 లక్షల 94 వేల హెక్టార్ల నుండి పెరిగి28 లక్షల 1 వేయి హెక్టార్లకు చేరింది. అయితే, వ్యాపారస్తుల అంచనా ప్రకారం మహారాష్ట్ర, తెలంగాణా మరియు ఉత్తర కర్నాటక లలో భారీ వర్షాల వలన పంటకు నష్టం వాటిల్లింది. ప్రస్తుత ఖరీప్లో 27, జూలై వరకు తెలంగాణాలో మినుము విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 51,095 ఎకరాలనుండి 41,088 ఎకరాలకు, గుజరాత్లో 25, జూలై వరకు గత ఏడాదితో పోలిస్తే 1,23,120 హెక్టార్ల నుండి 50 శాతం తగ్గి 60,588 హెక్టార్లకు చేరగా, రాజస్తాన్లో 1,77,130 హెక్టార్ల నుండి పెరిగి 3,01,340 హెక్టార్లకు చేరింది. 


గతవారం అంతర్జాతీయ మార్కెట్లో ఎస్క్యూ 10 డాలర్లు పెరిగి 1070 డాలర్లు మరియు ఎఫ్ఎక్యూ 950 డాలర్లు ప్రతిటన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించడంతో మరియు దేశంలో నాణ్యమైన సరుకు కొరత ఉండడంతో ముంబాయిలో ఎఫ్ఎక్యూ రూ. 200 పెరిగి రూ. 7650, చెన్నైలో ఎఫ్ఎక్యూ రూ. 7700, ఎస్యూ రూ. 8825 మరియు ఆంధ్ర పాలిష్ చెన్నై డెలివరీ రూ.400 పెరిగి రూ. 8800-8900, సాదా రూ. 8700, మధ్య ప్రదేశ్ లోని జబల్పూర్ ప్రాంతపు 4-5శాతం డ్యామేజ్ స్వల్ప నిమ్ము కండిషన్ సరుకు రూ.8400-8600 మరియు గుజరాత్లోని వేరావల్ ప్రాంతపు బోర్డు డ్రై ఒక కిలో మట్టి కండీషన్ సరుకు రూ.9150 ధరతో వ్యాపారమయింది. మధ్య ప్రదేశ్లోని జబల్పూర్ మరియు రాష్ట్రంలోని ఇతర అన్ని ఉత్పాదకకేంద్రాలలో కలిసి 12-15 వేల బస్తాల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 7000-7900, మీడియం రూ. 6000-7000 ధరతో వ్యాపారమయింది.


క్రిష్ణా జిల్లా మార్కెట్లలో పాలిష్ మినుములు రూ. 8500, సాదా రూ. 8200, నంద్యాల, ప్రొద్దుటూరు, కడపలలో పాలిష్ రూ.8200-8300, సాదా రూ. 8000-8100, విజయవాడలో గుండు పాలిష్ రూ.12800, పప్పు రూ. 11200, మీడియం పప్పు రూ. 9200-10400, బెంగుళూర కోసం మహారాష్ట్ర ప్రాంతపు నాణ్యమైన పప్పు రూ. 11500, మీడియం రూ.9500 ధరతో వ్యాపారమయింది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు