కొత్త మినుములకు గిరాకీ

 


హైదరాబాద్ - మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్ లాంటి ఉత్పాదక రాష్ట్రా లలో కొత్త మినుముల రాబడులు పెరుగుతున్నాయి. కాగా, మిల్లర్ల కొనుగోళ్లతో పాటు ఉత్పత్తి తగ్గే అంచనాతో స్టాకిస్టులు కూడా అప్రమత్తమౌతున్నారు. దీనితో కొత్త మినుము లకు గిరాకీ నెలకొనడంతో ధరలు బలోపేతం చెందాయి. 


డాలర్‌తో రూపాయి విలువ తగ్గిన నేపథ్యంలో విదేశీ ఎగుమతిదారులు భారత్ కు ఎగుమతులు పెంచడం కోసం అంతర్జాతీయ మార్కెట్లో ఎస్క్యూ సరుకు 25 డాలర్లు తగ్గించి 990 డాలర్లు మరియు ఎస్ఎ క్యూ 850 డాలర్లు ప్రతి పాదించడంతో ముంబైల్లో ఎస్ఎ క్యూ రూ. 7200, చెన్నైలో రూ. 7150, ఎస్యూ రూ. 8200, కోల్‌కతాలో ఎఫ్ఎక్వూ రూ. 7200-7300, దిల్లీలో ఎస్క్యూ రూ. 8550, ఎస్ఏక్యూ రూ. 7500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. వ్యవ సాయ మంత్రిత్వ శాఖ వారి తాజా నివేదిక ప్రకారం దేశంలో 23 సెప్టెంబర్ నాటికి మిను ము పంట సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 39.26 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 37.75 లక్షల హెక్టార్లకు చేరింది. వ్యాపారస్తుల అంచనా ప్రకారం పంట దిగుబడి తగ్గ డంతో పాటు కొన్ని ప్రాంతాలలో సరుకు నాణ్యత కూడా తగ్గవచ్చు. దీనితో స్టాకిస్టుల కొను గోళ్లు ప్రారంభమయ్యాయి. వచ్చే వారం నుండి రాబడులు పెరిగే అవకాశం కలదు.

మధ్య ప్రదేశ్ లోని దామోహ్ లో దినసరి 2500-3000 బస్తాలు, బీనాలో 800-1000 బస్తాల కొత్త సరుకు రాబడి కాగా, రూ. 4500-6200, జబల్ పూర్ లో ప్రతి రోజు 1400-1500 బస్తాల సరుకు రాబడిపై రూ. 4000-6760, నిమచ్, అశోక్ నగర్, బసోదా మార్కెట్లలో రూ. 5000-6000, ఇండోర్‌లో రూ. 6000-6500 మరియు 

మహారాష్ట్రలోని అక్కల్ లో దినసరి 2500-3000 బస్తాల కొత్త సరుకు రాబడిపై రూ. 6000-7500, అహ్మద్ నగర్ లో 1000-1200 బస్తాల కొత్త సరుకు రాబడిపె రూ. 7100-7500, దునిలో 1500 బస్తాలు రూ. 5000-7600, ఉద్లో 500-600 బస్తాలు రూ. 7700-8000, అకోలాలో రూ. 6500-6800,జల్గాంలో మధ్యప్రదేశ్ సరుకు రూ. 6650, మహారాష్ట్ర సరుకు రూ. 7300-7500, కర్ణాటకలోని సేడంలో 300-400 బస్తాల కొత్త సరుకు రాబడి కాగా, రూ. 7000-7800, బిద లో రూ. 7000-7900, యాలో రూ. 6400-7100 ధరతో వ్యాపారమైంది.

 ఆంధ్రప్రదేశ్ లోని క్రిష్ణా జిల్లా మినుములు స్థానిక మార్కెట్లలో పాలిష్ సరుకు రూ. 8200, అన్-పాలిష్ రూ. 7800, నంద్యాల, ప్రొద్దుటూరు, కడపలో పాలిష్ సరుకు రూ. 8000, అన్-పాలిష్ రూ. 7800, విజయవాడలో గుండు మినుములు పాలిష్ సరుకు రూ. 13,000, పప్పు రూ. 10,500,మీడియం పప్పు రూ. 8700-9700 మరియు 

రాజస్థాన్ లోని సవాయిమాధవ్ పూర్ లో 1500-2000 బస్తాల సరుకు రాబడిపె రూ. 4500-6800, కేక్ డి, కిషన్మ లలో రూ. 5 500-7200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog