నాఫెడ్ కొనుగోళ్లతో బలపడుతున్న మినుముల ధరలు

 


 అంతర్జాతీయ విపణిలో ఎ క్యూ ప్రతి టన్ను 985 డాలర్ మరియు ఎస్ఎ క్యూ 885 డాలర్ ప్రతి టన్ను ప్రతిపాదించడంతో ముంబైలో ఎస్ఎ క్యూ రూ. 7100, చెన్నైలో రూ. 6950, ఎస్ క్యూ రూ. 7825, కోల్ కతాలో ఎస్ఎ క్యూ రూ. 7100-7250, దిల్లీలో ఎ క్యూ రూ. 8200, ఎస్ఎ క్యూ రూ. 7300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


వ్యాపారస్తుల కథనం ప్రకారం ఈ ఏడాది విస్తీర్ణం తగ్గడం మరియు కొన్ని రాష్ట్రాలలో సరుకు డ్యా మేజ్ అయ్యే అవకాశం, గత సీజన్ లోని సరుకు నిల్వలు దాదాపు అడుగంటడంతో పాటు నాఫెడ్ దిగుమతి అయిన సరుకు కొనుగోలు చేస్తున్నందున కొత్త సీజన్ లో ధరలు పటిష్టంగా ఉండే అంచనా కలదు.

వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి తాజా నివేదిక ప్రకారం దేశంలో సెప్టెంబర్ 9 నాటికి మినుముల పంట సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 38.48 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 36.96 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తెలంగా ఇలో మినుము పంట సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 41,978 ఎకరాలనుండి తగ్గి 29,256 ఎకరాలకు, గుజరాత్ లో 1,54,749 హెక్టార్ల నుండి తగ్గి 96,728 హెక్టార్లకు చేరింది.

 మహారాష్ట్రలోని దూద ని, అకల్ కోట్ ప్రాంతాల నాణ్యమైన సరుకు చెన్నై డెలివరి రూ. 8050-8100, సాంగ్స్ ప్రాంతపు 15 శాతం నిమ్ము, 1 శాతం డ్యా మేజ్ మరియు 2 కిలో మట్టి కండీషన్ సరుకు చెన్నై డెలివరి రూ. 7500, నంద్యాల ప్రాంతపు పియు-31 రకం కొత్త సరుకు చెన్నై డెలివరి రూ. 7700 ధరతో వ్యాపారమెంది. 

మధ్యప్రదేశ్లోని జబల్‌పూర్‌లో ప్రతి రోజు 1000-1200 బస్తాల సరుకు రాబడిపై రూ. 4000-6550, నిమచ్, అశోక నగర్, బసోదా మార్కెట్లలో రూ. 4000-7000, ఇండోర్ లో రూ. 7000-7100 మరియు 

మహారాష్ట్రలోని అకోలాలో రూ. 6300, అహ్మద్ నగర్ లో 600-700 బస్తాల కొత్త సరుకు రాబడిపె రూ. 7200-7500,జల్గాం లో మధ్య ప్రదేశ్ సరుకు రూ. 6900, మహారాష్ట్ర సరుకు రూ. 7500-7700 ధరతో వ్యాపారమైంది. 

ఆంధ్రప్రదేశ్ లోని క్రిష్ణా జిల్లా మినుములు స్థానిక మార్కెట్ లో పాలిష్ సరుకు రూ. 8100, అన్-పాలిష్ రూ. 7700, నంద్యాల, ప్రొద్దుటూరు, కడపలో పాలిష్ సరుకు రూ. 7900, అన్-పాలిష్ రూ. 7700, విజయవాడలో గుండు మినుములు పాలిష్ సరుకు రూ. 13,000, పప్పు రూ. 10,500, మీడియం పప్పు రూ. 8700-9700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు