పెరుగుతున్న మినుముల ధరలకు కళ్లెం

 


 దక్షిణాది రాష్ట్రాల పప్పు మిల్లర్ల కొనుగోళ్లు మందగించినందున గత వారం పెరుగుతున్న మినుముల ధరలకు కళ్లెం పడింది.దేశంలో ఏప్రిల్ 21 వరకు యాసంగి మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోల్చితే 2.80 నుండి 2.91 విస్తరించిందని కేంద్ర వ్యవసాయ శాఖ పేర్కొన్నది. గుజరాత్లో ఏప్రిల్ 17 నాటికి 25,515 హెక్టార్ల నుండి తగ్గి 20,086 హెక్టార్లకు పరిమితమైంది. అయితే, దేశంలో తగ్గిన ఖరీఫ్ సీజన్ సేద్యం మరియు దిగుబడుల వలన ధరలు చెప్పుకోదగ్గ స్థాయికి దిగజారవని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.


 తమిళనాడులోని చిదంబరం, విల్లుపురం, దిండివనం, తట్టనాచావడి, విక్రంవాడి, ఉలుండరుపేట, కోవిల్పట్టి, శంకరన్ కోవిల్ ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 2000 - 2500 బస్తాల మినుముల రాబడిపై రూ. 7500-7690 లోకల్ లూజ్, చెన్నై డెలివరి రూ. 7600, తెలంగాణ ప్రాంతం టి-9 విత్తులు రూ. 7750, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల సరుకు విరుధ్నగర్ డెలివరి రూ.7550 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గత వారం అంతర్జాతీయ విపణిలో మినుములు ఎస్యూ మినుములు 1010 డాలర్, ఎఫ్ఎక్యూ 910 డాలర్ ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించినందున ముంబైలో ఎఫ్ఎక్యూ రూ.7600, చెన్నైలో ఎస్యూ రూ. 8100, ఎఫ్ఎక్యూ కొత్త సరుకు రూ. 7450, కోల్కతాలో రూ. 7600, దిల్లీలో ఎస్ క్యూ రూ. 8425-8550, ఎఫ్ఎక్యూ రూ. 7750 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

ఆంధ్రప్రదేశ్లోని క్రిష్ణా, నంద్యాల జిల్లా పాలిష్ మినుములు రూ. 7550, అన్-పాలిష్ రూ. 7350, ప్రొద్దుటూరు, కడపలో పాలిష్ మినుములు రూ. 7450, అన్-పాలిష్ రూ.7250, విజయవాడలో గుండు మినుములు రూ. 12,600, పప్పు మీడియం రూ. 8800-9800, నాణ్యమైన సరుకు రూ. 10,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. రాజస్తాన్లోని కేక్, మెడతా, కోటా, జైపూర్లో మినుములు రూ.6000-7500, మధ్యప్రదేశ్లోని జబల్ పూర్, అశోక్ నగర్ ప్రాంతాల మార్కెట్లలో రూ. 6000-7400, ఇండోర్లో రూ. 7500-7800, గుజరాత్లోని రాజ్కోట్లో రూ. 7000-8200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog