పెరిగిన యాసంగి మినుము విస్తీర్ణం

 

తమిళనాడులోని విల్లుపురం, మాయవరం, పనరుట్టి, చిదంబరం, తంజావూరు తదితర ప్రాంతాల మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 2000-2500 బస్తాల రాబడిపై కొత్త సరుకు రూ.6000-6850, విరుధ్ నగర్ సరుకు ఎస్క్యూ చెన్నై డెలివరి రూ. 7400 ధరతో వ్యాపారమైంది.


అంతర్జాతీయ విపణిలో మయన్మార్ ఎఫ్ఎక్యూ సోమవారం 1025 డాలర్లతో పోలిస్తే శనివారం వరకు 10 డాలర్లు పెరిగి 1035 డాలర్లు, ఎస్ఎక్యూ 930 డాలర్లతో పోలిస్తే 5 డాలర్లు పెరిగి 935 డాలర్లు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించడంతో ముంబైలో ఎఫ్ఎక్యూ కొత్త సరుకు రూ. 6900-6950, చెన్నైలో ఎఫ్ఎక్యూ రూ.6750, ఎస్క్యూ రూ. 7400, దిల్లీలో ఎ క్యూ రూ. 77750 -7800, ఎఫ్ఎక్యూ రూ. 7100 -7150, కోల్కతాలో ఎఫ్ఎ క్యూ రూ. 6950-7000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


దేశంలో ఏప్రిల్ 18 వరకు యాసంగి మినుము విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1.86 ల.హె. నుండి 1.36 ల.హె. పెరిగి 3.22 ల.హె. లకు చేరింది. దీనితో కొన్ని రాష్ట్రాల వ్యాపారులు దిగుమతి అయిన సరుకు కొనుగోలు చేసి నిల్వ చేసిన సరుకు విక్ర యిస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్లోని క్రిష్ణా జిల్లా స్థానిక మార్కెట్లలో పాలిష్ 6800, అన్-పాలిష్ రూ.6500, నంద్యాలలో పాలిష్ సరుకు రూ. 6500, ప్రొద్దుటూరు, కడపలో పాలిష్ సరుకు రూ. 6400, అన్-పాలిష్ రూ. 6200, విజయవాడలో గుండు 11,400, మీడియం రూ. 9600,మహారాష్ట్రలోని అకోలాలో రూ. 6000, మోగర్ రకం రూ. మినుములు రూ. 100 తగ్గి రూ.9200-9300, నాణ్యమైన సరుకు రూ. 9900-10,000 మరియు జల్గాంవ్లో మధ్యప్రదేశ్ సరుకు రూ. 6600, మహారాష్ట్ర సరుకు రూ. 7000 ధరతో వ్యాపారమెంది.పప్పు రూ. 8000-9000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


మధ్య ప్రదేశ్లోని టికంఘడ్ మినుములు నాణ్యమైన సరుకు రూ.500-600 బస్తాల రాబడిపై రూ. 5200-6000, హర్దా, జబల్పూర్ లలో రూ. 4500-6000, ఇండోర్లో రూ. 6500-6600 మరియు రాజస్థాన్లోని కేక్లో 800-1000 బస్తాల రాబడిపై రూ. 5800-6600, సవాయ్ మాధోపూర్లో 200-300 బస్తాల రాబడిపై రూ. 5500-5900 మరియు ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ, లలి త్పూర్, బిల్సి, బహజోయి, వజీర్ గంజ్ తదితర ప్రాంతాలలో ప్రతిరోజు 3-4 వేల బస్తాల రాబడిపై డ్యామేజ్ సరుకు రూ. 4800-5800, నాణ్యమైన సరు కు రూ. 6500-6700, లారీ బిల్టీ రూ. 6750 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog