బలోపేతం చెందిన మినుముల ధరలు



దేశంలో ఏప్రిల్ 28 వరకు యాసంగి మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోల్చితే 3.12 నుండి తగ్గి 3.08 విస్తరించిందని కేంద్ర వ్యవసాయ శాఖ పేర్కొన్నది. గుజరాత్లో ఏప్రిల్ 24 నాటికి 25,515 హెక్టార్ల నుండి తగ్గి 20,122 హెక్టార్లకు పరిమితమైంది.


వ్యాపారస్తుల కథనం ప్రకారం ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ ప్రాంతంలో జూన్ వరకు కొత్త ఎర్ర మినుముల రాబడి కాగలదు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో గిరాకీ లేనందున అస్సాం ప్రాంతం సరుకు రూ. 8100-8300, రాయ్ పూర్ ప్రాంతం సరుకు రూ. 8000-9000 ధరతో వ్యాపారమెంది.

మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, కర్ణాటక మొదలగు రాష్ట్రాలలో ఖరీఫ్ సీజన్ నాణ్యమెన సరుకు తక్కువగా ఉండడంతో నాణ్యమైన సరుకు ధరలు తగ్గే అవకాశం లేదు. అంతేకాకుండా జూలె నుండి ఆగస్టు వరకు ధరలు పెరిగే అంచనా కలదు. వేసవి సీజన్ సేద్యం తగ్గడంతో పాటు దేశంలోని అనేక ప్రాంతాలలో అకాల వర్షా లతో పంటలు ప్రభావితమయ్యే అవకాశం ఉండడంతో పాటు ఉత్పాదక కేంద్రాల వద్ద రబీ సీజన్ సరుకు రాబడులు సమాప్తం కావడం వలన అంతర్జాతీయ మార్కెట్లో ఎస్యూ మినుములు 50 డాలర్లు పెరిగి 1060 డాలర్లు, ఎఫ్ఎక్యూ 960 డాలర్లు ప్రతి టన్ను ప్రతిపాదించడంతో ముంబెలో ఎఫ్ఎక్యూ రూ. 125 పెరిగి రూ. 7725, చెన్నెలో ఎస్యూ రూ.8450, ఎఫ్ఎక్యూ రూ. 7700 మరియు కోల్ కత్తాలో రూ. 8200, దిల్లీలో ఎస్క్యూ రూ.8725-8750, ఎఫ్ఎక్యూ రూ. 7975-8000 ధరతో వ్యాపారమెంది.


తమిళనాడులోని చిదంబరం, విల్లుపురం, దిండివనం, తట్టనాచావడి, విక్రంవాడి, ఉలుండరుపేట, కోవిల్ పట్టి, శంకరన్కోవిల్ ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 1500-2000 బస్తాల మినుముల రాబడిపై రూ. 7400-7650 లోకల్ లూజ్, చెన్నై డెలివరి రూ.7800, క్రిష్ణా జిల్లా పాలిష్ మినుములు రూ. 8050, పిక్యూ-37 రకం రూ.7850, ఆంధ్ర, తెలంగాణ సరుకు విరుధ్ నగర్ డెలివరి రూ.7750 క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


ఆంధ్రప్రదేశ్లోని క్రిష్ణా, నంద్యాల జిల్లా పాలిష్ మినుములు రూ. 7700, అన్-పాలిష్ రూ. 7500, ప్రొద్దుటూరు, కడపలో పాలిష్ మినుములు రూ. 7600, అన్-పాలిష్ రూ. 7400, విజయవాడలో గుండు మినుములు రూ. 12,700, పప్పు మీడియం రూ. 8800-9800, నాణ్యమైన సరుకు రూ. 10,300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


రాజస్తాన్లోని కేక్ట్, మెడతా, కోటా మినుములు రూ.6000-7500, జైపూర్లో రూ. 7200-7800 మరియు మధ్య ప్రదేశ్లోని జబల్పూర్, అశోక్ నగర్ ప్రాంతాల మార్కెట్లలో రూ.6000-7400, ఇండోర్లో రూ.7500-7700 మరియు గుజరాత్లోని రాజ్కోట్లో రూ. 7500-8500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు