నవంబర్ చివరి నాటికి కొత్త మినుములు

 


 అంతర్జాతీయ విపణిలో ఎస్ క్యూ 15 డాలర్ తగ్గి 965 డాలర్ మరియు ఎస్ఎక్యూ 830 డాలర్ ప్రతి టన్ను ప్రతిపాదించబడింది. ఆంధ్రప్రదేశ్ లో సంతృప్తికరమైన వర్షాలు కురిసినందున రబీ సీజన్ కోసం గుంతకల్ లో మినుముల సేద్యం ప్రక్రియ ముగిసింది. నవంబర్ చివరి నాటికి ఈ పంట రాబడులు ప్రారంభం కావచ్చని భావిస్తున్నారు. తద్వారా తమిళనాడు వ్యాపారులు అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నారు.


ముంబైలో ఎస్ఎ క్యూ రూ. 50 తగ్గి రూ. 7100, చెన్నైలో రూ. 6950, ఎస్క్యూ రూ. 8075, కోల్‌కతాలో ఎస్ఎ క్యూ రూ. 7200-7300, దిల్లీలో ఎ క్యూ రూ. 8425, ఎఫ్ఎక్యూ రూ. 7325 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

దేశంలో ఖరీఫ్ పంటల నూర్పిళ్లు ముగిసిన వెంటనే రబీ సేద్యం ప్రక్రియ చేపడుతున్నారు. డిసెంబర్-మార్చి మధ్యకాలంలో రాబడులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఖరీఫ్ సీజన్ లో తగ్గిన సేద్యం, పంట నాసిరకంగా దిగుబడి అయినప్పటికీ ధరలు చైతన్యం చెంద లేదు. ఉత్తరప్రదేశ్ లో ఉత్పత్తి సంతృప్తికరంగా ఉన్నప్పటికీ సరుకు నాసిరకంగా దిగుబడి అయింది. గ్రేడెడ్ క్లీన్ 282 కండిషన్ సరుకు ఆంధ్రప్రదేశ్ డెలివరి రూ. 6800-6900, రాజస్తాన్ లోని కేక్ లో నాణ్యమైన బోర్డు సరుకు స్థానికంగా రూ. 7100-7250 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

రాజస్తాన్ లోని మెడతాలో 3-4వేల బస్తాలు, సవాయిమాధాపూర్‌లో 1000-1500 బస్తాలు, కేడిలో 4-5 వేల బస్తాలు, కిషన్ గఢ్ లో 1500-2000 బస్తాల సరుకు రాబడి పై మీడియం రూ. 5500-6500, నాణ్యమైన సరుకు రూ. 7000-7200, జైపూర్ లో రూ. 5600-6000, బోల్డు సరుకు రూ. 5500-6000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

ఆంధ్ర ప్రదేశ్ లోని క్రిష్ణా జిల్లా మినుములు స్థానిక మార్కెట్ లలో పాలిష్ సరుకు రూ. 8100, అన్-పాలిష్ రూ. 7800, నంద్యా ల, ప్రొద్దుటూరు, కడపలో పాలిష్ సరుకు రూ. 7900, అన్-పాలిష్ రూ. 7700, విజయవాడలో గుండు మినుములు పాలిష్ సరుకు రూ. 12,800, పప్పు రూ. 10,500,మీడియం రూ. 8500-9500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

మధ్య ప్రదేశ్ లోని అశోక్ నగర్ లో 1500 బస్తాల సరుకు రాబడిపై రూ. 4500-5500, ద మోహలో 3-4వేల బస్తాలు, బసోదాలో 500-600 బస్తాలు, జబల్‌పూర్, బినాలో 2 వేల బస్తాలు, నీమచ్ లో 1000-1200 బస్తాలు మరియు పరిసర ప్రాంతాల మార్కెట్ లలో కలిసి 10-12 వేలబస్తాల మినుముల రాబడిపై నాసిరకం సరుకు రూ. 3500-4000, మీడియం రూ. 5500-6000, నాణ్యమైన సరుకు రూ. 6800-7400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

ఉత్తర ప్రదేశ్ లోని మహోబాలో 2-3 వేల బస్తాలు, లలిత పూర్ లో 7-8 వేల బస్తాలు, ఉరైలో 1000-1200 బస్తాలు, చందౌసి, బిలాసి, బహజోయి ప్రాంతాలలో 1000-1200 బస్తాల సరుకు రాబడి పై మీడియం రూ. 4500-5000, నాణ్యమైన సరుకు రూ. 6500-6900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

మహారాష్ట్రలోని బార్లీలో 1500-2000 బస్తాలు, దూద్ లో 1000-1200 బస్తాలు, అహ్మద్ న గర్ లో 800-1000 బస్తాలు, ఖామ్ గాంవ్ లో 4-5 వేల బస్తాలు మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి 8-10 వేల బస్తాల మినుముల రాబడిపై మీడియం సరుకు రూ. 4000-4500, నాణ్య మైన సరుకు రూ. 6500-7500, కర్ణాటకలోని కల్బుర్గి, సేడెం, యాహిర్,బీదర్ ప్రాంతాలలో కలిసి 7-8 వేల బస్తాలు రూ. 5000-7300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog