వ్యవసాయ మంత్రి త్వశాఖ వారి వివరాల ప్రకారం 16, సెప్టెంబర్ వరకు దేశంలో మినుము విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవ ధితో పోలిస్తే 38.94 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 37.43 లక్షల హెక్టార్లకు చేరింది. తెలంగా ణలో 42,556 ఎకరాల నుండి తగ్గి 29,293 ఎకరాలకు చేరగా, గుజరాత్ లో 1,54,749 హెక్టార్ల నుండి తగ్గి 96,758 హెక్టార్లకు చేరడంతో పాటు మహారాష్ట్ర, కర్నాటకలలో దిగుబడి తగ్గుచున్నది.
నా ఫెడ్ వారు దిగుమతి అయిన మినుముల కొనుగోళ్లు మరియు ప్రభుత్వ కందులు, మినుములు మొద లగు అపరాల స్వేచ్చా దిగుమతి విధానం వలన విదేశీ ఎగుమతిదారులు అధిక ధరలను ప్రతిపాదించడంతో అంతర్జా తీయ మార్కెట్లో ఎ క్యూ 1000డాలర్లు ప్రతి టన్ను స్థాయిని దాటింది. దీనితో దిగుమతి అయిన సరుకు ధర రూ. 150-200 ప్రతి క్వింటాలుకు పెరిగింది.
అయితే, మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మొదలగు ఉత్సా దక రాష్ట్రాలలో కొత్త మినుముల రాబడిప్రారంభమయింది. అయితే, పంట దిగు బడి తగ్గ డంతో స్థానికంగా రూ. _6800-7400 క్వాలిటీ ప్రకారం వ్యా పా రమయింది. అంతర్జాతీయ విపణిలో ఎ క్యూ 30 డాలర్లు పెరిగి 1015 డాలర్లు, ఎస్ఎ క్యూ 885 డాలర్ ప్రతి టన్ను ప్రతిపాదించడంతో ముంబైలో ఎస్ఎ క్యూ రూ. 150 పెరిగి రూ. 7250, చెన్నైలో రూ. 7100, ఎస్యూ రూ. 8050, కోల్ కతాలో ఎఫ్ఎక్యూ రూ. 7200-7400, దిల్లీలో ఎ క్యూ రూ. 8475, ఎస్ఎ క్యూ రూ. 7475 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ప్రతి రోజు 1000 బస్తాల సరుకు రాబడిపై రూ. 4000-6700, నివుచ్ , అశోక్ నగర్, బసోదా మార్కెట్లలో రూ. 5500-6500, ఇండోర్ లో రూ. 6000-6500 మరియు మహారాష్ట్రలోని అకోలాలో రూ. 6300, అహ్మద్ నగర్ లో800-1000 బస్తాల కొత్త సరుకు రాబ డిపె రూ. 7000-7700, దుధ్ నిలో 1000-1200 బస్తాలు రూ.7000-7850, ఉద్ర్ లో 500-600 బస్తాలు రూ. 7000-8900జల్గాం లో మధ్య ప్రదేశ్ సరుకు రూ. 6950, మహారాష్ట్ర సరుకు రూ. 7500-7800, కర్ణాటక లోని సేడంలో 300-400 బస్తాల కొత్త సరుకు రూ. 7200-7800, గద గ్ లో రూ. 6000-7200, యాద్ర్ లో రూ. 6400-7020 ధరతో వ్యాపారమైంది.
ఆంధ్ర ప్రదేశ్ లోని క్రిష్ణా జిల్లా మినుములు స్థానిక మార్కెట్లలో పాలిష్ సరుకు రూ. 8200, అన్-పాలిష్ రూ. 7800, నంద్యాల, ప్రొద్దుటూరు, కడపలో పాలిష్ సరుకు రూ. 8000, అన్-పాలిష్ రూ. 7800, విజయవాడలో గుండు మినుములు పాలిష్ సరుకు రూ. 13,000, పప్పు రూ. 10,500, మీడియం పప్పు రూ. 8700-9700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు