కర్ణాటకలోని బెంగుళూరు, అరిసెకేరి, దావణగిరి,తుంకూరు, షిమోగా తదితర అన్ని మార్కెట్లలో ప్రతి రోజు 3-4 వేల బస్తాల కొత్త రాగుల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 2600-3000, మీడియం సరుకు రూ. 2200-2500, అ క్లీన్ రూ. 1600-1800 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది.
తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని మార్కెట్లలో కలిసి వారంలో 12-15 వాహనాల రాగులు రాబడి కాగా, రూ. 2300-2700, నవాబ్ పేట, షాద్నగర్ ప్రాంతాలలో 200-300 బస్తాల రాబడి కాగా, రూ. 2000–3000, విజయనగరం, చీపురుపల్లి ప్రాంతాలలో నిల్వ అయిన సరుకు తాడేపల్లిగూడెం డెలివరి రూ. 2800-2900, విజయనగరంలో 7-8 వాహనాల రాబడి కాగా, రూ. 2700 -2900 ధరతో వ్యాపారమెంది.
09-01-2022 7, జనవరి వరకు దేశంలో రబీ పెసర విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.67 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తమిళనాడు లో 32 వేల హెక్టార్లు మరియు ఒరిస్సాలో 3.31 లక్షల హెక్టార్లు తగ్గి 1.69 లక్షల హెక్టార్లకు చేరింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు