మద్దతు ధర తో శనగ కొనుగోళ్లు

 

2021-22 రబీ సీజన్లో అపరాల విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 1 కోటి 68 లక్షల 20 వేల హెక్టార్ల నుండి 47 శాతం పెరిగింది. పంట కోతలు పూర్తయ్యాయి. ఇందులో రబీ శనగ విస్తీర్ణం 1,14,95,000 హెక్టార్లు ఉంది. కొన్ని ప్రాంతాలలో పంట దిగుబడి మెరుగ్గా ఉంది. విస్తీర్ణంలో 45 శాతం శనగ మరియు సిరిశనగ 17.71 ల.హె.లలో 44 శాతం పంట కోతలు పూర్తయ్యాయి.


కేంద్ర ప్రభుత్వం దేశంలో మద్దతు ధరతో శనగల కొనుగోళ్లు ప్రారంభించింది. అయితే ఉత్పత్తి పెరగడంతో ధరలు పెరగడం లేదు. ఈ ఏడాది దక్షిణ భారత మిల్లులు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నాయి. కేంద్రం రూ. 5230 ప్రతి క్వింటాలు మద్దతు ధరతో 1,08,482 టన్నుల సరుకు కొనుగోలు చేసింది. ఇందులో గుజరాత్లో 53,937 టన్నులు, మహారాష్ట్రలో 45,252 టన్నులు, కర్ణాటకలో 9,293 టన్నుల సరుకు కొనుగోలు చేసింది. మహారాష్ట్ర, గుజరాత్లలో కొనుగోళ్లు కొనసాగుతుండగా, మార్చి 21 నుండి మధ్యప్రదేశ్లో 8.71 ల.ట. కొనుగోళ్లు ప్రారంభం కాగలవు. అయినప్పటికీ, రూ. 4300-4600 ధరతో వ్యాపారమవుతున్నది.


ముంబైలో టాంజానియా శనగలు రూ. 4401, సూడాన్ సరుకు రూ. 5000-5250 మరియు దిల్లీ లారెన్స్ రోడ్లో గత వారం 80-85 వాహనాల శనగల రాబడిపై రాజస్తాన్ సరుకు రూ. 5125-5150, మధ్య ప్రదేశ్ ప్రాంతపు సరుకు రూ. 5000-5050 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


ఆంధ్రప్రదేశ్లోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 75-80 వాహనాల శనగల రాబడి అవుతున్నాయి. కర్నూలులో జెజె రకం శనగలు రూ. 4625, ఒంగోలు జెజె శనగలు రూ. 4500, కాక్-2 కాబూలీ శనగలు రూ. 6750, డాలర్ శనగలు రూ. 8400 మరియు ఆంధ్ర, కర్ణాటక ప్రాంతం శనగలు ఈరోడ్ డెలివరి రూ. 5050, తాలికోట్ సరుకు రూ.5100 ధరతో వ్యాపారమైంది.


కర్ణాటకలోని అన్ని మార్కెట్లలో కలిసి 15-20 వేల బస్తాల రాబడిపై స్థానికంగా రూ. 4500-4700 మరియు మహారాష్ట్రలోని లాతూర్లో 15 వేల బస్తాల కొత్త శనగల రాబడిపై విజయ, అన్నిగిరి రూ.4500-4900, అమరావతిలో 7-8 వేల బస్తాలు, కరంజాలో 5 వేల బస్తాలు, దరియాపూర్లో 4 వేల బస్తాలు, జాల్నాలో 3-4 వేల బస్తాలు, ఇతర ఉత్పాదక కేంద్రాలలో కలిసి 30-35 వేల బస్తాల రాబడిపై రూ. 4500-4600, విశాల్ రూ. 4700, చాపా రకం రూ. 4600 ధరతో వ్యాపారమెంది.


రాజస్థాన్లో 8-10 వేల బస్తాల రాబడిపై రూ. 4500-4700, జెపూర్లో రూ. 5025-5075, పప్పు రూ. 5825 ధరతో వ్యాపారమెంది.


మధ్య ప్రదేశ్లో దినసరి 10-12 వేల బస్తాల రాబడిపె రూ. 4500-4950, ఇండోర్లో దేశీ సరుకు రూ.5050, డాలర్ శనగలు రూ.8000-8800, కాబూలీ శనగలు 42-44 కౌంట్ రూ. 9300, 44-46 కౌంట్ రూ. 9150, 58-60 కౌంట్ రూ. 8550, 60-62 కౌంట్ రూ.8450, 62–64 కౌంట్ రూ. 8350 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


గుజరాత్లోని రాజ్కోట్లో 25 వేల బస్తాలు, గోండల్లో 7 వేల బస్తాలు, జామ్నగర్లో 5 వేల బస్తాలు, జూనాగడ్లో 3 వేల బస్తాలు కలిసి 15-20 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై రూ. 4250-4625 ధరతో వ్యాపారమెంది.

Comments

Popular posts from this blog