తగ్గేదే లే అంటున్న మొక్కజొన్న ధరలు

 

ఈ ఏడాది భారత్ నుండి ఎగుమతులు - పెరగడం, స్థానిక పశు ఆహారం కోసం మరియు పౌల్ట్రీ  పరిశ్రమలతో పాటు స్టార్చ్ కర్మాగారాలకు కూడా మండి డిమాండ్ పలకడంతో రబీ సీజన్ మొక్కజొన్న ధరలు తగ్గే అవకాశం లేదు. ఎందుకనగా ఖరీఫ్ సీజన్ ఉత్పత్తిలో రెత్తుల సరుకు అమ్మకాలు దాదాపు సమాప్తం అయ్యాయి. కాగా కొంతమేర సరుకు పెద్ద స్టాకిస్టుల వద్ద నిల్వ ఉంది. అయితే - రబీ సీజన్ కోసం ఈ సారి దేశంలో 19.31 లక్షల హెక్టార్లలో - మొక్కజొన్న సాగు చేపట్టబడింది. పంట కోతల తదనంతరమే అమ్మకం అవుతున్నది. కోల్కత్తాలో పౌల్ట్రీ క్వాలిటీ సరుకు ధర ప్రస్తుతం జౌ 2500-2525 మరియు లక్నో, వారణాసి, పంజాబ్ లో పౌల్ట్రీ, స్టార్చ్ కర్మాగారాల డెలివరి ధర 2500-2550 క్వాలిటీ ప్రకారం వ్యాపారమవుతున్నది.


కర్ణాటకలోని చిత్రదుర్గ్ లోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 15-20 వేల బస్తాల మొక్కజొన్న రాబడి కాగా, స్థానికంగా రూ. 2150-2300, నమక్కల్, ఉడుమల్ పేటె డెలివరి 13-14 శాతం నిమ్ము సరుకు రూ.2500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


తమిళనాడులోని కల్లకుర్చి, చిన్నసేలం, శంకరాపురం, ఉలుండరుపేట, తిరుకోవిలూరు ప్రాంతాలలో ప్రతి రోజు4-5 వేల బస్తాల మొక్కజొన్న రాబడిపై స్థానికంగా రూ. 2150-2300, ఈరోడ్, పొల్లాచి కోసం రూ.2550, టూటికుడి డెలివరి రూ. 2500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్, మడకశిర, కర్నూలు ప్రాంతాలలో కొత్త మొక్కజొన్న స్థానికంగా రూ. 2000–2100, ఈరోడ్, నామక్కల్, ఉడుమల్ పేట, బెంగుళూరు డెలివరి నాణ్యమైన సరుకు రూ. 2450-2500 మరియు విజయనగరం, సాలూరు ప్రాంతాలలో 8-10 వాహనాల సరుకు రాబడిపై రూ. 1900-1950, విజయనగరం డెలివరి రూ. 2450 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమవుతున్నది. మరియు తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్ ప్రాంతాలలో దినసరి 10-12 వేల బస్తాల మొక్కజొన్న రాబడిపై స్థానికంగా రూ.2100-2150 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


మధ్య ప్రదేశ్లోని నీమచ్లో వారంలో 3-4 వేల బస్తాల రాబడిపై పచ్చ మొక్కజొన్న రూ. 2130-2150, మీడియం రూ. 2100–2120, నిమ్ము సరుకు రూ. 2050-2100 మరియు ఉజ్జయినిలో 3-4 వేల బస్తాల రాబడిపై రూ. 2100-2200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog