బలంగా అముదాల ధరలు

 

ఎన్సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం ఏప్రిల్ వాయిదా రూ. 7330 తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం వరకు రూ.7310 వద్ద ముగిసింది. అయితే 2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి ఫిబ్రవరి వరకు ఆముదం పిండి ఎగుమతులు గత వారం ఇదే వ్యవధితో పోలిస్తే 3.90 ల.ట. నుండి తగ్గి 3.49 ల.ట.లకు చేరాయి. ఇందులో దక్షిణ కొరియాకు 2.52 ల.ట., తైవాన్ కు 59,865 టన్నులు, థాయ్లాండ్కు 9816 టన్నుల ఎగుమతి అయింది.


గుజరాత్ లోని ఆముదాల ఉత్పాదక కేంద్రాలలో ప్రతి రోజు 90 వేల నుండి 1 లక్ష బస్తాల ఆముదాలు రాబడిపై నాణ్యమైన 7000-7105, మీడియం రూ. 6500-6800, యావరేజ్ రూ. 6000-6100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


తెలంగాణలోని జడ్చర్ల, నారాయణపేట, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ మార్కెట్లలో 200 బస్తాల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 4000-7125, ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాలలోని అన్ని మార్కెట్లో కలిసి గత వారం 2000 బస్తాల ఆముదాల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 6700-6825, మీడియం రూ. 5000-5800, గిద్దలూరు, పొదిలి మరియు పరిసర ప్రాంతాలలో రూ. 6200-6700 ప్రతి క్వింటాలు మరియు నరసరావుపేటలో బిఎస్ఎస్ నూనె ప్రతి 15 కిలోలు జిఎస్టితో రూ.1650, కమర్షియల్ రూ. 1620, పిండి ప్రతి క్వింటాలు రూ. 2200 మరియు హైదరాబాద్ లో ఆముదాలు రూ. 6900 ప్రతి క్వింటాలు మరియు బిఎస్ఎస్ నూనె రూ. 1620, కమర్షియల్ రూ. 1600, పిండి లూజ్ 100 కిలోలు రూ. 2000 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog